Production Linked Incentive Scheme
-
విద్యుత్ రంగానికీ పీఎల్ఐ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార(పవర్ ట్రాన్స్మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) చివరికల్లా పీఎల్‌ఐను వర్తింపచేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం పునరుత్పాదక(రెనెవబుల్) ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వేగవంతంగా విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశీయంగా విద్యుత్ ప్రసార పరికరాల కోసం అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో పీఎల్ఐకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా దేశీయంగా ట్రాన్స్మిషన్ పరికరాల తయారీకి ప్రభుత్వం దన్నునివ్వనున్నట్లు వెల్లడించాయి. దీంతో విదేశీ మారక నిల్వలను సైతం ప్రభుత్వం ఆదా చేసుకోనుంది. దిగుమతులే అధికం ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, స్విచ్గేర్లు తదితర విద్యుత్ ప్రసార పరికరాల కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భా రత్ 33.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,840 కో ట్లు) విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంది. -
ఎల్రక్టానిక్ విడిభాగాలకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు (డ్యాష్‌బోర్డ్, ఇంజిన్లు వంటివి) 2030 నాటికల్లా డిమాండ్ అయిదు రెట్లు పెరగవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక నివేదికలో తెలిపింది. అప్పటికల్లా ఇది 240 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. మదర్‌బోర్డులు, లిథియం అయాన్ బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపింది. ఈ పరిస్థితిని తొలగించేందుకు 35–40 శాతం శ్రేణిలో అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎల్రక్టానిక్ విడిభాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని సవరిస్తే దేశీయంగా తయారీకి ఊతం లభించగలదని వివరించింది. ‘2023లో 102 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎల్రక్టానిక్స్ కోసం 45.5 బిలియన్ డాలర్ల విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు డిమాండ్ నెలకొంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి కోసం 240 బిలియన్ డాలర్ల కాంపోనెంట్స్, సబ్ అసెంబ్లీలు అవసరమవుతాయి‘ అని తెలిపింది. నివేదికలోని మరిన్ని ప్రత్యేకాంశాలు.. → 2022లో మొత్తం విడిభాగాలకు నెలకొన్న డిమాండ్‌లో బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, పీసీబీలు మొదలైన అత్యంత ప్రాధాన్యమైన ఉత్పత్తుల వాటా 43 శాతంగా నమోదైంది. ఇది 2030 నాటికి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఇవన్నీ దేశీయంగా నామమాత్రంగానే తయారవుతున్నాయి లేదా ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. → చైనా, వియత్నాం, మెక్సికో వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో తయారీ సంబంధ వ్యయాలు 10–20 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశీయంగా భారీ తయారీ కార్పొరేషన్లు లేవు. భారతీయ కంపెనీల కోసం డిజైన్ వ్యవస్థ, ముడి సరుకుల లభ్యత కోసం సరైన వ్యవస్థలాంటిది లేదు. ఇవన్నీ కూడా విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయి. → విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి ఊతమిచ్చేలా ప్రభుత్వం 6–8 ఏళ్ల పాటు ఆర్థిక తోడ్పాటును అందించే తగు స్కీమును రూపొందించాలి. → యూరోపియన్ యూనియన్, యూకే, జీసీసీ దేశాలు, ఆఫ్రికాలోని వర్ధమాన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేయాలి. → భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్ సృష్టించడం ద్వారా ఎగుమతులు పెరగడంతో పాటు దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం పాలసీపరమైన మద్దతునిస్తే 2026 నాటికి 2.8 లక్షల మేర ఉద్యోగాల కల్పన జరిగేందుకు సహాయకరంగా ఉంటుంది. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది. -
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్‌కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
పోటీతత్వంతోనే అంతర్జాతీయంగా రాణింపు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆరంభ మద్దతుగానే పరిశ్రమ చూడాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమ మరింత వృద్ధి చెందాలంటే పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పీఎల్ఐ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు, దీని కింద ప్రయోజనం పొందిన సంస్థలు నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. భారత్‌ను తయారీ కేంద్రంగా మలచాలన్నది ప్రభుత్వ యోచన అని, ఈ విషయంలో అసలైన సుదీర్ఘ ప్రయాణం ముందున్నట్టు చెప్పారు. పీఎల్ఐ పథకంపై నిర్వహించిన కార్యక్రమంలో వందలాది భాగస్వాములు, అధికారులు పాల్గొన్నారు. ‘‘ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడే విధంగా మిమ్మల్ని మార్చాలని కోరుకోవడం లేదు. మీ కృషిని ఆరంభించేందుకు ప్రోత్సాహంగానే (కిక్‌స్టార్ట్) దీన్ని చూడాలి. కానీ, అంతిమంగా పోటీయే నిలుస్తుంది. ఒకరితో మరొకరు, ప్రపంచంతోనూ పోటీ పడి రాణించాల్సి ఉంటుంది’’అని గోయల్ చెప్పారు. సౌకర్యమని చెప్పి దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, పరిశ్రమ క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారించాలని సూచించారు. భారత్‌ను తయారీ శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం, లబ్దిదారులు (కంపెనీలు) మధ్య సహకారం అవసరమని, ఒకరికొకరి మద్దతు కూడా కీలకమన్నారు. విలువ జోడించాలి.. భారత తయారీలో స్థూల విలువ జోడింపు (జీవీఏ/విడిభాగాలు కూడా ఇక్కడే తయారైనవి) కేవలం 17.4 శాతమే ఉందని, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు, మరింత మంది ఉపాధి కల్పనకు ఇది చాలదని డీపీఐఐటీ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. పరిశ్రమ మరింత విలువను జోడించడంపై దృష్టి సారించాలని సూచించారు. మొబైల్, వైట్గూడ్స్లో దేశీయంగా ఉత్పత్తుల తయారీకి విలువ తోడవుతున్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చెప్పారు. 10 ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, 14పీఎల్ఐ పథకాలకు సంబంధించి రంగాల వారీ ముఖ్య సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. -
పీఎల్ఐ కింద రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి, ఎనిమిది రంగాలకు రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్ర సర్కారు మంజూరు చేసింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ విభాగం డీపీఐఐటీ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.11,000 కోట్లను మంజూరు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ప్రకటించారు. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకే చూస్తే అక్టోబర్ నాటికి జారీ చేసిన మొత్తం రూ.1,515 కోట్లుగా ఉన్నట్టు, 2022–23లో రూ.2,900 కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. పెద్ద స్థాయి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ, ఐటీ హార్డ్‌వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్స్ రంగాలకు ఈ ప్రోత్సాహకాలను అందించినట్టు తెలిపారు. శామ్సంగ్ కంపెనీకి సంబంధించి ప్రోత్సాహకాల క్లెయిమ్‌లలో ఒక కేసు పరిష్కారమైనట్టు చెప్పారు. 2021లో కేంద్ర సర్కారు 14 రంగాలకు పీఎల్ఐ పథకాల కింద ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. టెలికం, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా తదితర రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. వీటికి సంబంధించి దేశీ తయారీని ప్రోత్సహించాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల పంపిణీ అన్నది ఆయా శాఖల బాధ్యతగా ఠాకూర్ చెప్పారు. ప్రాజెక్టు పర్యవేక్షక ఏజెన్సీలు (పీఎంఏలు), కంపెనీల మధ్య సరైన సమాచారం లేకపోవడం వల్ల సమయం వృధా అవుతున్న సందర్భాలున్నట్టు తెలిపారు. దీంతో దరఖాస్తుల మదింపు ప్రక్రియకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రామాణిక విధానాన్ని రూపొందించుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు పీఎల్ఐ కింద 14 రంగాల్లోని కంపెనీల నుంచి 746 దరఖాస్తులు వచ్చాయని, ఇవి రూ.3 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రాజీవ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. 2023 నవంబర్ నాటికి రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు చెప్పారు. వీటి ద్వారా రూ.8.61 లక్షల కోట్ల అమ్మకాలు, 6.78 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఫార్మా, టెలికం తదితర రంగాల్లో ప్రోత్సాహకాలను అందుకునే వాటిల్లో 176 ఎంఎస్ఎంఈలు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. పీఎల్ఐ ప్రోత్సాహకాల మద్దతుతో రూ.3.2 లక్షల కోట్ల ఎగుమతులు నమోదైనట్టు ఠాకూర్ తెలిపారు. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికం రంగాల భాగస్వామ్యం ఎక్కువగా ఉందన్నారు. -
27 సంస్థలకు ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీము
న్యూఢిల్లీ: దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీము కింద 27 సంస్థలు ఎంపికయ్యాయి. అనుమతి పొందిన వాటిలో డెల్, హెచ్‌పీ, ఫ్లెక్స్‌ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 95 శాతం కంపెనీలు (23) ఇప్పటికే తయారీకి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగతా నాలుగు కంపెనీలు వచ్చే 90 రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించగలవని ఆయన వివరించారు. ‘ఈ 27 దరఖాస్తులతో దాదాపు రూ. 3,000 కోట్ల మేర పెట్టుబడులు రాగలవు. అంతకన్నా ముఖ్యంగా విలువను జోడించే ఉత్పత్తుల తయారీ వ్యవస్థ భారత్ వైపు మళ్లగలదు‘ అని మంత్రి పేర్కొన్నారు. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ తయారీలో భారత్ దిగ్గజంగా ఎదిగేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. అదనంగా రూ. 3.5 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీకి, ప్రత్యక్షంగా 50,000 మంది .. పరోక్షగా 1.5 లక్షల మంది ఉపాధి పొందడానికి స్కీము దోహదపడగలదని మంత్రి చెప్పారు. -
కెమికల్స్, పెట్రోకెమికల్స్‌కు పీఎల్ఐ
న్యూఢిల్లీ: కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ తరహా ఉత్పత్తులకు భారత్‌ను తయారీ కేంద్రంగా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కెమికల్స్, పెట్రోకెమికల్స్ తయారీ రంగం నిర్వహిస్తున్న మూడో ఎడిషన్ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. కఠినమైన కాలుష్య నియంత్రణలు, పెరుగుతున్న కారి్మక వ్యయాలతో రసాయనాల పరిశ్రమలోని అంతర్జాతీయ కంపెనీలు తమ తయారీ వసతులను వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్నాయని.. వీటి తయారీకి భారత్ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగే అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. దీనికితోడు ఈ ఉత్పత్తులకు భారత్ సైతం పెద్ద వినియోగ కేంద్రంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశీయంగా మిగులను ఎగుమతి చేసుకోవచ్చని, ఇందుకు ప్రభుత్వం విధానాల పరంగా మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘‘భారత్ తయారీ కేంద్రంగా అవతరించేందుకు మేము సానుకూలంగా ఉన్నాం. అందుకే కెమికల్స్, పెట్రోకెమికల్స్‌కు పీఎల్ఐని పరిశీలిస్తున్నాం. సుస్థిరత, కర్బన ఉద్గారాల విడుదల, కాలుష్యం, బూగర్భనీటి కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ అదనపు సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలి. 2047 నాటికి ఇంధన పరంగా స్వావలంబన, 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రతీ పరిశ్రమ, రంగం తన వంతు సహకారం అందించకపోతే ఈ లక్ష్యాలు సాకారం కావు’’అని మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. పర్యావరణ అనుకూలమైన వృద్ధికే తమ ప్రాధాన్యం అని చెప్పారు. కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రోత్సాహకానికి ప్రభుత్వం రూ.19,744 కోట్లను ప్రకటించడాన్ని గుర్తు చేశారు. -
చైనాకు 30 ఏళ్లు పట్టింది .. మనకు పదేళ్లే
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద వ్యవధిలో అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు పురోగమిస్తోందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆ స్థాయికి చేరుకునేందుకు చైనాకు 25–30 సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్ నుంచి కార్ల వరకూ అన్నింటా ఉపయోగించే చిప్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు భారత్ పురోగమనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. ‘ఈ 10 బిలియన్ డాలర్ల తోడ్పాటుతో వచ్చే 10 ఏళ్లలో సెమీకండక్టర్ల విభాగంలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు వెడుతోంది. దీనికోసం చైనా వంటి దేశాలకు 25–30 ఏళ్లు పట్టేసింది. అయినా అవి ఇంకా పూర్తిగా సఫలం కాలేదు ‘అని మంత్రి చెప్పారు. మెమరీ సొల్యూషన్స్ దిగ్గజం మైక్రాన్ తలపెట్టిన ఏటీఎంపీ ప్రాజెక్టుతో సెమీకండక్టర్ల పరిశ్రమలో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో .. వేదాంత, ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజాలు ఇక్కడ చిప్స్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. -
పీఎల్ఐ పథకంలో రిలయన్స్
న్యూఢిల్లీ: సోలార్ ఫొటోవోల్టాయిక్ తయారీ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ ప్రకటిత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం రెండో దశలో 11 కంపెనీలకు చోటు లభించింది. వీటిలో రిలయన్స్, ఫస్ట్ సోలార్, ఇండోసోల్ తదితరాలున్నాయి. మొత్తం 39,600 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. పథకంలో భాగంగా ఇందుకు రూ. 14,007 కోట్లు వెచ్చించనుంది. అత్యధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రెండో దశలో భాగంగా విద్యుత్ శాఖ తాజా ప్రాజెక్టులను కేటాయించింది. వీటిలో 7,400 మెగావాట్లు 2024 అక్టోబర్‌కల్లా ప్రారంభంకావచ్చని అంచనా. ఈ బాటలో 2025 ఏప్రిల్‌కల్లా 16,800 మెగావాట్లు, 2026 ఏప్రిల్‌కు మరో 15,400 మెగావాట్లు సిద్ధంకానున్నట్లు అంచనా. వెరసి రెండో దశలో భాగంగా మొత్తం రూ. 93,041 కోట్ల పెట్టుబడులు లభించనున్నాయి. అంతేకాకుండా 1,01,487 ఉద్యోగాల సృష్టికి అవకాశముంది. వీటిలో 35,010 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 66,477 పరోక్షంగా లభించే వీలుంది. కంపెనీల వివరాలు పాలీసిలికాన్, ఇన్గాట్ వేఫర్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్ బాస్కెట్లో రిలయన్స్, ఇండోసోల్ విడిగా 6,000 మెగావాట్ల చొప్పున ప్రాజెక్టులను పొందాయి. ఈ బాటలో ఫస్ట్ సోలార్ 3,400 మెగావాట్లను పొందింది. వేఫర్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ బాస్కెట్లో వారీ 6,000 మెగావాట్లు, రీన్యూ 4,800 మెగావాట్లు, అవాడా 3,000 మెగావాట్లు, గ్రూ 2,000 మెగావాట్లు, జేఎస్‌డబ్ల్యూ 1,000 మెగావాట్ల ప్రాజెక్టులు పొందాయి. ఇక సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌లో టాటా పవర్ సోలార్ 4,000 మెగావాట్లు, విక్రమ్ 2,400 మెగావాట్లు, యాంపిన్ 1,000 మెగావాట్లు చొప్పున ప్రాజెక్టులు అందుకున్నాయి. హైటెక్నాలజీతో.. హై టెక్నాలజీ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ వేల్యూ చైన్‌లో దేశం బలపడుతున్నట్లు పీఎల్ఐ పథ కం విజయంపై స్పందిస్తూ విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. తాజా సామర్థ్య విస్తరణ ద్వారా సోలార్ తయారీ రంగంలో దేశం స్వావలంబన దిశగా భారీ అడుగులు వేస్తున్నట్లు తెలియజేశా రు. కాగా.. పథకం తొలి దశలో భాగంగా 2022 నవంబర్–డిసెంబర్లో 8,737 మెగావాట్ల సమీకృత సామర్థ్య ప్రాజెక్టులను కేటాయించింది. వెరసి పీ ఎల్ఐ పథకం రెండు దశల్లో కలిపి మొత్తం 48,337 మెగావాట్ల ప్రాజెక్టులు కేటాయించింది. రూ. 18,500 కోట్లకుపైగా ఆర్థిక మద్దతు ప్రకటించింది. -
Budget 2023: PLI పథకం విస్తరణ దిశగా అడుగులు
ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇది. దీంతో.. బడ్జెట్ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తయారీ రంగానికి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి..? అన్న చర్చ జరుగుతోంది. తయారీ రంగం అభివృద్ధి పథంలో వేగంగా అడుగులు వేసేలా.. భారీ కేటాయింపులు ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. దీర్ఘకాలిక అభివృద్ధి, ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలో తయారీ రంగానిది కీలక పాత్ర. PLI పథకాన్ని మరింత విస్తరించి, దీని పరిధిలోకి మరిన్ని సెక్టార్లను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. 14 రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో ఈ పథకం రూపొందించబడింది. ప్రస్తుతం PLI స్కీమ్ లో ఆటోమొబైల్స్, దాన్ని అనుబంధ వస్తువులు, గృహోపకరణాలు, టెక్స్ టైల్స్, ఆహార పదార్థాలు, సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్, స్టీల్ తదితర ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ లో బొమ్మలు, సైకిళ్లు, లెదర్, ఫుట్‌వేర్ తయారీ పరిశ్రమలను కూడా PLI స్కీమ్ పరిధిలోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థకు PLI పథకం ఎంతో ముఖ్యమైనది. ప్రాదేశీయ తయారీని ప్రపంచవ్యాప్తంగా పోటీగా మార్చడంతో పాటు తయారీరంగంలో గ్లోబల్ ఛాంపియన్లను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 2022 సెప్టెంబర్ నాటికి PLI పథకం ద్వారా భారీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.4,784 కోట్లను ఆకర్షించింది. రూ. 2,03,952 కోట్ల విలువైన ఉత్పత్తిని సాధించింది. రూ.80,769 కోట్ల ఎగుమతులు జరిగాయి. PLI పథకంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం గణనీయమైనది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. 2022 డిసెంబర్ 16 నాటికి 13 పథకాలకు అనుమతులు లభించగా.. వీటిలో 100కు పైగా MSMEలకు లబ్ది చేకూరింది.