సెప్టెంబర్‌ 8న కూడా సచివాలయాల పరీక్ష | Village Secretariat Job exams also on September 8th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 8న కూడా సచివాలయాల పరీక్ష

Published Sat, Aug 3 2019 3:32 AM | Last Updated on Sat, Aug 3 2019 5:25 AM

Village Secretariat Job exams also on September 8th - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడేందుకు వీలుగా కొన్ని పోస్టులకు సెప్టెంబర్‌ 8న రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో విద్యుత్‌ శాఖ భర్తీ చేసే లైన్‌మెన్‌ ఉద్యోగాలతో కలిపి మొత్తం 20 రకాల ఉద్యోగాలన్నింటికీ సెప్టెంబర్‌ 1న రాతపరీక్ష నిర్వహించాలని మొదట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలా సెప్టెంబర్‌ 1న ఉదయం, సాయంత్రం పరీక్షలు పెట్టడానికి నిర్ణయించింది. అయితే, ఇలా కూడా కొందరు అర్హతలు ఉండి కొన్ని పోస్టులకు పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్‌ 8న ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహించనున్నామని పురపాలక పరిపాలన శాఖ కమిషనర్‌ జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌లో ఉంటుందని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగాన్ని సాధించాలన్న కసితో ప్రిపరేషన్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. మార్కెట్లోకి వెల్లువలా వచ్చిపడిన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులతో బుక్‌స్టాళ్లు రద్దీగా మారిపోయాయి. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లోని పుస్తకాల షాపులు యువతీయువకులతో నిత్యం కిటకిటలాడుతున్నాయి..    
– సాక్షి, విజయవాడ

పంచాయతీరాజ్‌ కమిషనర్‌తో నేడు సాక్షి టీవీ లైవ్‌ షో
రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం శనివారం ‘సాక్షి’ టీవీ ప్రత్యేక లైవ్‌ షో కార్యక్రమం నిర్వహించనుంది. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌తో ‘సాక్షి’ టీవీ శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే లైవ్‌ షో ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్‌ చేయాల్సిన నంబర్లు: 040–23310680, 23310726.

కేటగిరీ–1
1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5    
2. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్‌(లేదా)  వార్డు మహిళా ప్రొటెక్షన్‌  సెక్రటరీ
3. వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌    
4. వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్‌ సెక్రటరీ

రాతపరీక్ష: సెప్టెంబర్‌ 1 ఉదయం
కేటగిరీ– 2 (గ్రూప్‌–ఏ)
1. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2    
2. వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ గ్రేడ్‌–2 కేటగిరీ–2  (గ్రూప్‌–బి)
1. విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ గ్రేడ్‌–2    
2. విలేజ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌–3

రాతపరీక్ష: సెప్టెంబర్‌ 1 సాయంత్రం
కేటగిరీ–3
1. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌–2)
2. విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌
3. విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌
4. డిజిటల్‌ అసిస్టెంట్‌ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–6)
5. పశుసంవర్ధక శాఖ సహాయకుడు
6. ఏఎన్‌ఎం లేదా వార్డు హెల్త్‌ సెక్రటరీ (గ్రేడ్‌–3)
7. విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌
రాతపరీక్ష: సెప్టెంబర్‌ 1 సాయంత్రం
8. వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ (గ్రేడ్‌–2)
9. వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ (గ్రేడ్‌–2)
10. వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ
రాత పరీక్ష: సెప్టెంబర్‌ 8 ఉదయం

11. వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ    
పరీక్ష: సెప్టెంబర్‌ 8 సాయంత్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement