ఏనుగుల సంచారం.. గ్రామాల్లో భయంభయం
Published Fri, Dec 23 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
చిత్తూరు: నాలుగు రోజుల క్రితం కర్ణాటక వైపు నుంచి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ప్రవేశించిన ఏనుగులు సమీప గ్రామాల ప్రజలను బయపెడుతున్నాయి. గురువారం రాత్రి ఏనుగుల గుంపు నల్లరాళ్లపల్లి సమీపంలోని పాలారు నదిలోకి వచ్చి, అక్కడే తిష్ట వేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు ట్రాక్టర్లు, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. సమీప గ్రామాలవారిని అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఏనుగులను అక్కడి నుంచి తరిమివేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే, వీకోట మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల్లోని నాగకుప్పం వద్ద కూడా ఏనుగుల గుంపు ఒకటి మకాం వేసింది. దీంతో అవి ఎప్పుడు తమపైకి వస్తాయోనని సమీప గ్రామాల వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వాటిని అక్కడి నుంచి లోపలికి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
Advertisement
Advertisement