సాక్షి, అన్నమ్మయ్య జిల్లా: మదనపల్లె అగ్నిప్రమాదం కేసులో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లె అగ్నిప్రమాదం కేసు పేరుతో విచారణ చేపట్టారు.
అగ్నిప్రమాదం కేసు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అగ్ని ప్రమాదం కేసుకి ఒక్క పూటలోనే రాజకీయ రంగు పులిమిన సీఎం చంద్రబాబు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్‌గా కేసును మలిచారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజకీయ కోణంలోనే పోలీసుల విచారణ చేస్తున్నారు. రికార్డులు కాలితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కారణమంటూ విచారణ చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులందరినీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీ పోలీసు బలగాలతో విచారణ చేస్తున్నారు. ముందు 982 ఎకరాల ఫైళ్లు దగ్ధమంటూ హడావుడి చేసిన పోలీసులు.. తీరా ఆ 982 ఎకరాల పుంగనూరు రికార్డులు సెటిల్ మెంట్ ఆఫీసర్ దగ్గరే ఉన్నట్టు విచారణలో తేలింది. తాజాగా 22ఏ రికార్డుల దగ్ధమంటూ అడ్డగోలు విచారణ ప్రారంభించారు. రాజకీయ కక్ష సాధింపుకి ఫైళ్ల దగ్ధం కేసును వాడుకుంటున్న అధికార పార్టీ.. సహేతుకమైన ఫిర్యాదు లేకుండా ఇష్టానుసారంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు వేధింపులకు దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment