బడా స్మగ్లర్ వెంకట రమణ అరెస్ట్ | red sandal smuggler venkata ramana arrest | Sakshi
Sakshi News home page

బడా స్మగ్లర్ వెంకట రమణ అరెస్ట్

Published Tue, May 5 2015 6:15 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

బడా స్మగ్లర్  వెంకట రమణ అరెస్ట్ - Sakshi

బడా స్మగ్లర్ వెంకట రమణ అరెస్ట్

కడప: ఎర్రచందనం స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతోపాటు మరో ఐదుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వైఎస్‌ఆర్ జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ మీడియాకు వివరాలు వెల్లడించారు. పోలీసులు ఒంటిమిట్ట వద్ద ఓ వాహనాన్ని ఆపి, అందులో ఉన్న 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతో పాటు మరో అయిదుగురు కూలీలను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు 4.57 టన్నుల బరువున్న 160 ఏ గ్రేడ్ దుంగలను స్వాధీనపరచుకున్నారు. విలువ రూ. 9 కోట్లు  ఉంటుందని అంచనా. కాగా రమణకు టీడీపీ నేతలతో సంబంధాలున్నాయి. ఇతనిపై 14 కేసులున్నాయి.  అక్రమ రవాణాలో అడ్డు వచ్చిన పోలీసు, అటవీ అధికారులను చంపడానికైనా వెనుకాడవద్దని డ్రై వర్, మేస్త్రీ, కూలీలకు వెంకట రమణ, ఇతర స్మగ్లర్లు సూచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement