
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో చంద్రబాబు అను చరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో శనివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కాగా, అంగళ్లు కూడలిలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు.
రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్‌తో అగ్గి రాజేశారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment