సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని.. కావాలనే తమ పార్టీ నేతలపై అవాస్తవాలు రాయిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మదనపల్లె కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని తేల్చి చెప్పారు.
‘‘చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు వ్యతిరేకంగా పనిచేశారు. మదనపల్లెలో రికార్డులు తగలపడితే మాపై నిందలు వేస్తున్నారు. కార్యకర్తలతో మాపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఆధారాలు ఉంటే నిరూపించండి. తప్పుడు ఆరోపణలు చేసి అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. మా కుటుంబం పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. మా ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచాం. కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారు’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు.
టీడీపీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. రికార్డులు కాలిపోయాయని డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. రాజకీయ రంగు పులిమి.. అత్యుత్సాంతో కుట్రలు చేస్తున్నారు. కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల హామీలు నెరవేర్చాలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అంటే చంద్రబాబు భయపడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు‘‘ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment