వైఎస్సార్‌సీపీకి ఓటేసిన వారే టార్గెట్‌గా రెచ్చిపోతున్న టీడీపీ
పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు
ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు
తీవ్రగాయాలతో పలువురు ఆసుపత్రి పాలు
ఊర్లొదిలిపెట్టి వెళ్లిపోతున్న బాధితులు
కమ్మపల్లిలో దౌర్జన్యంగా లక్ష ఇటుకల తరలింపు.. బట్టీ ధ్వంసం
తాగునీటి ట్యాంకులూ కూల్చివేత
వైఎస్సార్‌సీపీకి ఓటేసిన వారందరికీ పాలు సరఫరా నిలిపివేత
సోమల మండలంలో 75 మందికి పెన్షన్లు నిలిపివేత
పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం
ఊర్లొదిలి పెట్టి ఎక్కడికైనా వెళ్లాలని చెబుతున్న పోలీసులు
సాక్షి, టాస్‌్కఫోర్స్: అన్నమయ్య జిల్లా పుంగనూరులో అధికార మదంతో టీడీపీ శ్రేణులు సాగిస్తున్న అరాచక కాండ ఇది. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. నివాసాల్లోకి చొరబడి తరిమి తరిమి కొడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కూల్చివేస్తున్నారు. టీడీపీ శ్రేణుల దాడులతో తీవ్రగాయాలైన అనేక మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరికొందరు ఊళ్లొదిలి రహస్య ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి. సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో సుబ్రమణ్యంరెడ్డి, ఇంతియాజ్ బాషా, ప్రసాద్, భానుప్రకా‹Ù, రమే‹Ù, మునీశ్వర్, మోహన్‌బాబు, గంగులప్ప నివాసాల్లోకి చొరబడి, వారిపై దాడులు చేశారు. వీరంతా తీవ్ర గాయాలతో తిరుపతి రుయా, సోమల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం కమ్మపల్లిలో వంద మందికి పైగా టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ నాయకుడు సుబ్రమణ్యం రెడ్డి ఇంటి తలుపులు విరగ్గొట్టి లోపలికి జొరబడ్డారు.
ఇంట్లో ఉన్న సుబ్రమణ్యంరెడ్డిని ఈడ్చుకొచ్చి కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. ఆయన ఇటుకల బట్టీలోని లక్ష ఇటుకలను దౌర్జన్యంగా ట్రాక్టర్లతో తరలించుకెళ్లారు. బట్టీని ధ్వంసం చేశారు. ఫోటోలు, వీడియోలు తీయకుండా మొబైల్ ఫోన్లు లాక్కుని నేలకేసి కొట్టి నాశనం చేశారు. ఈ విషయం బయటకు పొక్కితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతామని హెచ్చరించారు. దీంతో ప్రాణ భయంతో సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం ఊరొదిలి వెళ్లిపోయింది. ఇలాంటి ఘటనలో గత నెల రోజుల్లో అనేకం జరిగాయి. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. టీడీపీ నేతల దాడుల విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించడంలేదు.
తాగు నీటి ట్యాంకులూ కూల్చివేత
వైఎస్సార్‌సీపీ హయాంలో నిరి్మంచిన ప్రభుత్వ ఆస్తులను సైతం టీడీపీ గూండాలు ధ్వంసం చేస్తున్నారు. కరువు ప్రాంతాల్లో ఒకటైన పుంగనూరు నియోజకవర్గంలో ప్రజల తాగు నీటి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు. 20 వేల లీటర్ల సామర్థ్యంతో నియోజకవర్గం మొత్తం రూ.60 కోట్లతో 550 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ప్రజలకు మంచి నీరందించే ఈ ట్యాంకులను కూడా టీడీపీ నేతలు కూల్చివేస్తున్నారు.
రొంపిచెర్ల మండలం బోడిపాటివారి పల్లిలో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంకును రెండు రోజుల క్రితం టీడీపీ నేతలు జేసీబీలతో కూల్చివేసి, పనులకు తెచ్చిన ఇనుప కమ్మీలను ఎత్తుకెళ్లిపోయారు. రొంపిచెర్ల క్రాస్ కురప్పల్లి వద్ద రూ. 15 లక్షలతో రెండో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించారు. దీనిని కూడా జేసీబీలతో కూల్చివేశారు. ప్రజాధనంతో గ్రామీణ ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులను సైతం కూల్చివేయడం టీడీపీ నీచ మనస్తత్వానికి నిదర్శనమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికార మదం
పుంగనూరు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జీరి్ణంచుకోలేకపోతోంది. వారిద్దరూ పుంగనూరులో పర్యటిస్తే అక్కడ టీడీపీకి పుట్టగతులుండవన్న విషయం ఆ పార్టీ నేతలకు అర్ధమైంది. అందుకే ఎమ్మెల్యే, ఎంపీలనే పుంగనూరులో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులతో ఇద్దరినీ హౌస్ అరెస్టు చేయించారు.
దాడుల పరంపర
సోమల మండలం నంజంపేట, కమ్మపల్లి, కందూరు, ఇరికిపెంట గ్రామాల్లో పలువురి ఇళ్లలోకి చొరబడి, వారిపై దాడులు చేశారు. వీరంతా తీవ్ర గాయాలతో తిరుపతి రుయా, సోమల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అధికార గూండాయిజం
కమ్మపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు సుబ్రమణ్యంరెడ్డి నివాసంలోకి జొరబడ్డ టీడీపీ గూండాలు ఆయన్ని చితక్కొట్టారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలను తరలించి, ఆ బట్టీని ధ్వంసం చేశారు. ఫోన్లను నాశనం చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా ఊరొదిలి వెళ్లిపోయారు.
ఖాకీల కాఠిన్యం
ఓ పక్క టీడీపీ గూండాల దాడులకు బెంబేలెత్తుతున్న ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తే వారికి ఊహించని సమాధానం ఎదురవుతోంది. మీరే ఊరొదిలి పెట్టి ఎక్కడికైనా వెళ్లిపోండంటూ పోలీసు అధికారులు కొందరు సమాధానమివ్వడం బాధితులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.
పింఛన్లు నిలిపివేత
ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కమ్మపల్లిలో పొన్నెమ్మ, యశోదమ్మ, శివారెడ్డితో పాటు సోమల మండలం పరిధిలో 75 మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు నిలిపివేశారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాలు సరఫరా నిలిపివేయండి
కమ్మపల్లిలో వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చిన పది కుటుంబాలకు పాలు కూడా అందకుండా టీడీపీ నేతలు దాషీ్టకం ప్రదర్శిస్తున్నారు. ఈ కుటుంబాలకు పాల సరఫరా నిలిపివేయాలని టీడీపీ నేతలు డెయిరీ యజమానులకు ఫోన్‌చేసి హుకుం జారీ చేసినట్లు బాధితులు వాపోయారు. వారికి పాలు సరఫరా చేస్తే వ్యాను తగులబెట్టేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించినట్లు సమాచారం.
అప్పు తీసుకోకపోయినా చెల్లించాలట
పుంగనూరులో దుస్తుల దుకాణం నడుపుతున్న కె. జయంతి వైఎస్సార్‌సీపీకి ఓటేశారని టీడీపీ శ్రేణులు ఆమెకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా.. పోలీసుల ద్వారా ఆమెకు ఫోన్ చేయించి ‘మీరు రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారంట. వెంటనే చెల్లించకపోతే కేసు నమోదు చేస్తాం’ అని బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం గురించి ఆమెను సంప్రదిస్తే తాను ఎవ్వరికీ బకాయిలేనని, ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ఊరొదిలి వెళ్లి దాక్కోండి
టీడీపీ దాడులతో కమ్మపల్లి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలీసులు కూడా ఊరొదిలి వెళ్లిపోవాలని చెబుతుండటంతో మరింత భయకంపితులవుతున్నారు. టీడీపీ నేతలు ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కలి్పంచాల్సిన పోలీసులే బాధ్యత లేకుండా వ్యవహరించటంపై న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment