న్యూఢిల్లీ: విద్యుత్ కొరత కారణంగా భారత జీడీపీకి రూ.4,14,800 కోట్లు నష్టం(మొత్తం జీడీపీలో ఇది 0.4%) వాటిల్లిందని ఫిక్కీ తాజా నివేదిక పేర్కొంది. విద్యుత్ ప్రసారంపై ఫిక్కీ ఈ నివేదికను రూపొందించింది. ముఖ్యాంశాలు...,
విద్యుత్ ప్రసారంలో ఉన్న సమస్యల కారణంగా విద్యుత్ కొరత ఏర్పడుతోంది.
భవిష్యత్తులో విద్యుత్తుకు డిమాండ్, విద్యుదుత్పత్తి కూడా పెరుగుతాయి. కాబట్టి విద్యుత్ ప్రసార సంబంధిత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంది.
ఈ రంగంలో పెట్టుబడుల కొరత తీవ్రంగా ఉంది. విద్యుదుత్పత్తికి పెట్టే పెట్టుబడుల్లో సగం విద్యుత్ ప్రసార రంగంలో పెట్టాల్సి ఉంది. కానీ భారత్‌లో ఇవి 30 శాతమే.
విద్యుత్ ప్రసార సామర్థ్యంపై సాంకేతిక, వాణి జ్య నష్టాలు తీవ్రప్రభావం చూపుతున్నాయి.
ఈ తరహా నష్టాలు భారత్‌లో 26 శాతంగా ఉండగా, ప్రపంచవ్యాప్త సగటు 9%గా ఉంది.
ఈ రంగంలో 3,500 కోట్ల డాలర్ల పెట్టుబ డులు అవసరం. వీటిల్లో 1,900 కోట్ల డాలర్లు పవర్ గ్రిడ్ నుంచి వస్తాయని అంచనా.