శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం జింబాడ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు దాడి చేసింది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం జింబాడ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడుల్లో ఐదు ఎకరాల్లో వరి పంట పూర్తిగా ధ్వంసం అయింది. ఏనుగుల దాడులతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పలు సార్లు ఏనుగులు దాడులు నిర్వహించినా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.