ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెన్నై : పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ టవర్ల ఏర్పాటును నిరసిస్తూ పెరుందరైలో రిలే నిరాహార దీక్షలకు దిగిన ఆరుగురు రైతుల ఆరోగ్యం క్షీణించింది. ఆందోళన బాట పట్టిన రైతులు శుక్రవారం ఉదయం సొమ్మసిల్లగా వారిని ఆస్పత్రికి తరలించారు. మొల్లక్కరై గ్రామంలో గత ఆరురోజులగా నిరాహార దీక్ష చేస్తున్న నలుగురు మహిళలు సహా ఆరుగరిని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. నిరసన చేపట్టిన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు.
పచ్చని పొలాల్లో హైట్రాన్స్‌మిషన్ టవర్లను ఏర్పాటు చేస్తుండటంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళనలో పాల్గొంటున్న 100 మందికి పైగా రైతులు చెబుతున్నారు. ఈ ఆందోళనలో భాగంగా గత ఆరు రోజులుగా ఆరుగురు రైతలు రిలే నిరాహార దక్షలో పొల్గొంటున్నారు. నిరసన బాట పట్టిన రైతులను గురువారం రాత్రి పరామర్శించిన డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ వారికి భరోసా కల్పించారు. రైతులు తమ ఆందోళన విరమించాలని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వారి సమస్యలను ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment