British Columbia University
-
స్మార్ట్ఫోన్ లాక్ మీ వయసు చెబుతోంది!
స్మార్ట్ఫోన్ను మీరెలా లాక్ చేస్తారన్న విషయం ఆధారంగా మీ వయసు ఎంతో చెప్పేవచ్చునని అంటున్నారు బ్రిటిష్ కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. అదెలా అనుకుంటున్నారా. చిన్న విషయం చూద్దాం. పాతతరం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఫోన్ తనంతట తానే లాక్ అయిపోవాలని కోరుకుంటే.. కొత్తతరం వాళ్లు దీనికి భిన్నమైన ఆలోచన చేస్తారని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాకుండా పాతతరం వాళ్లు పిన్ నెంబర్ను వాడితే.. కొత్తతరం వాళ్లు వేలిముద్రలు వాడతారు. స్మార్ట్ఫోన్ల వాడకానికి వయసుకు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించేందుకు జరిగిన తొలి అధ్యయనం ఇదేనని అంటున్నారు కాన్స్టాంటిన్ బెజ్నోసోవ్ అంటున్నారు. వయసు మళ్లినవారు తమ స్మార్ట్ఫోన్ను అప్పుడప్పుడూ అన్ లాక్ చేస్తూంటారని చెప్పారు. ఇతరులు మన స్మార్ట్ఫోన్లను వాడకుండా చూసేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న విషయంపై తాము పరిశోధనలు చేశామని, ఈ క్రమంలో ఫోన్ల వాడకం తీరుతెన్నులు తెలిశాయని, వీటి ఆధారంగా భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లను ఎలా డిజైన్ చేయాలో అంచనా వేయవచ్చునని బెజ్నోసోవ్ తెలిపారు. తాము 19 నుంచి 63 మధ్య వయసు వారిపై అధ్యయనం జరిపామని... వీరందరి ఫోన్లలో ప్రత్యేక అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసి రెండు నెలలపాటు పరిశీలన చేసినప్పుడు వీరందరూ ఏ సందర్భాల్లో లాక్ చేస్తారు? అన్లాక్ చేస్తారు... అన్న విషయం తెలిసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ కాలం స్మార్ట్ఫోన్లు వాడతారని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని.. 50 ఏళ్ల వయసులో మగవారు ఎక్కువగా ఫోన్ వాడితే.. మహిళలు తక్కువ వాడతారని బెజ్నెసోవ్ వివరించారు. -
కిటికీలే టీవీలు
టొరొంటో: మీ ఇంట్లో కిటికీలు ఉన్నాయా.. దాంట్లో ఏం కనిపిస్తుంది? ఇదేం పిచ్చి ప్రశ్న.. కిటికీలోంచి అవతల ఉన్నవన్నీ కనిపిస్తాయి అంటారా.. మరి అదే కిటికీలో సినిమాలు, సీరియళ్లు, క్రికెట్ వంటివన్నీ చూడగలిగితే! అంతపెద్ద టీవీలాగా ఆ కిటికీ మారిపోతే..! బాగుంటుంది కదూ... అలాం టి అధునాతన గాజు సాంకేతికతను కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చిన్న చిన్న గాజు ముక్కలకు వెండి వంటి లోహాలను అతి సన్నటి పూతగా పూస్తే ఆ గాజు మరింత పారదర్శకతను సంతరించుకుంటుందని... అదే సమయంలో లోహాల ద్వారా విద్యుత్ ప్రసారం చేయవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన కెన్నత్ చౌ తెలిపారు. ఇలా విద్యుత్ ప్రసారం చేయడం ద్వారా ఆ గాజు పలకను టీవీ తెరలాగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాకుండా ఎండాకాలంలో వేడిని అడ్డుకునేలా, చలికాలంలో ఉష్ణాన్ని గదిలోపలికి ప్రసరింపజేసేలా ఈ గాజు అద్దాలను వినియోగించుకోవచ్చని.. దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని పేర్కొన్నారు.