వేధింపుల కేసు.. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్‌ | Karnataka BJP MLA Munirathna Arrested Over Cast Slurs Allegation | Sakshi
Sakshi News home page

వేధింపుల కేసు.. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్‌

Published Sat, Sep 14 2024 8:11 PM | Last Updated on Sat, Sep 14 2024 8:27 PM

Karnataka BJP MLA Munirathna Arrested Over Cast Slurs Allegation

బెంగళూరు: కర్ణాటక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ దళిత కాంట్రాక్టర్‌పై వేధింపులు, చంపేస్తానని బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేపై  కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మరోవైపు.. తనపై వచ్చిన ఆరోపణలకు ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. దీంతో, కర్ణాటకలో రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న.. లంచం విషయంలో తనను వేధింపులకు గురిచేస్తున్నట్టు కాంట్రాక్టర్‌ చెల్వరాజు కోలార్‌ పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాకుండా తనను చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చినట్టు పోలీసులకు తెలిపాడు. దీంతో, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద మునిరత్నపై కోలార్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

ఇక, మునిరత్న తనను లంచం కోసం వేధించాడని చెల్వరాజు మీడియా సమావేశంలో ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఈ ఘటనను స్థానిక బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఐదు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని మునిరత్నకు బీజేపీ షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే దళితులను అవమానించారని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అతడిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని హస్తం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. దళిత వ్యక్తిని వేధింపులకు గురిచేశారనే కారణంగా ఎమ్మెల్యే మునిరత్నపై దళిత సంఘర్ష సమితి (DSS) సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బెంగళూరులోని మునిరత్న ఇంటి వద్ద వారు నిరసనకు దిగారు. దీంతో, మునిరత్న ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

 

ఇది కూడా చదవండి: టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం.. పోలీసుల కేసు నమోదు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement