సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మంగళవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సమీపంలోని అడివి నుంచి వచ్చిన నాలుగు ఏనుగులు సీతంపేట మండలంలోని ముకుందాపురంతో పాటు సమీప గ్రామాల్లో అరటి, పైన్‌ఆపిల్ పంటలను ధ్వంసం చేశాయి. గ్రామాల్లోకి ఒక్కసారిగా ఏనుగులు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు. చివరికి రైతులు వాటిని పంట పొలాల నుంచి అడవిలోకి తరిమారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు.