అశ్వరావుపేట (ఖమ్మం): సకాలంలో పింఛను పంపిణీ చేయలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కార్యాలయంలోనే పింఛనుదారులు నిర్బంధించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లిలోఈ నెల మంజూరైన పింఛను ఇప్పటి వరకు ఇవ్వకుండా జాప్యం చేయడంతో ఆగ్రహం చెందిన పింఛను దారులు గ్రామ కార్యదర్శిని నిర్బంధించి, పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు.