కిటికీలే టీవీలు | Windows itself TVs | Sakshi
Sakshi News home page

కిటికీలే టీవీలు

Published Tue, Feb 23 2016 8:27 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

కిటికీలే టీవీలు

కిటికీలే టీవీలు

టొరొంటో: మీ ఇంట్లో కిటికీలు ఉన్నాయా.. దాంట్లో ఏం కనిపిస్తుంది? ఇదేం పిచ్చి ప్రశ్న.. కిటికీలోంచి అవతల ఉన్నవన్నీ కనిపిస్తాయి అంటారా.. మరి అదే కిటికీలో సినిమాలు, సీరియళ్లు, క్రికెట్ వంటివన్నీ చూడగలిగితే! అంతపెద్ద టీవీలాగా ఆ కిటికీ మారిపోతే..! బాగుంటుంది కదూ... అలాం టి అధునాతన గాజు సాంకేతికతను కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

చిన్న చిన్న గాజు ముక్కలకు వెండి వంటి లోహాలను అతి సన్నటి పూతగా పూస్తే ఆ గాజు మరింత పారదర్శకతను సంతరించుకుంటుందని... అదే సమయంలో లోహాల ద్వారా విద్యుత్ ప్రసారం చేయవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన కెన్నత్ చౌ తెలిపారు. ఇలా విద్యుత్ ప్రసారం చేయడం ద్వారా ఆ గాజు పలకను టీవీ తెరలాగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాకుండా ఎండాకాలంలో వేడిని అడ్డుకునేలా, చలికాలంలో ఉష్ణాన్ని గదిలోపలికి ప్రసరింపజేసేలా ఈ గాజు అద్దాలను వినియోగించుకోవచ్చని.. దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement