
బెంగళూరు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో హాసన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీసు స్టేషన్‌లో జేడీఎస్ కార్యకర్త చేతన్.. సూరజ్ రేవణ్ణపై లౌంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తిరస్కరించటంతో పోలీసులు సూరజ్‌ను బెంగళూరు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనకు పొటెన్సీ పరీక్ష నిర్వహించనున్నారు.
తనపై సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ కార్యకర్త చేతన్, మరోవ్యక్తి హోలెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘సూరజ్ ఫామ్ హైజ్‌లో జూన్ 16 తేదీన నాపై లైంగికంగా దాడి చేశాడు. బదులుగా నాకు రాజకీయంగా ఎదగటానికి సాయం చేస్తాననని బలవంతంగా లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్‌కు మెసెజ్ చేస్తే.. ‘ఏం కాదు. అంతా సర్దుకుంటుంది’అని రిప్లై ఇచ్చాడు’అని కార్యకర్త చేతన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఫిర్యాదుపై స్పందించిన సూరజ్, అతని స్నేహితుడు శివకుమార్ తమను బ్లాక్‌మెయిల్ చేయడానికే చేతన్, మరోవ్యక్తి అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. చేతన్ అనే వ్యక్తి తమతో స్నేహంగా ఉంటూ ఉద్యోగం కావాలని కోరితే.. ఉద్యోగం కోసమనే తాను సూరజ్‌ను పరిచయం చేశానని శివకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment