బనశంకరి: కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తాజాగా 12 మంది అరెస్టయ్యారు. గదగ్ మున్సిపల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మారుతితో డీల్ కుదుర్చుకున్నారు. మారుతి కుమారుడు సమీతకుమార్ సోనవణి ప్రశ్నాపత్రం లీకేజీ చేసి ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
కింగ్‌పిన్ సంజుభండారీతో అభ్యర్థులు నగదు వ్యవహారాలు నిర్వహించారు. కీ ఆన్సర్ వచ్చిన తక్షణం మూడు లక్షలు, ఫలితాలు అనంతరం ఐదు లక్షలు ఇవ్వాలని ఒప్పందం. సునీల్‌భంగి అభ్యర్థులను సంజుభండారీకి పరిచయం చేశారు. పరీక్ష పాస్ చేసే డీల్ కుదుర్చుకుని కింగ్‌పిన్ సంజు కోట్లాది రూపాయలు నగదు సంపాదించాడు. గత ఏడాది సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజీలో సంజుభండారీ అరెస్టయ్యాడు.
గదగ్ పీయూ కళాశాల నుంచే ప్రశ్నాపత్రం బయటకు
బెయిల్‌పై విడుదలైన కేపీటీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడి పరారీలో ఉన్న సంజుభండారీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గదగ్ మున్సిపల్ పీయూ కాలేజీ నుంచి ప్రశ్నాపత్రం లీక్ కాగా మున్సిపల్ కాలేజీ వైస్‌ప్రిన్సిపాల్ అతడి కుమారుడు రూమ్ సూపర్‌వైజర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ చేశారు. గైర్హాజరైన అభ్యర్థి ప్రశ్నాపత్రం ఫొటో తీసి క్యామ్ స్క్యానర్‌తో కింగ్‌పిన్ సంజుభండారీ మొబైల్‌కు పేపర్ పంపించారు.
12 మంది అరెస్ట్
గోకాక్ డీవైఎస్‌పీ మనోజ్‌కుమార్ నాయక్ నేతృత్వంలోని పోలీస్ బృందం తీవ్రంగా గాలించి పరీక్షలో అక్రమాలకు పాల్పడిన 12 మందిని శుక్రవారం అరెస్ట్ చేశారు. బెళగావి, గదగ్, ఉత్తర కన్నడ జిల్లాల్లో ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడ్డారు. స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ డీవైస్ వినియోగించి పరీక్షలో అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారు. గోకాక్‌లో ప్రశ్నాపత్రం లీక్‌చేసిన అభ్యర్థి సిద్దప్పమదిహళ్లి పోలీసులకు పట్టుబడ్డాడు.
సిద్దప్పమదిహళ్లిని అరెస్ట్‌చేసి విచారణ చేపట్టగా పరీక్షలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇతను అందించిన సమాచారం ఆధారంగా 12 మందితో పాటు సిమ్‌కార్డులు, కాల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు కింగ్‌పిన్‌లు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బెళగావి గ్రామీణ ఎస్‌పీ సంజీవ్ పాటిల్ ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేశారు.
(చదవండి: తోక ఊపోద్దు, నాలుక కోస్తాం.. ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ)
Comments
Please login to add a commentAdd a comment