శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేటలో గురువారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
ఎల్‌ఎన్‌పేట: శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేటలో గురువారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎల్‌ఎన్‌పేట మండలం అటవీ ప్రాంత పరిధిలోని కరకవలస, డొంకలబడవంజ, కుశమలపాడు గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలువురు రైతులకు చెందిన వరి పొలాలను నాశనం చేశాయి. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ, రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.