శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలం చింతమానుగూడలో బుధవారం ఉదయం బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని ఒక రైతు ఇంటి ప్రహరి గోడ కూల్చడంతో పాటు అతని ఇంట్లో ఉన్న ధాన్యం గదిని ధ్వంసం చేశాయి. దీంతో ఏనుగుల మంద ఎవరి ఇంటిపై విరుచుకుపడుతుందో అని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. గతంలో కూడా ఈ గ్రామంపై ఏనుగులు పలుమార్లు దాడి చేసి ప్రజలను హడలెత్తించాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.