శ్రీకాకుళం (ఎల్‌ఎన్‌పేట) : ఎల్‌ఎన్‌పేట మండలం జంబాడ, వీఎస్‌ఎస్ పరిధిలోని ఇరుకురాయిగూడ గ్రామం మీద గురువారం ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. ఇంటికప్పులు పీకేసి ఇంట్లో ఉన్న తిండిగింజలను తినేశాయి. ఏనుగుల దాడిలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చేరుకున్న అటవీ అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు.