సాక్షి, అమరావతి: లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. రికార్డు స్థాయిలో ఒకే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించడం విశేషం. ఈ మహోత్తర ప్రక్రియలో కీలక ఘట్టాలు, అంశాలను ప్రభుత్వం ప్రకటన రూపంలోమీడియాకు విడుదల చేసింది.
పరీక్ష ఫలితాలను గ్రామ సచివాలయం/ఆర్‌టీజీఎస్ వెబ్‌సైట్లో అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేది ఆధారంగా తెలుసుకోవచ్చు
http://gramasachivalayam.ap.gov.in/
http://vsws.ap.gov.in/
http://wardsachivalayam.ap.gov.in/
https://www.rtgs.ap.gov.in/
ముఖ్యమైన అంశాలు
► ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మం ముంగిటే అందచేయటానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
► రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న "నవరత్నాలు" కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు
►ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్ నోటిఫికేషన్ విడుదల చేసాము
► క్రొత్తగా ఏర్పాటు చేసే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము
పరీక్షల నిర్వహణ విజయవంతం
► తేదీ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
► దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు.
► అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీకి 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయినారు.
► పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది.
సమాధాన పత్రాల మూల్యాంకనం
♦ 19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓఎంఆర్ సమాధాన పత్రాలను తేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్ పూర్తి చేయటం జరిగింది
♦ స్కానింగ్ పూర్తి అయిన తరువాత వచ్చిన ఫలితాలను, ఈ రంగంలో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 ఓఎంఆర్ సమాధాన పత్రాలనుసరి చూడడం జరిగింది. ముల్యాంకంలో ఎటువంటి తప్పులు దొర్లలేదని ధ్రువీకరించుకోవడం జరిగింది.
పరీక్షా ఫలితాలు
అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు
• ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%
• వెనుక బడిన తరగతులకు చెందిన వారికి 35%
• ఎస్‌సీ /ఎస్‌టీ /వికలాంగులకు 30%
హాజరైన 19,50,630 మంది అభ్యర్ధుల్లో 1,26,728 ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు
• ఓపెన్ కేటగిరి 24583
• బీసీ కేటగిరి 100494
• ఎస్‌సీ కేటగిరి 63629
• ఎస్‌టీ కేటగిరి 9458
• పురుషులు 131327
• స్త్రీలు 66835
జరిగిన 14 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు
• ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు
• బి.సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు
• ఎస్. సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు
• ఎస్. టి కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు
♦ మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు
♦ పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు
♦ ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి
ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను.
వెరిఫికేషన్ షెడ్యూలు
ఫలితాల విడుదల | 19.09.2019 |
వెబ్‌సైట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్ | 21.09.2019 నుండి |
కాల్ లెటర్ పంపిణి | 21.09.2019 – 22.09.2019 |
తనిఖి జరిగే తేదీలు | 23- 25 సెప్టెంబర్ 2019 |
నియామక ఉత్తర్వుల జారీ | 27.09.2019 |
అవగాహనా కార్యక్రమం | 1&2 అక్టోబర్ 2019 |
గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం | 02.10.2019 |
Comments
Please login to add a commentAdd a comment