Venkata Ramana
-
ఎంపీడీవో కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం
సాక్షి, అమరావతి/ పెనమలూరు: నాలుగు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు గురువారం ఫోన్లో మాట్లాడారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని వెంకటరమణారావు ఇంటికి పశ్చిమగోదావరి జల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేరుకున్నారు. ఎంపీడీఓ భార్య సునీత, కుటుంబ సభ్యులతో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు. ఆ తరువాత సునీతతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి విచారణ చేయిస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలు సీఎంఓకు తెలపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నాగరాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీడీఓ వెంకటరమణారావు రాసిన సూసైడ్ నోట్లో విషయాలపై విచారణ జరిపిస్తామన్నారు. కుటుంబ సభ్యులకు ఏ సమాచారం తెలిసినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మధునాయుడు, పలువురు టీడీపీ నేతలు ఎంపీడీఓ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏలూరు కాలువలో విస్తృతంగా గాలిస్తోంది. గురువారం రాత్రికి కూడా ఆయన ఆచూకీ తెలియలేదు. శుక్రవారం గాలింపు చర్యలు చేపడుతామని పెనమలూరు సీఐ టి.వి.వి.రామారావు తెలిపారు. -
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు. -
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్‌ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
నంది అవార్డు గ్రహీత, కెమెరామెన్ కన్నుమూత
సీనియర్ టీవీ కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ అధినేత పోతన వెంకట రమణ అనారోగ్యంతో బుధవారం (మార్చి 3) మరణించారు. శ్వాస సంబంధ సమస్యతో మంగళవారంనాడు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంటక రమణ స్వస్థలం మచిలీపట్నం. ఋతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు, మొదలగు ప్రజాదరణ పొందిన పలు సీరియల్స్‌కు కెమెరామెన్‌గా పనిచేశారు. ఎస్వీబీసీ ఛానల్ నిర్మించిన “శ్రీ వైనతేయ” ధారావాహికకుగానూ 2009లో ఉత్తమ కెమెరామెన్‌గా నంది పురస్కారం అందుకున్నారు. పూరి జగన్ తొలిసారి దర్శకత్వం వహించిన దూరదర్శన్ టెలీఫిలిమ్ “జీవితం" కు పోతన వెంకట రమణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి టివి కెమెరామెన్ సంఘంతో పాటు బుల్లితెర ఇండస్ట్రీలోని పలువురు సంతాపం తెలిపారు. మచిలీపట్నంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: డేరింగ్ స్టంట్స్.. అజిత్ కారు ప్రమాదం వీడియో వైరల్ -
నిజాంపట్నంలో ఆసరా చెక్ పంపిణీ చేసిన ఎంపీ మోపిదేవి
-
కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం..
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతోపాటు, ఇద్దరు ఉద్ధండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతోపాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతోపాటు, పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. శనివారం ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన.. పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తోంది. -
ఊరంతా మా కుటుంబమే!
విధుల్లో ఉత్తమసేవలు అందించినందుకుగాను జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం, రేగట్టె వెంకట రమణ ఎంపికయ్యారు. నేడు న్యూఢిల్లీలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా రేగట్టె వెంకటరమణను పలకరిస్తే తన ఇరవై మూడేళ్ల్ల కృషిని వివరించారు. ‘‘పై అధికారులు చెప్పిన పనిని సమయానుకూలంగా నూటికి నూరు శాతం పూర్తి చేస్తూ రావడం వల్లే ఈ రోజు ఈ పురస్కారం లభించింది. ఎనిమిదవ తరగతి పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఇరవై మూడేళ్ల్ల క్రితం అత్తింటిలో అడుగుపెడుతూనే అంగన్వాడీ టీచర్‌గానూ చేరాను. ఆ తర్వాత మా వారు భద్రయ్య, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ఇద్దరు కూతుళ్లు. మా ఇంటినే కాదు ఊరు బాగోగులు చూసుకునే అవకాశం కూడా దక్కడం అదృష్టంగా భావిస్తాను. అందుకే, నాకు మా ఊరే కుటుంబం అయ్యింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ తెలిసిపోతుంది. అందరూ అందరి కోసం అన్నట్టుగా ఎన్నో కార్యక్రమాలను జరుపుతుంటాం. ఇవన్నీ ఊళ్లో అందరినీ సంఘటితం చేస్తున్నాయి. ప్రీ స్కూల్, ఆరోగ్యలక్ష్మి, ఇంటింటి అంగన్వాడీ హోమ్ విజిట్స్, పౌష్టికాహార, తల్లిపాల వారోత్సవాలు, మిల్లెట్స్ మాసం, పిల్లల చదువుకు సంబంధించి.. ఇలా ప్రతిదీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఏ కార్యక్రమం చేసినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. ఇంటింటి ప్రోగ్రామ్.. గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. వారి ఆరోగ్యం, పౌష్టికాహారం.. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంటాం. మేం మా డైరీలో సక్సెస్ స్టోరీలు కూడా నోట్ చేస్తాం. ఒకసారి ఒక గర్భిణి పౌష్టికాహారం గురించి, తీసుకోవలసిన ఇతర జాగ్రత్తల గురించీ మేం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇచ్చిన పౌష్టికాహారం తీసుకోలేదు. ఆమెకు డెలివరీ అయి బరువు తక్కువతో పాప పుట్టి, చనిపోయింది. అయినా ఆమెను మళ్ళీ మళ్లీ కలుస్తూనే, విషయాలన్నీ చెబుతూ ఆమె తిరిగి కోలుకునేలా చేశాం. ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అయినప్పుడు మేం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించింది. ఈసారి ఆరోగ్యకరమైన పాపకు తల్లి అయ్యింది. ఆ తర్వాత ఆమెనే ఊళ్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా తనలా అశ్రద్ధ చేయద్దని సూచనలు చేస్తుంటుంది. చంటిపిల్లల విషయంలోనూ తల్లులు ఒకరిద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. అందరూ మా వాళ్లే.. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలకు గ్రామపెద్దలు డబ్బులు పోగేసి మరీ చేస్తుంటారు. ర్యాలీలు, వారోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటికీ గ్రామపెద్దలను కలిసి చెబుతాను. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తాను. వాళ్లూ మిగతా అందరినీ కూడగట్టుకొని, మాకు మద్దతు ఇస్తారు. దీంతో ఊరంతా ఆరోగ్యంగా ఉండేలా సరైన కృషి జరుగుతోంది. కార్యక్రమాల్లో ఊరంతా ఒక్కటవుతుంది. ఆ రోజు ఎవరూ పనులకు కూడా వెళ్లరు. కార్యక్రమాలను ఓ పండగలా జరుపుతుంటారు. నేను చెప్పిన విషయాలను వినడంలోనూ, ఆచరించడంలోనూ మా ఊరంతా నాకు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. కరోనా సమయంలోనూ తీసుకున్న జాగ్రత్తలకు రాష్ట్రస్థాయి అ«ధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. బెస్ట్ అవార్డీగా... మండల, ప్రాజెక్ట్, జిల్లా స్థాయుల్లోనూ.. బెస్ట్ అంగన్వాడీ టీచర్‌గా అవార్డులు అందుకున్నాను. ఈ యేడాది జాతీయ స్థాయికి ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిల్లెట్స్‌తో ఐటమ్స్ తయారుచేసి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాం. వాటి ప్రయోజనాలను వివరిస్తాం. దీనివల్ల ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. మా అంగన్వాడీ టీచర్స్‌కి నెలలో రెండు సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో ఊళ్లలో చేపట్టే కార్యక్రమాల వివరాలు పంచుకోవడం, ముందస్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడం, నిర్ణయాల అమలుకు కృషి చేయడం మాకున్న పెద్ద బాధ్యత. దీనిని సక్రమంగా నిర్వర్తించడమే ఈ రోజు మీ అందరి ముందు నిలిపింది’’ అని ఆనందంగా వివరించింది వెంకటరమణ. – నిర్మలా రెడ్డి -
బంగారు కాంతులతో మెరిసిపోతున్న సింహాచల ఆలయ ధ్వజస్తంభం
-
RGUKT బాసర VC ప్రొఫెసర్ వి.వెంకట రమణ మీట్ అండ్ గ్రీట్
-
వైఎస్ జగన్ పాలనకు ఆకర్షితుడినై వైఎస్ఆర్సీపీలో చేరా: వెంకటరమణ
-
టీడీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలికి వేధింపులు
సాక్షి, డోన్: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత చండ్రపల్లె వెంకటరమణ ఆచారి.. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని లొంగదీసుకునేందుకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు సోమవారం పోలీసులను కలిసి వెంకటరమణ ఆచారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డోన్ సీఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పీఏనంటూ వెంకటరమణఆచారి విశాఖకు చెందిన బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె విసుగు చెంది సోమవారం కొందరు మహిళా ప్రతిని«ధులను వెంట తీసుకుని వైజాగ్ నుంచి డోన్‌కు వచ్చి వెంకటరమణ ఆచారిని నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆచారి, ఆయన కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. సొంత పార్టీలోనే మహిళా నేతకు రక్షణ కరువైంది.. రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న తన పట్ల ఆచారి ప్రవర్తించిన తీరుపై పలు మార్లు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నత పదవిలో ఉన్న తనకే సొంత పార్టీ నేతల నుంచి రక్షణ కరువైందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం) -
ఖాకీదుస్తులు త్యాగానికి ప్రతీక
‘ప్రియమైన పోలీసు ధీశాలులారా... మహమ్మారైనా, ఆపత్కాలమైనా, శాంతి సమయమైనా మీరే మా ధైర్యం’ అని పేర్కొంటూ తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో కట్టిన బ్యానర్... సాధారణ ప్రజలకు పోలీ సుల మీద కలిగిన నమ్మకానికి నిదర్శనం అనవచ్చు. తెలంగాణ రాష్ట్రా విర్భావ అనంతరం పీపుల్స్ ఫ్రెండ్లీగా, పోలీసులు అంటే ప్రజల సేవ కులు, ప్రజలే బాసులు అనే విశ్వాసం కలిగే విధంగా తెలంగాణా పోలీస్ శాఖ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే, ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానం అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీటీవీల ఏర్పాటు లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 8.25 లక్షల ఏర్పాటు పూర్తయింది. డయల్ 100, ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, స్వతంత్ర భారత చరిత్రలో మరెక్కడా లేని విధంగా దాదాపు 80 వేల మందికి పైగా పోలీసు అధికారుల నియామకం, కొత్త పోలీసు కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు, చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే కమాండ్ కంట్రోల్ నిర్మాణం... ఇలా తెలంగాణ పోలీస్ శాఖ తన విధుల్లో ఎంతో ముందుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో 377 మంది పోలీసులు అమరులయ్యారు. తెలంగాణలో ఒక్క ప్రాణాపాయం జరగకపోవడం గమనార్హం. అయితే ఇప్పటివరకూ 326 మంది తెలంగాణ పోలీసులు మావోయిస్టు, ఎంఎల్ గ్రూపు నక్సలైట్ల చేతుల్లో అమరులయ్యారు. వీరిలో కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఉన్నారు. ఖాకీ దుస్తులు అంటేనే త్యాగాలకు ప్రతీక అనే విష యాన్ని పోలీసులు తమ విధుల ద్వారా చాటుతున్నారు. ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ కోసం నిస్వార్థ సేవలందించిన ఈ అమర పోలీసులకు దేశ ప్రజలు అక్టోబర్ 21న నివాళులు అర్పిస్తున్నారు. – కన్నెగంటి వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ -
బాలల హక్కుల రక్షణకు రాజీలేని పోరాటం
బాలల హక్కుల పరి రక్షణ కోసం గత నలభై ఏళ్లుగా తన జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్త అచ్యుతరావు. తను చేసే పనిపట్ల నమ్మకం, గౌరవం, నిజాయితీ, నిబ ద్ధత గల కార్యశీలుడు ఆయన. బాలల హక్కుల సంఘం స్థాపించి, ఎక్కడ బాలల హక్కులకు విఘాతం కలిగినా, బాలలకు అన్యాయం జరిగినా వెంటనే స్పందిం చేవారు. క్షణాల్లో అక్కడికి వెళ్లి, ఆ సమస్యను పరిష్కరించి, బాలలకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా తగిన చర్యలు తీసుకునేవరకు నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. అనేకమంది కష్టాలలో మగ్గిపోతున్న బాల కార్మి కుల వివరాలు తెలుసుకుని, వారికి విముక్తి కలిగిం చడంలో సాహసోపేతమైన అడుగులు వేసి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చెక్కు చెద రని ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ముందడుగు వేసిన పట్టుదల అచ్యుతరావుది.బాలల హక్కుల కోసం నిర్విరామ పోరాటం చేస్తున్న అచ్యుతరావు సేవలను గుర్తించి బాలల హక్కుల కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పదవిని కట్టబెట్టినా, తన ఆలోచనలకు, ఆశయాలకు ఆ పదవి అవరోధంగా ఉందని భావించి కొంతకాలం తరు వాత బాలల హక్కుల కమిషన్ సభ్యులుగా కొనసాగ లేక అచ్యుతరావు బయటికి వచ్చేశారు. బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో అచ్యుతరావు తన భార్య అనూరాధతో కలసి ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరే కంగా అనేక కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వ హించారు. ధర్నాలు జరిపారు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. వివిధ రంగాల లోని ప్రముఖులను ఒక వేదిక మీదకి తీసుకువచ్చి వారి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బాలల హక్కులకు విఘాతం కలి గించే సంస్థలకు, వ్యక్తులకు అచ్యుత రావు సింహ స్వప్నంగా తయారయ్యారు. బాలలను నిర్దాక్షి ణ్యంగా హింసించే, దండించే, లైంగిక వేధింపు లకు గురిచేసే వారి విషయంలో రాజీ పడటం, వెనుకంజ వేయటం అచ్యుతరావు నిఘంటువులోనే లేదు. ఆడపిల్లల లైంగిక వేధింపులు, ఈవ్‌టీజిం గ్లను నివారించటం కోసం ప్రత్యేకంగా షీటీమ్ లను ఏర్పాటు చేయించారు అచ్యుతరావు. జంట నగరాలలోని పాఠశాలల్లో పదివేలమంది ఆడపిల్ల లకు ఆత్మ రక్షణ కోసం కరాటే మాస్టర్ నరేందర్‌తో ఉచిత కరాటే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయిం చారు. వారిలో ధైర్యాన్ని నింపారు. ప్రభుత్వం కూడా పట్టించుకోని నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని, జూన్ 1న అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రతి ఏడాది క్రమం తప్ప కుండా చేయడం అచ్యుతరావు నిబద్ధత. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో, పెద్దల్లో బాలల హక్కులపట్ల అవగాహన కలిగించే పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది యువతరం కార్యకర్తలను చైతన్యపరిచారు. వీధి బాలలు, మురికివాడల్లోని పిల్లల ఆరోగ్యంకోసం, ఆనందం కోసం హెల్త్ క్యాంపులు, అవగాహనా సదస్సులు, సాంస్కృతిక కార్యక్ర మాలు అచ్యుతరావుతో కలిసి నేను కూడా నిర్వ హణలో నలభై ఏళ్లుగా పాలు పంచుకోవటం మర చిపోలేని అనుభవం. బాలల హక్కుల సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా నన్ను నియమించి పిల్ల లకు సేవ చేసే అవకాశం కల్పించారు అచ్యుత రావు. తాను నమ్మిన సిద్ధాంతాలను అమలు పరచ డంలో, బాలల హక్కుల రక్షణ కోసం ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ఎదిరించడానికి సైతం వెను కాడకుండా రాజీలేని పోరాటం చేసిన అచ్యుతరావు లాంటి అత్యంత శక్తివంతమైన ఉద్యమ నేతలు చాలా అరుదుగా ఉంటారు. వ్యాసకర్త చొక్కాపు వెంకటరమణ ప్రముఖ బాలసాహిత్య రచయిత మొబైల్ : 92465 20050 -
బోటు యజమాని వెంకట రమణ అరెస్ట్
సాక్షి, రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కల్లూరు వద్ద గోదావరిలో బోటు బోల్తా ప్రమాద ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. రంపచోడవరం ఏఎస్పీ వకుళ్ జిందాల్ మాట్లాడుతూ...‘ఈ కేసులో బోటు యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. లాంచీ యజమానుల్లో ప్రధానంగా ఏ-వన్ గా ఉన్న కోడిగుడ్ల వెంకటరమణతో పాటు ఏ-2 ఎల్లా ప్రభావతి, ఏ-3 అచ్యుతమణిని అరెస్ట్ చేశాం. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ...దానిపై విచారణ చేస్తున్నాం. చదవండి: ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’ గోదావరి ప్రవాహ ఉధృతిని బోటు డ్రైవర్ అంచనా వేయలేకపోవడం, సుడులు తిరుగుతున్న నీటి నుండి తప్పించుకుని, సురక్షిత మార్గంలో బోటును ముందుకు తీసుకువెళ్లే విషయంలో బోటు డ్రైవర్‌కు సరైన అవగాహన, అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎడమ పక్కకు వెళ్లాల్సిన బోటును గోదావరి మధ్యలో నడిపారు. ఇందులో పోలీసుల తప్పిదం లేదు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు బోటులోని వారంతా లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. పోలీసులు వెళ్లగానే లైఫ్ జాకెట్లు తీసేయవచ్చని బోటు సిబ్బంది చెప్పారు. బోటులో మొత్తం 64మంది పెద్దవాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 8మంది బోటు సిబ్బంది సహా 75మంది ఉన్నారు. బోటును బయటకు తీసుకు వచ్చేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ 34 మృతదేహాలు వెలికి తీశాం’ అని తెలిపారు. -
వసూళ్ల ‘సేన’
తిరుపతి (అలిపిరి): ఎన్నికల్లో ఖర్చుల కోసం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ జనసేన అభ్యర్ధి డాక్టర్ వెంకటరమణపై ఎన్టీఆర్ వర్సిటీ వీసీ విచారణకు ఆదేశించారు. గత నెలలోనే ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న డాక్టర్ వెంకటరమణ కుప్పం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఎన్నికల ప్రచార నిమిత్తం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని, నగదును నేరుగా తన అకౌంట్లో వేయాలని పరోక్షంగా, ప్రత్యక్షంగా వేధించారని శ్రీకాళహస్తికి చెందిన లాయర్ కుమార్ ఎన్టీఆర్ వర్సిటీ వీసీకి, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రవిప్రభును వీసీ ఆదేశించారు. ఈ అంశంపై జనసేన తిరుపతి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎవరూ చెప్పలేదు ఎన్టీఆర్ వర్సిటీ ఆదేశాల మేరకు వెంకటరమణ డబ్బుల కోసం విద్యార్థులను వేధించారనే కోణంలో విచారణ చేపట్టాం. డబ్బులు వసూలు చేశారని ఎవరూ చెప్పలేదు. – డాక్టర్ రవి ప్రభు, ప్రిన్సిపాల్, ఎస్వీఎంసీ, తిరుపతి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే నేను జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించాను. కొందరు నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఫిర్యాదు చేశారు. లాయర్ ఫిర్యాదులో వాస్తవం లేదు. విద్యార్థుల వద్ద ఒక్క పైసా తీసుకోలేదు. – వెంకటరమణ, పీజీ వైద్య విద్యార్ధి, ఎస్వీఎంసీ, తిరుపతి -
‘చంద్రబాబుకు పవన్ కల్యాణ్ చెంచా’
సాక్షి, తూర్పు గోదావరి : ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి జనసేన దుష్ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ మాట్లాడుతూ.. టీడీపీకి పరోక్షంగా లాభం చేసేందుకే కన్నబాబుపై పవన్ కల్యాణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ చెంచా అని ఘాటుగా స్పందించారు. కాకినాడ రూరల్ ప్రజల మదిలో కన్నబాబుకు ప్రత్యేక స్ధానం ఉందని అన్నారు. చదవండి : కన్నబాబుపై జనసేన దుష్ప్రచారం -
ఎమ్మెల్యే సారూ.. ఫైర్ స్టేషన్ ఏదీ?
సాక్షి, ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): నియోజకవర్గం కేంద్రంలో ఫైర్ స్టేషన్ (అగ్నిమాపక కేంద్రం) ఏర్పాటుకు దిక్కు లేకుండా పోయింది. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు పలాస, టెక్కలి, ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడిలోని అగ్నిమాపక కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడి నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నియోజకవర్గంలో కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో 140 పంచాయతీలు ఉన్నాయి. అధిక శాతం గిరిజన గ్రామాలే. వేసవిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కొత్తూరులో ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి కొత్తూరు, హిరమండలం ప్రజలకు సేవలందుతున్నాయి. ఈ రెండు మండలాలు తప్పితే మిగిలిన మూడు మండలాలకు పక్కన ఉన్న ఆమదాలవలస, టెక్కలి, పలాస నియోజకవర్గాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి నుంచి వచ్చే ఫైర్ ఇంజిన్లే దిక్కవుతున్నాయి. అధికారంలోకి వస్తే పాతపట్నంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఐదేళ్లవుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒడిశా ఫైర్ ఇంజినే దిక్కు.. పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా పక్కనే ఉన్న పర్లాకిమిడి ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేస్తాం. అక్కడ నుంచి అగ్నిమాపక వాహనం వచ్చే వరకు వేచి చూడాల్సి వస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పలు సందర్భాల్లో పాలకులు హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పాతపట్నంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – కొండాల అర్జునుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు, పాతపట్నం -
‘ఆవెర’ సోలార్ చార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ టూ–వీలర్ల తయారీలో ఉన్న ఆవెర న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మోటో కార్ప్ టెక్... సోలార్ ఆధారిత చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. సోలార్‌తో పనిచేసే చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి. తొలి దశలో వైజాగ్, అమరావతి, తిరుపతిలో ఆగస్టు నాటికి 25 కేంద్రాలు రానున్నాయి. రెండవ దశలో 2019 మార్చికల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో 75 సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్క హైదరాబాద్‌లోనే 50 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ‘ఆవెర’ ఫౌండర్ ఆకుల వెంకట రమణ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఒక్కో కేంద్రానికి రూ.10 లక్షల వరకు కంపెనీ వెచ్చిస్తోందన్నారు. సీఎంఆర్, ఎంవీఆర్, చందన షోరూంల వద్ద కూడా చార్జింగ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. కొద్దిపాటి స్థలంలో.. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 250 చదరపు అడుగుల విస్తీర్ణం సరిపోతుంది. ఆధునిక లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను వాడుతున్నారు. స్టేషన్లో 7 కిలోవాట్ వరకు విద్యుత్ స్టోర్ చేసుకోవచ్చు. ఒక గంటలో వాహనం చార్జింగ్ పూర్తవుతుంది. కంపెనీ సొంత స్టేషన్లలో ఆవెర వాహనాలకు ఉచితంగా చార్జింగ్ సౌకర్యం ఉంది. ఫ్రాంచైజీ విధానంలోనూ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఔత్సాహిక యువతకు కేంద్ర, రాష్ట్రాల నుంచి సబ్సిడీ అందించి వీటిని నెలకొల్పాలన్నది ఆలోచన. స్టేషన్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను నెట్ మీటరింగ్ విధానంలో గ్రిడ్‌కు అనుసంధానించి అదనపు ఆదాయం పొందవచ్చు. త్రీ–వీలర్ల తయారీలోకి.. ఆవెర ప్రస్తుతం అయిదు రకాల ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోంది. సబ్సిడీ పోను వాహనం ధర రూ.70–90 వేలు ఉంది. మోడల్‌ను బట్టి ఒక్కొక్కటి ఒకసారి చార్జింగ్ చేస్తే 140 నుంచి 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీ 10 ఏళ్లకు పైగా పనిచేస్తుంది. 1–2 కిలోవాట్ల విద్యుత్ ఈ బ్యాటరీల్లో నిల్వ అవుతుంది. వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లింగ్ ప్లాంటులో వాహనాలను తయారు చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని నున్న వద్ద 63 ఎకరాల్లో రూ.50 కోట్ల ప్రారంభ వ్యయంతో శాశ్వత ప్లాంటు నిర్మిస్తున్నట్టు వెంకట రమణ చెప్పారు. త్రీ–వీలర్ల తయారీలోకి ప్రవేశిస్తున్నట్టు వెల్లడించారు. నమూనా వాహనం రెడీ చేశామన్నారు. -
మద్యం తాగి నడిపితే జైలుకే
మంచిర్యాల క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సిందేనని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్హాల్లో గురువారం డ్రంక్అండ్డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు, వారి కుటుంబం సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతన్నాయన్నారు. ప్రమాదాల్లో మృతి చెందినవారు ఎక్కువశాతం తలకు బలమైన గాయాలు తగలడం వల్లనేనన్నారు. తలకు హెల్మెట్ వాడటం వల్ల రక్షణగా ఉంటుందని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపిన వారు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు తప్పనిసరి ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెండు సార్లు పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మూడోసారి దొరికితే లైసెన్స్ రద్దు చేసేందుకు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సతీశ్, ఎస్సై, ఏఎస్సై భవానీ పాల్గొన్నారు. -
హెచ్‌సీయూ చెరువులో అరుదైన బ్యాక్టీరియా
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లోని బఫెల్లో చెరువులో అరుదైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. రెండేళ్లుగా వర్సిటీలోని ప్లాంట్ సైన్సెస్ ల్యాబ్‌లో ప్లాంట్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొఫెసర్ సీహెచ్ వెంకటరమణ చేస్తున్న పరిశోధనల్లో దీనిని కనుగొనడం విశేషం. దీనికి ‘ప్లాంటోపైరస్’అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. అరుదైన యాంటీ బయాటిక్‌ను ఉత్పత్తి చేసే ఇలాంటి బ్యాక్టీరియాను కనుగొనడం దేశంలోనే మొదటిçసారని వెల్లడించారు. ఈ యాంటీ బయాటిక్ ద్వారా ప్లాంటోమైసిటీని ఉత్పత్తి చేసి నూతన ఔషధాల తయారీకి వినియోగించవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా పరిశ్రమల్లోని అమోనియా వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అరుదైన బ్యాక్టీరియాను వర్సిటీ చెరువులో కనుగొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, దీన్ని పెంచడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
-
జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరుపతి: పట్టణంలోని రూయా ఆస్పత్రిలో జూనియర్ హౌజ్ డాక్టర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే రూయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వెంకటరమణ ఆత్మహత్యాయత్నంతో రూయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంకటరమణపై రుయాలో క్లర్క్‌గా పని చేస్తున్న కృష్ణ కుమారి చేయి చేసుకోవడంపై జూడాలు మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. వెంకటరమణ ఆత్మహత్యాయత్నంపై చిత్తూరు సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్ సంఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణ కుమారిని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. -
అప్పుల బాధతో రియల్టర్ ఆత్మహత్య
► రూ.కోటికిపైగా అప్పులున్నట్లు సూసైడ్ నోట్ ► భార్యాపిల్లల్ని వేధించవద్దని నోట్లో కోరిన మృతుడు మదనపల్లె క్రైం : అప్పుల బాధ తాళలేక బెంగళూరుకు చెందిన ఓ రియల్టర్ మదనపల్లెలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చిం ది. తనకు రూ.కోటికి పైగా అప్పులు ఉన్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తాను చనిపోయిన తరువాత సహచర భాగస్వాములు తన భార్యా పిల్లల్ని డబ్బుల కోసం వేధించవద్దని అందులో కోరాడు. మదనపల్లె టూ టౌన్ ఎస్ఐ గంగిరెడ్డి కథనం మేరకు.. వైఎస్ఆర్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం గంగమ్మ జాతర ఈడిగపల్లెకు చెందిన తుమ్మల నాగప్ప కుమారుడు వెంకటరమణ(55) గత 30 ఏళ్ల క్రితం బెంగళూరు నగరానికి చేరుకుని లగేరిలో స్థిర పడ్డాడు. అతనికి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు నటరాజ ఉన్నారు. బెంగళూరులో పెద్ద పెద్ద కాం ట్రాక్టు పనులు చేసుకుంటూ రియల్టర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం మదనపల్లె సమీపంలోని వలసపల్లె పంచాయతీ ముంబయి–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ‘రియల్’ వ్యాపారం దెబ్బతినడంతో.. ఇటీవల కొంత కలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో అప్పులు పెరిగాయి. రూ.కోటికి పైగా అప్పులు ఉన్నాయి. అందులో రూ.10 వడ్టీతో సగం తీర్చాడు. ఇంకా రూ.కోటి ఉండడంతో భాగస్వాములు, నలుగురు వడ్డీ వ్యాపారులు తరచూ వేధింపులకు దిగడంతో మదనపల్లెలో ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. భూమికి ధర రాక గత నెల 29న మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. వెంట తెచు్చకున్న భూముల పత్రాలను స్థాని క వ్యాపారులకు చూపించి విక్రయించాలని చెప్పాడు. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో వెంకటరమణ ఆశించిన ధర రాలేదు. అప్పు లు ఇచ్చిన వారి వేధింపులు అ«ధిక మవడంతో తీవ్ర మనస్తాపానికి గురయా్య డు. వారం రోజుల క్రితం మదనపల్లె ఆర్టీసీ బస్టాండుకు ఆనుకుని ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు. గురువారం రాత్రి నీరుగట్టుపల్లె చౌడేశ్వరిదేవి ఆలయం దగ్గరున్న వ్యవసాయ పొలంలో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం బహిరూ్భమికి వెళ్లిన స్థానికు లు అక్కడ వెంకటరమణ చనిపోయి ఉండడాన్ని గమనించి టూటౌన్ పోలీ సులకు సమాచారం అందించారు. ఎస్ఐ గంగిరెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న సూసైడ్ నోట్, సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వారింట పద్యం పుట్టింది!
స్మరణ తెలుగువారికే సొంతమైన అవధాన ప్రక్రియలో ఘనులు కొప్పరపు కవులు. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరి కొప్పరం గ్రామానికి చెందిన ఈ సోదరులు 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో తెలుగు పద్యాన్ని పరుగులెత్తించారు. కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (జననం-1885), కొప్పరపు వేంకట రమణకవి (జననం- 1887) అనే ఈ అన్నదమ్ములు పదహారేళ్లు నిండకుండానే ఆశుకవిత్వం చెప్పి, అష్టావధానాలు చేసి ‘కవిత పుట్టిల్లు కొప్పరపు ఇల్లు’ అని పేరొందారు. వారి పేరున 15 ఏళ్ల క్రితం స్థాపితమైన ‘శ్రీకొప్పరపు కవుల కళాపీఠం’ ఏటా సాహిత్యకారులను సత్కరించి, గౌరవిస్తోంది. నవంబర్ 12 కొప్పరపు వేంకట సుబ్బరాయకవి జయంతి సందర్భంగా క ళాపీఠం బాధ్యులు మా. శర్మ పంచుకుంటున్న విశేషాలు... నేను కొప్పరపు సోదరుల మనవణ్ణి. మా తాతగారు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి. నేను వారి కుమార్తె సంతానాన్ని. మా తాతగారు సుబ్బరాయ కవి తన ఐదవ ఏట కవిత్వం ప్రారంభించారు. ఎనిమిదవ ఏట శతక రచన, 12వ ఏట అష్టావధానం, 16వ ఏట శతావధానం, 20వ ఏట కేవలం 24 నిమిషాలలో 300 పద్యాలతో కావ్యం రచించారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో వీరు చెప్పినంత వేగంగా కవిత్వం చెప్పినవారు లేరు. కొప్పరపు అన్నదమ్ములిద్దరూ పద్యాలలో మాట్లాడుకునేవారు. వీరు పద్యాలలో మాట్లాడుకోవడం చూసి ‘పలికిన పలుకులన్నియు పద్యములయ్యెడు యేమి చెప్పుదున్’ అన్నారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. కొప్పరపు కవులు వస్తుంటే సుమారు 40 గుర్రపు బగ్గీల కాన్వాయ్ ముందు నడిచేది. వారి ఒంటి మీద నాలుగైదు కేజీల బంగారు నగ లు ఉండేవి. ఆ రోజుల్లో వారి సభకు రూ. 1116 ఇచ్చేవారు. గజారోహణం, గండపెండేర సత్కారం - అన్నీ జరిగాయి. అంత వైభోగం ఎవరికీ జరగలేదు. నేను ఐదో తరగతి చదువుతుండగా మా తెలుగు వాచకంలో తిరుపతి వెంకట కవుల పాఠ్యాంశం ఉంది. మరి కొప్పరపు కవుల గురించి ఎందుకు లేదా అనిపించింది. అప్పటి నుంచి ఆ విషయం నన్ను వెంటాడుతూనే ఉంది. అంత గొప్ప వంశంలో పుట్టినందుకు వారి ఋణం తీర్చుకునేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. 2002 సెప్టెంబరు 9వ తేదీన కొప్పరపు కళాపీఠం ప్రారంభించాను. అప్పటి నుంచి కొప్పరపు సోదరుల రచనలు సేకరించడం ప్రారంభించాను. గుండవరపు లక్ష్మీనారాయణ గారి సంపాదకత్వంలో కొప్పరపు కవుల కవిత్వం ప్రచురించి, భారత మాజీ ప్రధాని పి.వి.నర సింహారావు చేతుల మీదుగా ఆవిష్కరించాం. విశాఖపట్టణం బీచ్ రోడ్లో కొప్పరపు కవుల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశాం. ఆంధ్రదేశంలో అవధాన కవులకు విగ్రహాలు వీరితోనే ప్రారంభం. 2003లో కొప్పరపు కవుల పేరిట ప్రతిభా పురస్కారాలు ప్రారంభించాం. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పుర స్కారాలు ప్రారంభించాం. 2013 వరకు ఇచ్చాక, 2014లో జాతీయ పురస్కారంగా మలిచాం. ఆ సంవత్సరం పండిట్ జస్రాజ్కి, 2015లో హరిప్రసాద్ చౌరసియాకి అందచేశాం. ఈ సంవత్సరం మాడుగుల నాగఫణిశర్మకు అందచేశాం. లక్కవరం సంస్థానాధీశులు రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహద్దూర్ 1916లో ‘ఆధునిక కవి జీవితములు’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో కొప్పరపు కవుల గురించి ప్రస్తావిస్తూ, ‘కొప్పరపు కవులు ఆశువుగా చెప్పిన పద్యాలు నేటికి మూడు లక్షలకు పైమాటే’ అన్నారు. అయితే మాకు కేవలం వెయ్యిపద్యాలు మాత్రమే లభ్యమయ్యాయి. కొప్పరపు కవులకు తీరని అన్యాయం జరిగిందని ఆరుద్ర తన ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో అన్నారు. తిరుపతి వెంకట కవులకు, కొప్పరపు కవులకు అనేక వివాదాలు ఉండేవి. ఒకసారి ఒక సభలో ఒక ఆసనం దగ్గర ఈ వివాదం ప్రారంభమైంది. అంతకు మునుపు వీరు ఒకరి పట్ల ఒకరు అనురాగంతో ఉండేవారు. వీరి వివాదం వల్ల ఎందరో పద్యాలు రాశారు. పద్య సృష్టి బాగా జరిగింది. పద్యాల పంట పండింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వివాదం ముగిసింది. వీరికి ఒకరంటే ఒకరికి అభిమానం. ఒకరికి ఒకరు వీరాభి మానులు. ఆ తరువాత కొప్పరపు సోదరుల కుమా రులు ‘కుమార సోదరకవులు’ అవధానం చేసేట ప్పుడు ఆ కార్యక్రమాన్ని తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు దగ్గరుండి నడిపే వారు. అపూర్వ ఆశుకవితా చక్రవర్తులు ఆంధ్ర పద్యసాహిత్యంలో ఆశుకవితా చక్రవర్తులంటే కొప్పరపు కవులే. గద్వాల్ నుంచి మద్రాసు దాకా వారి సభలు వందలు జరిగాయి. ఎనిమిది సెకన్లకొక పద్యం అల్లడం వారికే చెల్లింది. అదీ ‘నీలాంబుజారామ కేళీ మరాళమై...’ లాంటి ప్రబంధ శైలి పద్యాలు.ఒక్కరోజులో రెండేసి శతావధానాలు చేయడం, గంటకొక ప్రబంధం ఆశువుగా అల్లడం వారి పాండితీ వేగానికి నిదర్శనమే కాదు, ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఆశ్చర్యకరం.ఆశు ప్రబంధ నిర్మాణంలో వారు అసమాన ప్రతిభామూర్తులు. ఎలాంటి కథనైనా సరే, రకరకాల వృత్తాలలో, ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలుగా రాసేవారు. సభలో ఏ కథనిచ్చి కావ్యంగా అల్లమన్నా, వందల పద్యాలతో ఆశువుగా కావ్యరచన చేసేవారు. ఒకసారి మార్టేరు సభలో ఈ అన్నదమ్ములతో పందెం వేశారు. అంతే... గంటకు 720 పద్యాల చొప్పున అరగంటలో 360 పద్యాలతో ‘మనుచరిత్ర’ కథను తమదైన కొత్త ప్రబంధ కావ్యంగా ఆశువుగా అల్లారు.మరోసారి వీరవాసరంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఒక సాహిత్యసభకు అధ్యక్షత వహించారు. ఆ సభలో 3 గంటల్లో 400కు పైగా పద్యాలతో ‘శకుంతల కథ’ను ప్రబంధంగా ఆశువుగా చెప్పారు. గన్నవరంలో ఒక సభలో షేక్స్పియర్ ‘సింబలిస్’ నాటకాన్ని గంటన్నరలో 400 పద్యాలతో ఆశువుగా కావ్యంగా మలిచారు. కొప్పరపు కవుల మీద ఇతర మహాకవులు చెప్పిన ప్రశంసా పద్యాలే వేయికి పైగా ఉంటాయి. కావ్యకంఠ వాశిష్ఠ గణపతి, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, వేటూరి ప్రభాకర శాస్త్రి - ఇలా ఎందరో వారిని ప్రశంసించారు. కొప్పరవు కవుల రచనల్లో ‘దైవసంకల్పవ్ు, సాధ్వీ మాహాత్మ్యవ్ు, శ్రీకృష్ణ కరుణా ప్రభావం, దీక్షిత స్తోత్రవ్ు, నారాయణాస్త్రం, సుబ్బరాయ శతకం మొదలైనవి ఉన్నాయి.ఆశువుగా చెప్పిన వేలాది పద్యాలు రికార్డు కాకపోవడం, చిన్న వయసులోనే మరణించడంతో వీరి సారస్వత సంపద ఇవాళ అందుబాటులో లేకుండా పోయింది. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
రామసముద్రంలో ఏనుగు బీభత్సం
- రైతు మృతి రామసముద్రం(చిత్తూరు) చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం పరిధిలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. పంటలను నష్ట పరచడంతో పాటు రైతులపై దాడి చేస్తోంది. ఈ ఏనుగు బారిన పడి సోమవారం వెంకటరమణ అనే రైతు మృతిచెందాడు. ఏనుగును తిరిగి అడవుల్లోకి తరిమేందుకు అటవీశాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఏనుగును తరిమికొట్టడానికి యత్నిస్తున్న సమయంలో అది తిరగబడి వెంకటరమణను తొక్కి చంపిందని అధికారులు తెలిపారు. -
వెంకటరమణ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం
హైదరాబాద్: కాకినాడలో శుక్రవారం జరిగిన జనసేన సభలో పాల్గొనడానికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందిన వెంకట రమణ కుటుంబానికి పార్టీ అధ్యక్షడు పవన్‌కల్యాణ్ 5 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు నివారించడంతో వెంకట రమణ కుటుంబ సభ్యులను స్వయంగా కలవలేకపోతున్నానని, ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. జనసేన ప్రతినిధులు శనివారమే వెంకట రమణ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా, సభ సందర్భంగా గాయపడిన ఇద్దరికీ వైద్య సాయం అందజేస్తామని ప్రకటించారు. -
సింధు తండ్రి ప్రత్యేక పూజలు
-
సింధు తండ్రి ప్రత్యేక పూజలు
పెదవేగి: రియో ఒలంపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించాలని ఆమె తండ్రి వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలోని శ్రీ రత్నాలమ్మ ఆలయంలో శుక్రవారం ఆయన పూజలు చేశారు. సింధు బంగారు పతకం గెలిచి దేశ ఖ్యాతిని పెంచుతుందనే నమ్మకం తనకుందని రమణ తెలిపారు. ఇక్కడ కుల దేవతను పూజలు చేయడం ఆచారంగా వస్తోందన్నారు. మరో వైపు సింధు బంగారు పతకం సాధించాలని అభిమానులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఈరోజు పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో పలువురు పూజలు చేశారు. అలాగే, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కార్పొరేటర్ అరుణ శ్రీనివాస్‌గౌడ్..108 కిలోల పసుపు, కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. -
న్యాయం కోరుతున్న పోలీసు భార్య
► ఏడాది నుంచి పట్టించుకోని వైనం ► ఓ ఎమ్మెల్యే గన్‌మన్ నిర్వాకం కాకినాడ: నాలుగేళ్ల క్రితం తనను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఓ ఎమ్మెల్యే గన్‌మన్.. బిడ్డ పుట్టాక అదనపు కట్నం కోసం పుట్టింట వదిలేశాడని ఆరోపిస్తూ ఓ గిరిజన మహిళ బుధవారం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించింది. పెదమల్లాపురానికి చెందిన బాధితురాలు చింతోజు పద్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అడ్డతీగలకు చెందిన చింతోజు వెంకటరమణతో 2012 ఏప్రిల్ 25న పెద్దల సమక్షంలో పద్మ పెళ్లి జరిగింది. అతడికి రూ.1.10 లక్షల కట్నం, బంగారపు గొలుసు, ఉంగరం, ఆడపడుచుకు లాంఛనాలు, రూ.30 వేల నగదు ఇచ్చారు. ఆరు నెలలు భార్యాభర్తల కాపురం సజావుగా సాగింది. అనంతరం అదనపు కట్నం కావాలని, ఇల్లు అమ్మి సొమ్ము తెమ్మని ఆమె భర్త, అత్తమామలు వెంకటేశ్వరరావు, లక్ష్మి, ఆడపడుచు ప్రియారాణి, మరిది మల్లికార్జున వేధించారు. గర్భిణిగా ఉన్న ఆమెకు భోజనం పెట్టకుండా, దూషించారు. గదిలో బంధించి వెంకటరమణ బెల్టుతో కొట్టాడు. దీంతో పుట్టిన మగబిడ్డ మూడో రోజే కన్నుమూశాడు. ఓసారి ఆమెపై హత్యాయత్నం కూడా జరిగింది. కాగా ఆమె భర్త వివాహేతర సంబంధాలు నెరపుతూ, ఓసారి సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. గ్రామ పెద్దలు మందలించినా.. వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆమెకు ఆడబిడ్డ పుట్టగా, బాలింతరాలని కూడా చూడకుండా వెంకటరమణ కొట్టేవాడు. ఏడాది క్రితం ఆమెను ఇంటికి పంపేసి, భర్త పట్టించుకోవడం మానేశాడు. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి, అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొంది. -
భర్త చేతిలో భార్య హతం
విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తే కాలయముడయ్యాడు. ఎల్.కోట మండలం రెల్లి గైరమ్మపేట గ్రామానికి చెందిన వెంకటరమణ తన భార్య అప్పలకొండను గురువారం రాత్రి కత్తితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది. -
కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య
చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండలో సోమవారం ఉదయం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటరమణ, లక్ష్మి(24)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వారికి పిల్లల్లేరు. గత కొంతకాలంగా వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి ఉరి వేసుకుని చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
టీటీడీలో 60 వేల లడ్డూలు హాంఫట్!
తిరుమల: తిరుమల తిరుపతిలో దేవస్థానం(టీటీడీ)లో మంగళవారం మరో అక్రమ బాగోతం వెలుగుచూసింది. స్వామివారి లడ్డూలను వెంకట రమణ అనే ఉద్యోగి కాజేసినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. దాంతో టీటీడీ అధికారులు అతన్ని సస్పెండ్ చేసినట్టు తెలిసింది. అయితే ఏడాది కాలంలో 60 వేల లడ్డూలు కాజేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. -
రూ.3.49 లక్షలతో ప్రైవేటు ఉద్యోగి జంప్
చిలకలగూడ (హైదరాబాద్): బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఇచ్చిన సొమ్ముతో ఉద్యోగి ఉడాయించిన సంఘటన హైదరాబాద్ నగరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్ వాకర్‌టౌన్‌కు చెందిన పి.ధర్మేందర్‌రెడ్డి స్థానికంగా కేవీకే వైన్స్ పేరిట మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇందులో బి.వెంకటరమణ (42) కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వైన్స్ యజమాని ధర్మేందర్‌రెడ్డి ఉద్యోగి వెంకటరమణకు రూ.3.49 లక్షలు ఇచ్చి మారేడుపల్లిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఖాతాలో జమచేయాలని పంపాడు. వైన్‌షాపునకు చెందిన ద్విచక్ర వాహనంపై వెళ్లిన వెంకటరమణ ఎంత సేపటికీ తిరిగిరాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి విచారించగా ఖాతాలో సొమ్ము జమ కాలేదని తేలింది. దీంతో బాధితుడు ధర్మేందర్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి, వెంకటరమణ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నమ్మించి..నట్టేట ముంచాడు!
ప్రియుడు పెళ్లాడే వరకూ దీక్ష విరమించేది లేదు.. ♦ రెండో రోజుకు చేరిన యువతి వెంకట రమణ మౌనదీక్ష ♦ బాధితురాలికి అండగా మహిళా, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ♦ చీరాలలో అర్ధరాత్రి మౌనదీక్ష శిబిరాన్ని పరిశీలించిన డీఎస్పీ జయరామరాజు చీరాల : ‘ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు.. నాకు న్యాయం జరిగే వరకూ మౌనదీక్ష విరమించేది లేదు’ అని ప్రియుని చేతిలో మోసపోయిన యువతి వెంకట రమణ తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్ కళాశాల లెక్చరర్ చేతిలో మోసపోయిన ఆమె.. చీరాలలోని అతడి ఇంటి ముందు శనివారం నుంచి చేపట్టిన మౌన దీక్ష ఆదివారానికి రెండో రోజుకు చేరుకుంది. ఆమెకు పలు రాజకీయ, మహిళా, ప్రజా సంఘాల నాయకులు అండగా నిలిచారు. బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలేనికి చెందిన ఇంజిరింగ్ విద్యార్థిని గుమ్మా వెంకట రమణ.. చీరాల వీరరాఘవపేటలో నివసించే కూరపాటి వెంకట పూర్ణచంద్ర ప్రసాద్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి వెంకట రమణను లోబరుచుకుని పెళ్లి చేసుకుంటాటనని మోసగించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు మౌనదీక్షకు దిగింది. ఆమె ప్రియుడు, ఇతర కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయినా ఆమె అర్ధరాత్రి కూడా ప్రియుని ఇంటిముందే దీనంగా కూర్చుని దీక్ష కొనసాగించింది. ఆ సమయంలో చీరాల డీఎస్పీ జయరామరాజు సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించారు. తనకు న్యాయం చేయాలని ఆమె డీఎస్పీని కోరింది. డీఎస్పీ ఆదేశాల మేరకు మౌనదీక్ష చేస్తున్న వెంకట రమణకు చీరాల ఒన్‌టౌన్ పోలీసులు రక్షణ కల్పించారు. బాధితురాలికి సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబు, నాయకులు సుదర్శన్, హరికృష్ణ, మస్తానమ్మలతో పాటు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఐ.లక్ష్మీశేషు, సీఐటీయూ నాయకుడు బాబూరాావు, మహిళా మండలి ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు పి.నందా మద్దతు పలికారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెళ్లి చేసుకునే వరకూ దీక్ష విరమించను : వెంకట రమణ నన్ను ప్రేమించి మోసం చేసి అన్యాయం చేసిన పూర్ణచంద్రప్రసాద్‌తో నా పెళ్లి జరగాలి. అప్పటి వరకూ మౌన పోరాటం ఆపను. ఈ సంఘటనలో పోలీసులు కూడా నిందితుని పక్షానే నిలిచి నాకు అన్యాయం చేశారు. నాకు మోసగించిన యువకునితో పది మందిలో పెళ్లి జరగాలి. లేకుంటే ఆందోళననను మరింత ఉధృతం చేస్తా. -
టీడీపీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ భర్త దాష్టీకం
వీరఘట్టం: మాటవినని ఉపాధి హామీ ఉద్యోగిపై జెడ్పీ వైస్ చైర్పర్సన్ భర్త(టీడీపీ) బెల్టుతో దాడిచేసిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీరఘట్టం మండలం సీఎస్పీ రహదారి నుంచి తూడి వరకు దాదాపు రూ.3లక్షల ఉపాధి హామీ నిధులతో రోడ్డు మంజూరు చేశారు. అధికార పార్టీ నేతలే పనులు దక్కించుకుని యంత్రాలతో పనిని పూర్తి చేశారు. వాటిని పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్ డి.శ్రీనివాసరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కూలీలతో చేయించిన మేరకు రూ.96వేలు మంజూరు చేశారు. మిగిలిన బిల్లు పెండింగులో పెట్టారు. ఆ బిల్లు చెల్లించాలని జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ ఖండాపు జ్యోతి భర్త వెంకటరమణ ఒత్తిడి చేసినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. అందుకు టెక్నికల్ అసిస్టెంట్‌పై వెంకటరమణ ఆగ్రహం వ్యక్తంచేశారు.దీనిపై విచారణ నిమిత్తం ఉపాధి హామీ పథకం ఏపీడీ శైలజ సోమవారం తూడి గ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కసుతో ఉన్న ఖండాపు సంయమనం కోల్పోయి తన బెల్టుతీసి శ్రీనివాసరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన ఫీల్డ్ అసిస్టెంట్ ప్రసాదరావుపైనా విరుచుకుపడ్డారు. బాధితులు ఎంపీడీఓ బి.విజయలక్ష్మికి దృష్టికి తెచ్చి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, దీనిని ఖండాపు వెంకటరమణ ఖండించారు. తాను దాడిచేయలేదన్నారు. -
ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌పై దాడి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌పై సోమవారం దాడి జరిగింది. వీరఘట్టం ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావుపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ కందాపు జ్యోతి భర్త వెంకటరమణ బెల్టుతో దాడిచేసినట్టు తెలిసింది. ఈ దాడిలో టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు అయ్యాయి. శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బడా స్మగ్లర్ వెంకట రమణ అరెస్ట్
కడప: ఎర్రచందనం స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతోపాటు మరో ఐదుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ మీడియాకు వివరాలు వెల్లడించారు. పోలీసులు ఒంటిమిట్ట వద్ద ఓ వాహనాన్ని ఆపి, అందులో ఉన్న 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతో పాటు మరో అయిదుగురు కూలీలను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు 4.57 టన్నుల బరువున్న 160 ఏ గ్రేడ్ దుంగలను స్వాధీనపరచుకున్నారు. విలువ రూ. 9 కోట్లు ఉంటుందని అంచనా. కాగా రమణకు టీడీపీ నేతలతో సంబంధాలున్నాయి. ఇతనిపై 14 కేసులున్నాయి. అక్రమ రవాణాలో అడ్డు వచ్చిన పోలీసు, అటవీ అధికారులను చంపడానికైనా వెనుకాడవద్దని డ్రై వర్, మేస్త్రీ, కూలీలకు వెంకట రమణ, ఇతర స్మగ్లర్లు సూచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. -
బతుకునివ్వండి
ఇరవై ఒక్కేళ్ల కుర్రాడు... తండ్రికి పనుల్లో సాయం చేస్తూ, తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, చెల్లెలికి అండగా నిలబడాల్సిన వయసులో ఆ యువకుడు ఇంటి నుంచి కదల్లేకపోతున్నాడు. వైద్యం చేయించే స్థోమత లేక కన్నీరు పెట్టుకుంటున్న తల్లిదండ్రులను చూసి తల్లడిల్లిపోతున్నాడు. ఒంటికి వచ్చిన జబ్బు ఏదో కూడా తెలీక, దానికి చికిత్స చేయించడానికి డబ్బుల్లేక రోజూ నరకం చూస్తున్నాడు. కన్నబిడ్డ బాధను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టని రోజు లేదు. బిడ్డను బతికించుకోవడానికి వారు కాసింత సాయం కోరుతున్నారు. మరికాసింత ధైర్యం కోరుతున్నారు. విజయనగరం(మాదంబట్లవలస): హుషారుగా ఆడుతూ పాడుతూ, తల్లిదండ్రులకు సాయం చేయాల్సిన ఆ యువకుడు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. కుమారునికి వచ్చిన అనారోగ్యాన్ని బాగుచేసేందుకు ఆ తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ అప్పులపాలవుతున్నారు. తెర్లాం మండలంలోని పాములవలస పంచాయతీ పరిధిలోని మాదంబట్లవలస గ్రామానికి చెందిన గంట ఆదినారాయణ, తవుడమ్మలకు వెంకటరమణ, చిన్నమ్మి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరమణ(21) ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పదో తరగతి పాసైన తర్వాత వెంకటరమణ ఆరోగ్య సమస్యలతో పై చదువులు చదవలేకపోయాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు వెంకటరమణను ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కోలా చెబుతుండడంతో ఇంతవరకు వెంకటరమణకు సరైన వైద్యం అందలేదు. ఇప్పటివరకు వెంకటరమణను తల్లిదండ్రులు తాము కూడబెట్టిన కూలి డబ్బులతో శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కేర్ ఆస్పత్రికి, శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రికి, విశాఖలోని కేజీహెచ్, మణిపాల్ తదితర ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించినప్పటికీ వెంకటరమణకు వచ్చినది ఏ రోగమో గుర్తించలేదు. వైద్యం కోసం వెళ్లిన ప్రతి సారీ రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో తండ్రి ఆదినారాయణ తన రక్తాన్ని కుమారునికి ఇవ్వడం, వేరే వ్యక్తుల నుంచి రక్తం కొనడం చేస్తూ వస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో వ్యాధి అని చెప్పి వైద్యసేవలు అందించేవారని వెంకటరమణ తల్లిదండ్రులు తెలిపారు. వెంకటరమణకు టీబీ అని, క్యాన్సర్ అని, ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం తమ బిడ్డ ఏమీ తినలేకపోతున్నాడని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంకటరమణ చెల్లి చిన్నమ్మి ఇంటర్ చదువుకుంది. అన్నయ్యకు వచ్చిన అనారోగ్యాన్ని చూచి ఆమె పూర్తిగా కుంగిపోతోంది. వెంకటరమణకు వైద్యం చేయించేందుకు తమ ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని, అందినంత వరకు అప్పులు చేసి ఇంతవరకు కుమారునికి వైద్యసేవలు అందించామని వెంకటమరణ తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమారుడిని బతికించుకోవడానికి దాతలు సాయం చేయాలని కోరుతున్నారు. దాతలు అందించే సాయమే తమ ఇంటి దీపాన్ని కాపాడుతుందని అంటున్నారు. - (తెర్లాం రూరల్) -
'సహనానికి మారు పేరు వెంకటరమణ'
హైదరాబాద్: ఇటీవల మరణించిన తిరుపతి ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ సహనానికి మారు పేరని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో వెంకటరమణ మృతిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం వెంకటరమణ సేవలను చంద్రబాబు కొనియాడారు. తొలుత తిరుపతి పట్టణ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆయన అనంతరం ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు వెంకటరమణ నిత్యం ముందు ఉండేవారని అన్నారు. -
'సహనానికి మారు పేరు వెంకటరమణ'
-
కోలుకున్న ఎమ్మెల్యే వెంకటరమణ
రెండు రోజుల తరువాతవెంటిలేటర్ తొలగింపు మరో 48గంటల పాటు వైద్య సేవలు హెల్త్ బులెటిన్‌లో స్విమ్స్ డైరె క్టర్ వెల్లడి తిరుపతి కార్పొరేషన్: తీవ్ర అస్వస్థతకు గురై, రెండు రోజులుగా స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం మెరుగుపడింది. ఎమ్మెల్యే కోలుకున్నట్టు సోమవారం రాత్రి 8.30 గంటలకు స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. షుగర్, బీపీ లెవల్స్ స్థాయి పడిపోవడం, కిడ్నీకి సంబంధించిన వ్యాధితో శనివారం నుంచి స్విమ్స్ ఆర్ఐసీయూలో వైద్య సేవలు అందించామని తెలిపారు. 48 గంటల పాటు వెంటిలేటర్‌పై మెరుగైన వైద్య సేవలు అందించడంతో, సోమవారం ఉదయం 8 గంటలకు వెంటిలేటర్‌ను తొలగించామన్నారు. అప్పటి నుంచి స్వతహాగా శ్వాస తీసుకుంటున్నారని, తన వద్దకు వచ్చే వారిని గుర్తించి, మాట్లాడుతున్నట్టు డాక్టర్ వెంగమ్మ తెలిపారు. వెంటిలేటర్ తొలగించినా కిడ్నీ వ్యాధి కావడంతో మరో 48 గంటల పాటు డయాలసిస్ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, పల్స్ రేట్ 68, బీపీ 140/80 గా ఉందని హెల్త్ బులెటిన్‌లో డాక్టర్ వెంగమ్మ స్పష్టం చేశారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శివకుమార్, స్విమ్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్, ఆర్ఎంవో కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంటకరమణకు వైద్య సేవలు అందిస్తున్నారు. -
తిరుపతి ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం
-
ఎమ్మెల్యే వెంకటరమణకు తీవ్ర అస్వస్థత
గుండెపోటుతో స్విమ్స్‌లో చేరిక పరిస్థితి విషమం అంటున్న వైద్యులు తిరుపతి: గుండెజబ్బుతో బాధపడుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంక టరమణ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంట్లో కళ్లుతిరిగి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ విలేకరులతో మాట్లాడుతూ బీపీ, సుగర్ లెవల్స్ తగ్గిపోయాయని, కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. దీనికితోడు గుండెపోటు కూడా రావడంతో పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నామని తెలిపారు. బీపీ లెవల్ కూడా 80/80కి పడిపోయిందని తెలిపారు. డయాలసిస్‌కు ఎమ్మెల్యే శరీరం సహకరించే పరిస్థితి కనపడడం లేదన్నారు. డయాలసిస్ చేస్తేగానీ ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని ఎమ్మెల్యేకి వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ వెంగమ్మతో పాటు ముగ్గురు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్విమ్స్‌కు వచ్చి తిరుపతి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. టీడీపీ నాయకులంతా స్విమ్స్ వద్దకు చేరుకున్నారు. -
పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి
-
పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి
హైదరాబాద్ : ముగ్గురు చిన్నారులను ఆటో ఎక్కించి, ఇప్పుడే వస్తానని చెప్పిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. దాంతో చాలాసేపు ఎదురు చూసిన ఆటో డ్రైవర్ చేసేదిలేక హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఆ చిన్నారులను అప్పగించాడు. మంగళవారం రాత్రి వెంకటరమణ అనే వ్యక్తి తన పిల్లలు భానుప్రసాద్, కవలలైన భాగ్యలక్ష్మి, భావనలను లక్డికపూల్ చౌరస్తా వద్ద ఆటో ఎక్కించి, ఉప్పరపల్లి చౌరస్తాలో దింపమని, తాను వెనకే బైక్‌పై వస్తానని ఆటోడ్రైవర్‌కు చెప్పాడు. అయితే ఉప్పరపల్లిలో ఎంతసేపు ఎదురుచూసినా .. వెంకటరమణ రాలేదు. పోలీసులు చిన్నారులను విచారించగా, తండ్రిపేరు తప్ప మరే వివరాలు చెప్పలేకపోతున్నారు. దాంతో పోలీసులు వీరి ఆచూకీ కనుక్కునే పనిలో ఉన్నారు. -
‘మధ్యాహ్నం’ గుడ్డు మాయం
కౌడిపల్లి: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు కోడిగుడ్డు కరువైంది. వారంలో రెండుసార్లు పిల్లలకు కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం ఒక్కసారే ఇస్తున్నారు. అయినా పాఠశాలల హెచ్ఎంలు మాత్రం పట్టించుకోవడంలేదు. మండలంలోని బండపోత్గళ్, కౌడిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యాసంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వారంలో ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారు. బండపోత్గళ్ ప్రాథమిక పాఠశాలలో 98 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ఇద్దరు మధ్యాహ్న భోజనం కార్మికుల వంట చేస్తున్నారు. కాగా పాఠశాల ప్రారంభం అయినప్పటి నుంచి కేవలం ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారు. దీంతోపాటు కౌడిపల్లి ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ సైతం కేవలం వారంలో ఒకేసారి పిల్లలకు కోడిగుడ్డు ఇస్తున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం వారానికి రెండురోజులు సోమ, గురువారం రెండుసార్లు విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టాల్సి ఉంది. సెలవులు వగైరాలున్నప్పుడు ఆ మరుసటి రోజు ఇవ్వాల్సి ఉంటుంది. అయినా ఈ పాఠశాలల్లో ఇవ్వడంలేదు. నిర్వాహకుల పేరిట మాత్రం ఆ పాఠశాలల హెచ్ఎంలు రెండురోజులు కోడిగుడ్డు పెడుతున్నట్లు బిల్లులు వేస్తుండటం గమనార్హం. అధికారి వివరణ ఈ విషయమై శుక్రవారం బండ పోత్ గళ్ ఇన్చార్జి హెచ్ఎం వెంకటరమణ, కౌడిపల్లి ఇన్చార్జి హెచ్ఎం బీమ్‌లను వివరణ అడగగా వారంలో ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారని తెలిపారు. బిల్లుమాత్రం రెండుసార్లు ఇస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇదే విషయమై స్థానిక ఎంఈఓ రాజారెడ్డిని వివరణ కోరగా కచ్చితంగా వారంలో రెండురోజులు కోడిగుడ్డు ఇవ్వాలని తెలిపారు. లేనట్లయితే ఎన్నిసార్లు కోడిగుడ్లు వండిపెడితే అన్నింటికి మాత్రమే బిల్లు చేయాలన్నారు. ఆ పాఠశాలలపై విచారణ చేసి చర్య తీసుకుంటామన్నారు. నిజమని తేలితే రికవరీ చేస్తామన్నారు. -
కాశ్మీర్ బాధితులకు అండగా..
సాక్షి, బళ్లారి : జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు బళ్లారి వాసులు ముందుకురావాలని ఉపమేయర్ జయలలిత, కార్పొరేటర్లు వెంకటరమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. జమ్ము కాశ్మీర్ బాధితులు కోసం విరాళాలు సేకరణకు సిటీ కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర వాసులు కూడా సాయం చేస్తే బళ్లారికి మంచి పేరు వస్తుందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, స్వచ్చంధ సంస్థలు జమ్ము కాశ్మీర్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు నడుం బిగించారని కొనియాడారు. అనంతరం నగరంలో పలు వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కారటగిలో.. కారటగి : కనకగిరి, కారటగి బ్లాక్ కాంగ్రెస్, యువ ఘటక ఆధ్వర్యంలో జమ్ముకాశ్మీర్ బాధిత కుటుంబాలకు విరాళాల సేకరణకు చిన్న నీటి పారుదల, జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడిగి మంగళవారం శ్రీకారం చుట్టారు. తమ నివాసం నుంచి ఆరోగ్య కేంద్రం వరకు పాదయాత్ర చేస్తూ మొత్తం రూ.77,120లను విరాళంగా సేకరించారు. మంత్రి వెంట తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు ఈరమ్మ, ఉపాధ్యక్షుడు శరణప్ప, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు బీ.శరణయ్యస్వామి, సభ్యులు అయ్యప్ప ఉప్పార, సిద్దప్ప, గద్దెప్ప నాయక్, కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, యువ ఘటక అధ్యక్షుడు శరణ బసవ రాజరెడ్డి ఉన్నారు. -
తుడా చైర్మన్‌గా వెంకటరమణ కొనసాగేనా?
తుడా వదులుకుంటే టీటీడీ ఎక్స్అఫిషియో పోతుంది ధర్మసంకటంలో ఎమ్మెల్యే సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా) చైర్మన్‌గా ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ కొనసాగే అంశంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో తుడా చైర్మన్‌గా నియమితులయ్యారు. అనంతరం వారం రోజుల వ్యవధిలోనే టీటీడీ పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా ప్రమాణం చేశారు. ఇదంతా వెంకటరమణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగింది. ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, తిరుపతి నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. శాసనసభ్యునిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంకటరమణ తుడా చైర్మన్ పదవిలో కొనసాగే విషయమై శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో ఎమ్మెల్యేగా ఎన్నికైనందున తుడాను వదులుకున్నట్టయితే ఆ పదవి మరో కార్యకర్తకు ఇచ్చే అవకాశం ఉంటుందని కొందరు సూచించినట్టు చెబుతున్నారు. నైతికంగా కూడా ఇది మంచిదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే తుడాను వదులుకుంటే టీటీడీ ఎక్స్అఫిషియో సభ్యత్వం కూడా పోతుంది. దీంతో తుడాను వదులుకునే విషయంలో ఎమ్మెల్యే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి నగరాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుడా చైర్మన్ కీలకం కానుంది. దీంతో వెంకటరమణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలుగుదేశం వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దాడి
నల్లచెరువు,న్యూస్‌లైన్: మండల పరిధిలోని గొర్లవాండ్లపల్లిలో ఆదివారం అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గ్రామానికి చెందిన నరసింహులు, వెంకటరమణపై, టీడీపీ నాయకులు నాగభూషణ, వెంకటరమణ, రమణప్ప, శంకర, శివన్న, వెంకటేషులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ మగ్బూల్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో మారెమ్మ దేవాలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రూ.3 లక్షలు విరాలం ప్రకటించి, అడ్వాన్సుగా రూ.లక్ష ఇచ్చారు. గుడి నిర్మాణం రూఫ్ లెవల్‌కు చేరుకుంది. అయితే ఎన్నికల్లో కందికుంట ఓడిపోవడంతో టీడీపీ నాయకులు ఆగ్రహించారు. దేవాలయ నిర్మాణానికి డబ్బు ఇచ్చినా ఓట్లు వేయలేదన్న ఆగ్రహంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. బాధితుల్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, నాయకుడు డాక్టర్ సిద్దారెడ్డిలు ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేకనే కందికుంట వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని, ఇది మంచిది కాదని వారు హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టకనే కందికుంట వర్గీయులు ఇలా విధ్వంసాలకు పాల్పడుతుంటే.. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు పోలీసులు కోరారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారంటూ కొడవలితో దాడి జౌకల(ఎన్పీకుంట), న్యూస్‌లైన్ : మండల పరిధిలోని జౌకల గ్రామంలో ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటేశారంటూ ఆ పార్టీకి చెందిన బాబురెడ్డిపై, ఆదివారం రాత్రి టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచు హనుమంతురెడ్డి, ఆయన అనుచరులు కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అంతకు ముందే నిన్ను చంపుతామంటూ ఫోన్లో బెదిరించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీకి చెందిన హనుమంతరెడ్డి, నరేంద్రరెడ్డి, రాణెమ్మ, రాజశేఖర్‌రెడ్డి, చిన్నపరెడ్డి, రమణమ్మ, జీవన్‌రెడ్డి, వేదాంతరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు సుమారు 30 మందికి పైగా బాబురెడ్డి ఇంటిపై దాడి చేశారు. అతని ముఖంపై కారంపొడి చల్లి, కొడవలితో గాయపర్చారు. దీంతో బాబురెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. దాడి చేస్తున్నారన్న సమాచారం తెలిపి చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని మరింత నష్టం జరగకుండా కాపాడారు. క్షతగాత్రున్ని బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. -
తిరుపతి టీడీపీ అభ్యర్థి ఇంట్లో 5 లక్షలు
చిత్తూరు జిల్లా తిరుపతి టీడీపీ అభ్యర్థి వెంకట రమణ ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలిసింది. అయితే, పోలీసులు తనిఖీ చేసేందుకు రాగా, వెంకటరమణ మాత్రం తనిఖీలకు నిరాకరించారు. ఆయన నివాసంలో దాదాపు 5 లక్షల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయినా, వాళ్లు మాత్రం ఆ డబ్బును స్వాధీనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు, మద్యం పంచుతున్న సంఘటనలు కళ్లెదుటే కనిపిస్తున్నా, పోలీసులు మాత్రం పట్టించుకోవట్లేదని స్థానికులు అంటున్నారు. -
నువ్వా- నేనా?
తిరుపతి దేశం నేతల్లో విభేదాలు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలించుకుంటున్న నాయకులు సాక్షి, తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. టికెట్టు తనకే అని చదలవాడ కృష్ణమూర్తి ధీమాగా ప్రకటిస్తున్నారు. భూకబ్జాదారులకు టికెట్టు వచ్చే ప్రసక్తే లేదని పరోక్షంగా వెంకటరమణను విమర్శిస్తున్నారు. వెంకటరమణ మాత్రం బయటపడకుండా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరోవైపు తనకు సేవారంగంలో మంచి గుర్తింపు ఉందని, కొత్తవాడినైన తనకు టికెట్టు ఇవ్వాలని డాక్టర్ హరిప్రసాద్ కోరుతున్నారు. బాబు ఎవరికీ హామీ ఇవ్వకుండా ఉండేసరికి ఎవరికి వారు వేర్వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. విషయమేంటంటే ఒకరి తరువాత ఒకరుగా పార్టీలో చేరిన నాయకుల మధ్య సఖ్యత లేకపోగా అప్పటికే పార్టీ జెండాలు భుజాన వేసుకున్న శ్రేణులతో వీరికి అసలు పొసగడం లేదు. ఈ నాయకులంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఒకరి గుట్టు ఒకరికి ఏదో రకంగా చేరిపోతోంది. దీంతో ఆయా నాయకులు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితి ఉంది. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న చదలవాడ కృష్ణమూర్తి, పీఆర్పీ మాజీ నేత ఊకా విజయకుమార్, కాంగ్రెస్ నుంచి టీడీపీ గొడుగు కిందకు చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, డాక్టర్ హరిప్రసాద్ తదితరులు ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరూ టికెట్టు ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. వీరంతా పూర్వపు పరిచయాలను ఉపయోగించుకుని ఒకరి శిబిరం గురించి మరొకరు ఆరా తీస్తున్నారు. కొందరు కార్యకర్తలకు ఇదే పనిగా మారింది. పగలంతా ఒక నేతతో ఉంటూ రాత్రికి మరో నేత దగ్గరకు వెళ్లి అక్కడి విషయాలు పూసగుచ్చినట్టు వివరిస్తున్నట్టు తెలిసింది. ఇటువంటి కోవర్టులను అందరు నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా పరస్పర ఆరోపణలకు కూడా దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణను భూకబ్జా కోరుగా చదలవాడ కృష్ణమూర్తి అభివర్ణించారు. ఆయన అనుచరులతో కూడా వెంకటరమణపై ఆరోపణలు చేయించారు. దీంతో తిరుపతి టీడీపీలోని లుకలుకలు బయటపడుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారు ఎవరి ఇష్టానుసారం వాళ్లు కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి టికెట్టు ఇచ్చినా మిగిలిన వారు పనిచేస్తారనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో లేదు. టీటీడీ వేదపండితులతో సుజనాచౌదరికి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ అసెంబ్లీ టికెట్టు కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఉగాది పర్వదినం రోజున తిరుపతి నుంచి వెంటబెట్టుకుని వెళ్లిన టీటీడీ వేదపండితులతో రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరికి ఆశీర్వాదాలు అందజేసినట్టు తెలిసింది. జిల్లాలో అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారాల బాధ్యతలు చూస్తున్న సుజనాచౌదరిని మచ్చిక చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వేసిన ఎత్తుగడగా చదలవాడ వర్గీయులు విమర్శిస్తున్నారు. కాగా ఊకా విజయకుమార్, డాక్టర్ హరిప్రసాద్‌లను తన వైపు తిప్పుకునేందుకు వెంకటరమణ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చదలవాడకు వ్యతిరేకంగా అందరిని ఒకతాటిపైకి తీసుకురావడం ద్వారా తనకు ఎదురులేకుండా చేసుకునేందుకు వెంకటరమణ పావులు కదుపుతున్నారు. మొత్తానికి తిరుపతి టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఇతర పార్టీల వారికి వినోదంగా మారాయి. -
తిరుపతి టీడీపీలో గోలగోల
టికెట్టు కోసం మూడు ప్రధాన సామాజికవర్గాల ప్రయత్నాలు చంద్రబాబుకు తలబొప్పి సాక్షి, తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్టు ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు అధినేతను ఒప్పించలేక కులాలను రంగంలోకి తెస్తున్నారు. ఆ పార్టీ కి చెందిన నాయకులు కులాల వారీగా విడిపోయి టికెట్టు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బలిజ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినంటూ నగరం లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలిజ సామాజికవర్గానికే చెందిన మరో మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకట రమణ కూడా టీడీపీ టికెట్టు కోసం కులం కార్డుతో చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నెల 8వ తేదీన మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో పాటు తిరుపతికి చెందిన ఊకా విజయకుమార్ (మాజీ పీఆర్పీ నేత) టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులు ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తిరుపతి టికెట్టు బలిజలకు ఇస్తున్నందున అందరం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చదలవాడ ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తుండగా అదే సామాజికవర్గానికి చెందిన వెంకటరమణ, ఊకా విజయకుమార్ టికెట్టు కోసం ప్రయత్నం చేస్తుండటంతో ఆ సామాజికవర్గంలో చీలిక తప్పదనే భావన వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా ప్రముఖవైద్యులు డాక్టర్ హరిప్రసాద్ కూడా కొత్తగా రంగంలోకి వచ్చారు. తిరుపతిలో తనకు విస్తృత పరిచయాలు ఉన్నాయని, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశానని తనకే టికెట్టు ఇవ్వాలని చంద్రబాబుని కోరినట్టు తెలిసింది. కాగా చంద్రబాబు సామాజికవర్గం నాయకులు కూడా ఇప్పుడు తిరుగుబాటు బాటలో నడుస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టికెట్టు ఇచ్చిన నాయకుల గెలుపు కోసం కృషి చేస్తుంటే ఒక్కసారి కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదని కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గాలి రాజేంద్రనాయుడు, కృష్ణమూర్తినాయుడు తదితరులు సామాజికవర్గ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈసారి కమ్మ సామాజికవర్గానికే తిరుపతి టీడీపీ టికెట్టు ఇవ్వాలని తీర్మానించారు. ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు. ఈ రెండు సామాజికవర్గాలతో పాటు టీడీపీకి పట్టు ఉన్న యాదవ సామాజికవర్గం నేతలు కూడా టికెట్టు కోసం పట్టుబడుతున్నారు. తిరుపతిలో ఆ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతలు ఉన్నా రు. ప్రతి ఎన్నికల సమయంలోనూ వారి పేర్లు తెరపైకి రావడం ఆ తర్వాత సద్దుమణగడం జరుగుతోం ది. ఈసారి మాత్రం చంద్రబాబుపై గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నా రామచంద్రయ్య బహిరంగంగానే తమ డిమాండ్‌ను వ్యక్తం చేస్తున్నా రు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే పదవుల వరకు వచ్చేసరికి పక్కనబెడుతున్నారనే ఆవేదన వారిలో ఉంది. టికెట్టు అడిగేందుకు ఇదే అనువైన సమయమని వారు భావిస్తున్నారు. యాదవ సామాజికవర్గాన్ని విస్మరిస్తే పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేయాలనే నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. దీంతో తిరుపతి టీడీపీలో సామాజికవర్గాల పోరు తుది అంకానికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోంది. అభ్యర్థి ఏ సామాజికవర్గానికి చెందిన వారైనా మిగిలిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. -
తుడా చైర్మన్‌గా వెంకటరమణ
అందరినీ ఆశ్చర్యపరుస్తూ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ తుడా చైర్మన్‌గా నియమితు లయ్యారు. తుమ్మితే ఊడే ముక్కులాంటి ఈ పదవిని ఆయన ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాక కాంగ్రెస్ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి, న్యూస్‌లైన్: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్‌గా మాజీ ఎమ్మెలే ్య వెంకటరమణ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 2010లో తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పదవిపై కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశలు పెంచుకుని తమ ప్రయత్నాలు సాగించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సాహసించని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు తుడా చైర్మన్ పదవిని కట్టబెట్టింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తుడా చైర్మన్‌గా వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ అభిమానులు కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి హర్షం ప్రకటించారు. పలువురునాయకులు, కార్యకర్తలు వెంకటరమణకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. కాగా 1982 ఆగస్టు 11న తుడా ఆవిర ్భవించింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, శ్రీకాళహస్తి, పుత్తూరు మున్సిపాలిటీలతో పాటు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లోని 160 పంచాయతీలు తుడా పరిధిలో ఉన్నాయి. తుడా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 11 మంది చైర్మన్లుగా పనిచేశారు. వెంకటరమణ 12వ వారు. -
‘సుప్రీం’ న్యాయమూర్తిగా జస్టిస్ రమణ
నియామక ఫైల్‌పై రాష్ట్రపతి ఆమోదముద్ర 13న ప్రమాణ స్వీకారం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నెల 13న ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. జస్టిస్ రమణ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి ఆయన పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్ రమణ నియామకపు ఫైల్ కేంద్ర న్యాయశాఖ నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లింది. దీనిని పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. జస్టిస్ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. క్యాట్, ఏపీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సివిల్, క్రిమినల్ కేసులతో పాటు రాజ్యాంగపరమైన వివాదాల్లో వాదనలు వినిపించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. అలాగే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2000, జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. తర్వాత 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన తర్వాత సీనియారిటీ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే జస్టిస్ కోకా సుబ్బారావు తరువాత ఈ పదవిని అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ రమణే అవుతారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే దాదాపు ఏడాదిన్నర పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. -
పాపం పసివాళ్లు
అతి చిన్నదైన జీవితాన్ని ఆనందంగా గడపటం చేతకాక ఎన్నో కుటుంబాలు ‘చితికి’పోతున్నాయి. అనుమానం పెనుభూతమై జీవితాలను అంతం చేసుకుంటున్నాయి. ఆ.. ఒక్క క్షణం ఓపిక పడితే ముందంతా బంగరు జీవితం వుందనే విషయాన్నే మరుస్తున్నారు. చివరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చిన్నారుల భవిష్యత్‌ను సైతం అంధకారం చేస్తున్నారు. అనాథలుగా మారుస్తున్నారు. సాక్షి, నరసరావుపేట :భార్యలపై అనుమానంతో భర్తలు అతి దారుణంగా హత్యలు చేస్తుంటే... క్షణికావేశంలో భార్యలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క విషయాన్ని పెద్దలు ఆలోచించడం లేదు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తమ బిడ్డల భవిష్యత్ ఏమిటన్నది వారికే అర్థం కాకుండా ఉంది. కళ్ల ముందే కన్నతల్లి రక్తపు మడుగులో ప్రాణం వదులుతుంటే, తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు తరలిస్తుంటే ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. సమాజంలో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావిస్తూ మానసిక పరిపక్వత రాకముందే బాల్య వివాహాలు చేస్తూ తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు. చిన్న వయస్సులో కుటుంబ భారం మీద పడి ఏది మంచి, ఏది చేడో తెలియక అనాలోచిత నిర్ణయాలతో తమ జీవితాలను బుగ్గిపాలు చేసు కుంటున్నారు. క్షణికావేశాలకు లోనై భార్యలను సైతం చంపడానికి భర్తలు వెనుకాడకపోవడం లేదా భార్యలు బిడ్డలు ఏమైపోతారోననే ఆలోచన లేకుండా ఆత్మహత్యలకు పాల్పడటం వంటి సంఘటనలతో చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమై ఎందరో చిన్నారులు అనాథలుగా మారి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. నరసరావుపేట పట్టణం ఏనుగుల బజారులో శనివారం జరిగిన సంఘటన పరిశీలిస్తే.. కోపర్తి వెంకటరమణ తన కుమార్తె సీతారావమ్మ అలియాస్ విజయలక్ష్మికి15 ఏళ్ళ వయసులోనే గురజాల మండలం చ ర్లగుడిపాడుకు చెందిన తంగెళ్ల సత్యనారాయణరాజుకు ఇచ్చి వివాహం చేసింది. పెళ్లయిన ఏడాదికి వారికి ఓ పాప. ఆ తరువాత రెండేళ్లకు ఓ బాబు పుట్టారు. కొద్దిరోజులకు దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుని విజయలక్ష్మి పుట్టింటిని ఆశ్రయించింది. భార్యను కాపురానికి పంప లేదని అత్తపైనా, పిల్లలను తనకు దూరం చేసిందని భార్యపైన కక్ష పెంచుకున్న సత్యనారాయణ రాజు శనివారం సాయంత్రం అత్తారింటికి చేరుకున్నారు. ఇంటి ముందు శుభ్రం చేస్తున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన అత్తను సైతం హతమార్చేందుకు ప్రయత్నించగా ఆమె పరారైంది. ఈ సంఘటనను అక్కడే వుండి చూసిన వారి చిన్నారులు భీతిల్లిపోయారు. రక్తపుమడుగులో ఉన్న తల్లిని చూసి చిన్నారులు రోదిస్తున్న తీరు అక్కడవున్న వారిచేత కంట తడిపెట్టించింది. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అనాథలుగా మారారు. మరో సంఘటనలో... రొంపిచర్ల మం డలం మాచవరంలో మద్యానికి బానిసైన బొడ్డు బొల్లయ్య అనే వ్యక్తి మందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. తల్లి మృతి చెందడం, తండ్రి పరారీలో ఉండటంతో ఏడాదిన్నర వయసు వున్న వారి పాప అనాథగా మిగి లింది. జిల్లాలో నెలకు ఒకటి చొప్పున జరుగుతున్న ఈ తరహా సంఘటనలకు క్షణికావేశమే కారణమని మానసిక వైద్యులు విశ్లేషిస్తున్నారు. -
జల్సా రాయుళ్లు
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్లలో రాగివైర్లను అపహరించే ఏడుగురి ముఠా సభ్యులను ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువ చేసే రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను అలిపిరి, తిరుచానూరు సీఐలు రాజశేఖర్, సాయినాథ్ విలేకరులకు వివరిం చారు. కేవీపల్లె మండలం వగళ్ల గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు రెడ్డెప్ప, బసవయ్య కుమారుడు జీవీ.రమణయ్య, వెంకటరమణ కుమారుడు గుణశేఖర్, రాజన్న కుమారుడు నాగరాజు, రెడ్డెప్పకుమారుడు రవితో పాటు రొంపిచెర్ల మండలం చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన మల్లయ్య కుమారుడు దేవయ్య, తిరుపతి జీవకోనకు చెందిన షేక్‌సికిందర్ కుమారుడు షేక్ మహేష్ ముఠాగా ఏర్పడి, జల్సాలకు అలవాటు పడ్డారు. రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్దనున్న ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైరును చోరీ చేసేవారు. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుచానూరు, రామచంద్రాపు రం, గాజులమండ్యం, వడమాలపేట, ఏర్పేడు, ముత్యాలరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలోని 86 ట్రాన్సఫార్మర్లలో రాగివైరును అపహరించుకెళ్లారు. దీన్ని అమ్మగావచ్చిన డబ్బును అందరూ పంచుకునే వారు. దాదాపు రెండేళ్లుగా 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 36 చోరీలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముఠాలోని సభ్యులందరూ ఆదివారం జూపార్కు రోడ్డులో వెళుతుండగా అటుగా వెళుతున్న సీఐలు రాజశేఖర్, సాయినాథ్, ఎస్ఐలు హరి ప్రసాద్, సురేష్‌కుమార్, ప్రవీణ్‌కుమా ర్, పీఎస్ఐ ఈశ్వరయ్య, ఈస్ట్ సబ్‌డివిజ న్ క్రైంపార్టీ పోలీసులు రాజు, రవిప్రకా ష్, వెంకటేశ్నాయుడు, శ్రీనివాసులు, ర విరెడ్డి, పండరీనాథ్, ముజీబ్, షాజహా న్లు వారిని ఆదుపులోకి తీసుకుని విచారించారు. అపహరణకు గురైన రూ.7 లక్షల విలువైన రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐలు వెల్లడించారు. -
మోపిదేవి వెంకటరమణను పరామర్శించిన జగన్