టీడీపీ నేతల దాష్టీకం | TDP Leaders Attack On YSRCP Leader In Srikakulam District, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దాష్టీకం

Published Sun, Nov 17 2024 6:02 AM | Last Updated on Sun, Nov 17 2024 10:45 AM

tdp leaders attack ysrcp leader in Srikakulam District

మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణ పనుల్లో కూలీ చెల్లింపు విషయమై ఘర్షణ

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై మూకుమ్మడి దాడి

వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపు­కొత్తూరు మండలం మంచి నీళ్లపేటలో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాష్టీకానికి తెగబడ్డారు. ఇద్దరు మహిళలు, మరో యువ­కు డిని చితకబాదడంతో వారు పలాస ప్రభుత్వా­స్పత్రిలో చేరారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి సంబంధించిన డబ్బుల ఖర్చులు, జమ వివరాలపై శనివారం గ్రామ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

వైఎ స్సార్‌సీపీ కార్యకర్త గూడేం చిన్నారావు సమా వేశానికి రావాలని టీడీపీ నేతలు గుళ్ల చిన్నా రావు, మాణిక్యాలరావు, మడ్డు అప్పలస్వామి, మడ్డు రాజు, కారి లింగరాజు కబురు పంపా రు. దీంతో.. చిన్నారావుతో పాటు ఆయన మేనత్తలు రట్టి లక్ష్మమ్మ, కదిరి నీలమ్మ కూడా వెళ్లారు. నాలుగేళ్ల కింద మంచినీళ్లపేట జెట్టీ నిర్మాణంలో 66 మందికి చెందిన రూ.1.63 లక్షల కూలీ డబ్బులు ఎందుకు చెల్లించలేదని టీడీపీ నేతలు, మాజీ సర్పంచ్‌ గుళ్ల చిన్నా రావు, గుళ్ల మాణిక్యాలరావు, మరో 20 మంది నిలదీశారు. 

దీనికి చిన్నారావు తనకు సంబంధంలేదని, జెట్టీ కాంట్రాక్టర్‌ను అడగాలని చెప్పారు. దీంతో గుళ్ల చిన్నారావుతో పాటు టీ డీపీ నేతలంతా కదిరి నీలమ్మ, లక్ష్మమ్మ, చిన్నా రావులపై దాడి చేశారు. నిజానికి.. 2023లో మంచినీళ్లపేట పర్యటనకు వచ్చిన గౌతు శిరీ షను నిలదీశామనే తమపై కక్ష పెట్టుకుని దా డులకుతెగబడ్డారని బాధితులు ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement