
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం(ఫిబ్రవరి17) తెల్లవారుజామున వచ్చిన భూకంపానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 పాయింట్లుగా నమోదైంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన భూకంపమే అయినప్పటికీ ఢిల్లీ వాసుల కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసింది.
అరుదైన శబ్దాలతో వారిని భయభ్రాంతులకు గురి చేసింది. వారిని ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసేలా చేసింది. తక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇంత ప్రభావం చూపడానికి శాస్త్రవేత్తలు వెల్లడించార. భూకంప కేంద్రం భూ ఉపరితం నుంచి అతి తక్కువగా కేవలం 5 కిలోమీటర్ల లోతులో ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువలోతులో వచ్చేవాటికంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. భూ ప్రకంపనలు వేగంగా భూఉపరితలాన్ని చేరుకోవడమే ఇందుకు కారణం.
భయంకర శబ్దాలు ఎందుకు వస్తాయి..
తక్కువ లోతులో సంభవించే భూకంపాలు వింత,భయంకర శబ్దాలకు కారణమవుతాయని జియాలజిస్టులు వివరిస్తున్నారు. ఈ భూకంపాల వల్ల కలిగే ప్రకంపనలు భూమిపైకి వేగంగా చేరుకుని గాలిలో కలిసినపుడు శబ్దాలు ఉద్భవిస్తాయి.
భూకంపాల నుంచి వెలువడే తొలి తరంగాలను ‘పీ’ వేవ్స్‌గా పిలుస్తారు. ఇవి వాతావరణంలో కలిసినపుడు శబ్దాలు వస్తాయి. భూఉపరితలం ధృడంగా ఉండి ఈ తరంగాలను గట్టిగా అడ్డుకున్నప్పుడు శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఢిల్లీలో జరిగింది కూడా ఇదే కావచ్చనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment