చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం పరిధిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది.
- రైతు మృతి
రామసముద్రం(చిత్తూరు)
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం పరిధిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. పంటలను నష్ట పరచడంతో పాటు రైతులపై దాడి చేస్తోంది. ఈ ఏనుగు బారిన పడి సోమవారం వెంకటరమణ అనే రైతు మృతిచెందాడు. ఏనుగును తిరిగి అడవుల్లోకి తరిమేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఏనుగును తరిమికొట్టడానికి యత్నిస్తున్న సమయంలో అది తిరగబడి వెంకటరమణను తొక్కి చంపిందని అధికారులు తెలిపారు.