శ్రీకాకుళం : గజరాజుల బీభత్సం రోజురోజుకీ తారస్థాయికి చేరుకుంటోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాల సీతంపేట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని బిల్లమడ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామును ఏనుగుల మంద ప్రవేశించింది. గ్రామంలో పూరిపాకలను ధ్వంసం చేశాయి. అనంతరం అరటితోటలపై దాడి చేసి నాశనం చేశాయి. ముకుందాపురం, గుమ్మడి గ్రామాల మధ్య ఉన్న జీడిమామిడితోటలను, నూర్చిన ధాన్యాన్ని తొక్కి విధ్వంసం సృష్టించాయి. అనంతరం ఏనుగుల మంద బిల్లమడ కొండల్లోకి వెళ్లిపోయాయి. ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పూరీ పాకలపై దాడికి దిగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
(సీతంపేట)
సీతంపేటలో ఏనుగుల బీభత్సం
Published Fri, Apr 3 2015 9:09 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
Advertisement