power transmission
-
విద్యుత్ రంగానికీ పీఎల్ఐ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార(పవర్ ట్రాన్స్మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) చివరికల్లా పీఎల్‌ఐను వర్తింపచేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం పునరుత్పాదక(రెనెవబుల్) ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వేగవంతంగా విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశీయంగా విద్యుత్ ప్రసార పరికరాల కోసం అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో పీఎల్ఐకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా దేశీయంగా ట్రాన్స్మిషన్ పరికరాల తయారీకి ప్రభుత్వం దన్నునివ్వనున్నట్లు వెల్లడించాయి. దీంతో విదేశీ మారక నిల్వలను సైతం ప్రభుత్వం ఆదా చేసుకోనుంది. దిగుమతులే అధికం ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, స్విచ్గేర్లు తదితర విద్యుత్ ప్రసార పరికరాల కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భా రత్ 33.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,840 కో ట్లు) విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంది. -
కల్పతరులో జేఎంసీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్‌లో నిర్మాణ రంగ అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్టŠస్ విలీనానికి దారి ఏర్పడింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంయుక్త సంస్థ దేశీయంగా అతిపెద్ద లిస్టెడ్ ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు కల్పతరు పేర్కొంది. ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ జేఎంసీ విలీనానికి అనుమతించినట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ దేశీయంగా భారీ కార్యకలాపాలు కలిగి ఉండగా.. 67 దేశాలలోనూ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ, బిల్డింగులు, ఫ్యాక్టరీలు, వాటర్, రైల్వేలు, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర పలు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు వివరించింది. ఆర్డర్ బుక్ రూ. 43,000 కోట్లకు చేరనున్నట్లు తెలియజేసింది. కాగా.. 2022 ఫిబ్రవరిలో కల్పతరు, జేఎంసీ బోర్డులు విలీనానికి ఆమోదముద్ర వేశాయి. దీనిలో భాగంగా జేఎంసీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 4 షేర్లకుగాను 1 కల్పతరు షేరుని కేటాయిస్తారు. -
వైఫైలా ‘వైర్లెస్ పవర్’.. కేబుల్స్ లేకుండానే మొబైల్ ఛార్జింగ్!
సియోల్: ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఛార్జింగ్ అయిపోతే చికాకు పడతారు. ఛార్జింగ్ పెట్టేందుకు కేబుల్ కోసం వెతుకుతారు. ఇంట్లో ఉంటే పర్వాలేదు.. కానీ వేర ప్రదేశానికి వెళ్లినప్పుడు కేబుల్స్‌ను తీసుకెళ్లటం కొంత భారంగానే ఉంటుంది. అయితే.. ఇకపై ఆ ఇబ్బందులు తప్పబోతున్నాయి. ఎలాంటి కేబుల్స్ లేకుండానే విద్యుత్తు సరఫరా చేసే ప్రయోగంలో తొలి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. దక్షిణ కొరియాలోని సెజోంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త ‘వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్’ను అభివృద్ధి చేశారు. ఇన్‌ఫ్రారెండ్ లైట్స్ ద్వారా సురక్షితంగా పవర్‌ను ట్రాన్స్ఫర్ చేసి చూపించారు. 30 మీటర్ల దూరంలోని సెన్సార్లకు ఛార్జింజ్ చేసేందుకు 400 మిల్లీవాట్ల పవర్‌ను ఈ వ్యవస్థ విజయవంతంగా సరఫరా చేసింది. దీనిని మొబైల్ పరికరాలను ఛార్జ్ చేసే విధంగా విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచే పనిలోపడ్డారు శాస్త్రవేత్తలు. ‘పవర్ డివైజ్‌లను వైర్‌లెస్‌గా మార్చటం ద్వారా ఫోన్స్, టాబ్లెట్స్ వంటి వాటికి కేబుల్స్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం రాదు. అలాగే.. ఐఓటీ పరికరాలు, తయారీ ప్లాంట్లలోని సెన్సెర్లను ఛార్జ్ చేయవచ్చు.’ అని పరిశోధన బృంద నాయకుడు జిన్యోంగ్ హా తెలిపారు. మరోవైపు.. వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ కోసం పలు టెక్నిక్‌లపై పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. అయితే.. మీటర్ల వ్యవధిలో తగినంత విద్యుత్తును పంపడం సవాలుగా మారిందన్నారు. ఈ క్రమంలో.. పరిశోధకులు 'డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్' అనే పద్ధతి అన్ని టెక్నిక్‌ల కంటే మేలైనదిగా తేల్చారు. ఏదైనా వస్తువు, వ్యక్తి ఈ సిస్టమ్‌లోని లైట్‌ను అడ్డుకోనంత వరకు తక్కువ స్థాయి పవర్‌ను సురక్షితంగా పంపించవచ్చని చెప్పారు. ఎలా పనిచేస్తుంది? డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్ అనేది కొంత వరకు సంప్రదాయ లేజర్ లాగానే పని చేస్తుంది. ఒకే వస్తువులో లేజర్ పరికరాలను అమర్చకుండా.. ట్రాన్స్మిటర్, రిసీవర్ రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు ఒకే లైన్లో ఉండి లేజర్ లైట్ అనుసంధానమవుతే.. ఈ వ్యవస్థ లైట్ ఆధారిత పవర్‌ను లోడ్‌కు సరఫరా చేస్తుంది. ఒకవేళ ట్రాన్స్మిటర్, రిసీవర్ల మధ్య ఏదైనా అడ్డుపడితే ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా పవర్ సేఫ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. పరిశోధకులు రిసీవర్, ట్రాన్స్మిటర్లను 30 మీటర్ల దూరం వేరు చేశారు. ట్రాన్స్మిటర్ ఎర్బియం-డోప్డ్ ఫైబర్ యాంప్లిఫైయర్ ఆప్టికల్ సోర్స్‌తో తయారు చేశారు. రిసీవర్ యూనిట్లో రెట్రో రిఫ్లెక్టర్, ఆప్టికల్ సిగ్నల్‌ను ఎలక్ట్రికల్ పవర్‌గా మార్చే ఫోటోవోల్టాయిక్ సెల్, పవర్ డెలివరీ అవుతున్నప్పుడు ప్రకాశించే ఎల్ఈడీ ఉన్నాయి. ఈ వ్యవస్థ విజయవంతంగా విద్యుత్తును ట్రాన్స్ఫర్ చేసి చూపించింది. ఇదీ చదవండి: వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం -
ఇక్కడా కింగ్‌పిన్ సంజూ భండారీనే !
బనశంకరి: కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తాజాగా 12 మంది అరెస్టయ్యారు. గదగ్ మున్సిపల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మారుతితో డీల్ కుదుర్చుకున్నారు. మారుతి కుమారుడు సమీతకుమార్ సోనవణి ప్రశ్నాపత్రం లీకేజీ చేసి ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కింగ్‌పిన్ సంజుభండారీతో అభ్యర్థులు నగదు వ్యవహారాలు నిర్వహించారు. కీ ఆన్సర్ వచ్చిన తక్షణం మూడు లక్షలు, ఫలితాలు అనంతరం ఐదు లక్షలు ఇవ్వాలని ఒప్పందం. సునీల్భంగి అభ్యర్థులను సంజుభండారీకి పరిచయం చేశారు. పరీక్ష పాస్ చేసే డీల్ కుదుర్చుకుని కింగ్‌పిన్ సంజు కోట్లాది రూపాయలు నగదు సంపాదించాడు. గత ఏడాది సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీలో సంజుభండారీ అరెస్టయ్యాడు. గదగ్ పీయూ కళాశాల నుంచే ప్రశ్నాపత్రం బయటకు బెయిల్‌పై విడుదలైన కేపీటీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడి పరారీలో ఉన్న సంజుభండారీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గదగ్ మున్సిపల్ పీయూ కాలేజీ నుంచి ప్రశ్నాపత్రం లీక్ కాగా మున్సిపల్ కాలేజీ వైస్‌ప్రిన్సిపాల్ అతడి కుమారుడు రూమ్ సూపర్వైజర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ చేశారు. గైర్హాజరైన అభ్యర్థి ప్రశ్నాపత్రం ఫొటో తీసి క్యామ్ స్క్యానర్తో కింగ్‌పిన్ సంజుభండారీ మొబైల్‌కు పేపర్ పంపించారు. 12 మంది అరెస్ట్ గోకాక్ డీవైఎస్పీ మనోజ్‌కుమార్ నాయక్ నేతృత్వంలోని పోలీస్ బృందం తీవ్రంగా గాలించి పరీక్షలో అక్రమాలకు పాల్పడిన 12 మందిని శుక్రవారం అరెస్ట్ చేశారు. బెళగావి, గదగ్, ఉత్తర కన్నడ జిల్లాల్లో ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడ్డారు. స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ డీవైస్ వినియోగించి పరీక్షలో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారు. గోకాక్‌లో ప్రశ్నాపత్రం లీక్‌చేసిన అభ్యర్థి సిద్దప్పమదిహళ్లి పోలీసులకు పట్టుబడ్డాడు. సిద్దప్పమదిహళ్లిని అరెస్ట్‌చేసి విచారణ చేపట్టగా పరీక్షలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇతను అందించిన సమాచారం ఆధారంగా 12 మందితో పాటు సిమ్‌కార్డులు, కాల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు కింగ్పిన్లు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బెళగావి గ్రామీణ ఎస్పీ సంజీవ్ పాటిల్ ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేశారు. (చదవండి: తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ) -
పచ్చని పొలాల్లో పవర్ టవర్ల చిచ్చు
సాక్షి, చెన్నై : పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్మిషన్ టవర్ల ఏర్పాటును నిరసిస్తూ పెరుందరైలో రిలే నిరాహార దీక్షలకు దిగిన ఆరుగురు రైతుల ఆరోగ్యం క్షీణించింది. ఆందోళన బాట పట్టిన రైతులు శుక్రవారం ఉదయం సొమ్మసిల్లగా వారిని ఆస్పత్రికి తరలించారు. మొల్లక్కరై గ్రామంలో గత ఆరురోజులగా నిరాహార దీక్ష చేస్తున్న నలుగురు మహిళలు సహా ఆరుగరిని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. నిరసన చేపట్టిన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. పచ్చని పొలాల్లో హైట్రాన్స్మిషన్ టవర్లను ఏర్పాటు చేస్తుండటంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళనలో పాల్గొంటున్న 100 మందికి పైగా రైతులు చెబుతున్నారు. ఈ ఆందోళనలో భాగంగా గత ఆరు రోజులుగా ఆరుగురు రైతలు రిలే నిరాహార దక్షలో పొల్గొంటున్నారు. నిరసన బాట పట్టిన రైతులను గురువారం రాత్రి పరామర్శించిన డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ వారికి భరోసా కల్పించారు. రైతులు తమ ఆందోళన విరమించాలని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వారి సమస్యలను ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. -
కిటికీలే టీవీలు
టొరొంటో: మీ ఇంట్లో కిటికీలు ఉన్నాయా.. దాంట్లో ఏం కనిపిస్తుంది? ఇదేం పిచ్చి ప్రశ్న.. కిటికీలోంచి అవతల ఉన్నవన్నీ కనిపిస్తాయి అంటారా.. మరి అదే కిటికీలో సినిమాలు, సీరియళ్లు, క్రికెట్ వంటివన్నీ చూడగలిగితే! అంతపెద్ద టీవీలాగా ఆ కిటికీ మారిపోతే..! బాగుంటుంది కదూ... అలాం టి అధునాతన గాజు సాంకేతికతను కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చిన్న చిన్న గాజు ముక్కలకు వెండి వంటి లోహాలను అతి సన్నటి పూతగా పూస్తే ఆ గాజు మరింత పారదర్శకతను సంతరించుకుంటుందని... అదే సమయంలో లోహాల ద్వారా విద్యుత్ ప్రసారం చేయవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన కెన్నత్ చౌ తెలిపారు. ఇలా విద్యుత్ ప్రసారం చేయడం ద్వారా ఆ గాజు పలకను టీవీ తెరలాగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాకుండా ఎండాకాలంలో వేడిని అడ్డుకునేలా, చలికాలంలో ఉష్ణాన్ని గదిలోపలికి ప్రసరింపజేసేలా ఈ గాజు అద్దాలను వినియోగించుకోవచ్చని.. దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో తోషిబా 185 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తోషిబా కార్పొరేషన్ రూ. 185 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ యూని ట్ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా(టీటీడీఐ) సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని, ఇందుకోసం రూ. 185 కోట్లు (30 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ ఎలక్ట్రికల్స్‌ను గతేడాది రూ. 1,230 కోట్లకు తోషిబా కార్పొరేషన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లలో రూ.615 కోట్ల ఇన్వెస్ట్మెంట్... దేశీయ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో 2016లోగా రూ.615 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయంలో భాగంగా ఈ పెట్టుబడులను చేస్తున్నట్లు టీటీడీఐ కత్సుతోషి తొదా ఆ ప్రకటనలో తెలిపారు. దేశీయ విద్యుత్ రంగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టిసారించామని, ఈ పెట్టుబడులతో పెద్ద ట్రాన్స్ఫార్మర్స్తోపాటు కొత్త తరహా స్విచ్గేర్స్ను తయారు చేయనున్నట్లు తెలిపారు. 500 ఎంవీఏ సామర్థ్యం గల ఈ ట్రాన్స్ఫార్మర్స్ 765కేవీ విద్యుత్ ఉత్పత్తిని తట్టుకుంటాయన్నారు. కొత్తగా తయారు చేసే స్విచ్గేర్స్ హైవోల్టేజ్ ప్రోడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తాయన్నారు. దేశీయ విద్యుత్ సరఫరా, పంపిణీ మార్కెట్లో 2016 నాటికి 20 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కుత్సతోషి తెలిపారు. 2017 నాటికి ప్రస్తుత విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఐదు రెట్లు పెంచే విధంగా 765కేవీ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భారీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్స్, స్విచ్గేర్స్కు డిమాండ్ బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. యూరప్, ఏషియన్, ఆఫ్రికా దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతులు చేసే విధంగా బారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్లు కుత్సతోషి తెలిపారు. -
విద్యుత్ ప్రసార నష్టాలు రూ.4 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: విద్యుత్ కొరత కారణంగా భారత జీడీపీకి రూ.4,14,800 కోట్లు నష్టం(మొత్తం జీడీపీలో ఇది 0.4%) వాటిల్లిందని ఫిక్కీ తాజా నివేదిక పేర్కొంది. విద్యుత్ ప్రసారంపై ఫిక్కీ ఈ నివేదికను రూపొందించింది. ముఖ్యాంశాలు..., విద్యుత్ ప్రసారంలో ఉన్న సమస్యల కారణంగా విద్యుత్ కొరత ఏర్పడుతోంది. భవిష్యత్తులో విద్యుత్తుకు డిమాండ్, విద్యుదుత్పత్తి కూడా పెరుగుతాయి. కాబట్టి విద్యుత్ ప్రసార సంబంధిత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంది. ఈ రంగంలో పెట్టుబడుల కొరత తీవ్రంగా ఉంది. విద్యుదుత్పత్తికి పెట్టే పెట్టుబడుల్లో సగం విద్యుత్ ప్రసార రంగంలో పెట్టాల్సి ఉంది. కానీ భారత్‌లో ఇవి 30 శాతమే. విద్యుత్ ప్రసార సామర్థ్యంపై సాంకేతిక, వాణి జ్య నష్టాలు తీవ్రప్రభావం చూపుతున్నాయి. ఈ తరహా నష్టాలు భారత్‌లో 26 శాతంగా ఉండగా, ప్రపంచవ్యాప్త సగటు 9%గా ఉంది. ఈ రంగంలో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబ డులు అవసరం. వీటిల్లో 1,900 కోట్ల డాలర్లు పవర్ గ్రిడ్ నుంచి వస్తాయని అంచనా.