జాబితాలోకి విద్యుత్ ప్రసార పరికరాలు
ఈ ఏడాది చివరికల్లా పథకానికి శ్రీకారం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార(పవర్ ట్రాన్స్‌మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) చివరికల్లా పీఎల్‌ఐను వర్తింపచేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్‌మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు.
మరోవైపు ప్రభుత్వం పునరుత్పాదక(రెనెవబుల్) ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వేగవంతంగా విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశీయంగా విద్యుత్ ప్రసార పరికరాల కోసం అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో పీఎల్‌ఐకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా దేశీయంగా ట్రాన్స్‌మిషన్ పరికరాల తయారీకి ప్రభుత్వం దన్నునివ్వనున్నట్లు వెల్లడించాయి. దీంతో విదేశీ మారక నిల్వలను సైతం ప్రభుత్వం ఆదా చేసుకోనుంది.
దిగుమతులే అధికం
ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, స్విచ్‌గేర్లు తదితర విద్యుత్ ప్రసార పరికరాల కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భా రత్ 33.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,840 కో ట్లు) విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment