red sandal smuggler
-
‘ఎర్ర’డాన్ పెరుమాల్ అరెస్టు
చిత్తూరు అర్బన్: అంతర్ రాష్ట్ర స్మగ్లర్, తమిళనాడుకు చెందిన ‘ఎర్ర’డాన్ ఎం.పెరుమాల్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.2.50 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, రూ.50 లక్షల విలువైన 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి, ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి బుధవారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. తిరుపతి–బెంగళూరు బైపాస్‌రోడ్డులోని చెర్లోపల్లె క్రాస్ వద్ద చిత్తూరు తూర్పు సీఐ కె.బాలయ్య, తాలూకా ఎస్ఐ రామకృష్ణ, గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ బుధవారం తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో తిరుపతి నుంచి వేలూరు వైపు వస్తున్న మూడు కార్లు, ఓ ఐచర్ వ్యాను ఒక్కసారిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న తమిళనాడులోని ఇరుంబలికి చెందిన పెరుమాల్‌తో పాటు ఆరణికి చెందిన సి.వేలును అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలతో పాటు రూ.2.50 కోట్ల విలువ చేసే ఎర్రచందనం ఏ–గ్రేడు దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 14 కేసుల్లో నిందితుడు.. 33 ఏళ్ల పెరుమాల్.. 2014 నుంచే శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లను కూలీలతో నరికించి స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. 14 కేసుల్లో నిందితునిగా ఉన్న పెరుమాల్ ఏడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. 2015లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో విబేధాలు రావడంతో చిన్నయప్పన్ అనే వ్యక్తిని పెరుమాల్ హత్య చేశాడు. స్మగ్లింగ్ ద్వారా దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరణిలో రూ.10 కోట్ల విలువైన ఇళ్లు, ఇరుంబలిలో వ్యవసాయ భూములు, కొప్పంలో రూ.20 కోట్ల విలువైన ఇళ్లతో పాటు తిరువన్నామలై జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆస్తులను అటాచ్ చేయడంతో పాటు పీడీ యాక్టు పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
మంత్రి అనుచరులా..మజాకా!
మహానంది: ఎర్రమట్టి మాఫియాతో ప్రజలకు ముప్పు పొంచి ఉంది. మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి స్టిక్కర్లతో ఉన్న వాహనాలు అతివేగంగా వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మహానంది మండలం గాజులపల్లి అంకిరెడ్డిచెరువు వద్ద తాజాగా ఎర్రమట్టి రవాణా చేస్తున్న నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ స్టిక్కర్లతో ఉన్న వాహనాలు ఇక్కడ హల్చల్ చేస్తున్నాయి. రెండురోజులుగా వీటిలో కొందరు అక్కడా ఇక్కడా తిరుగుతూ భయాందోళనలు çసృష్టిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రెండు స్కార్పియోల్లో కొందరు హారన్స్ మోగిస్తూ అతివేగంగా వెళ్లడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే గాజులపల్లె మెట్ట వద్ద ఓ చిన్నారి రోడ్డు దాటుతుండగా ప్రమాదం త్రుటిలో తప్పింది. అలాగే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వర్గీయుడి ఇంటి ముందుకు రాగానే.. హారన్ కొడుతూ వేగంగా వెళుతుండటం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. మంత్రి అండదండలు ఉన్నాయన్న ధైర్యంతోనే ఇలా చేశారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అదే వాహనంలో సోమవారం సైతం అటూ ఇటూ తిరుగుతూ తాము మంత్రి మనుషులమని మరోసారి ప్రజలకు తెలిసేలా ప్రవర్తించారు. -
ఎర్రచందనం కేసులో బుల్లితెర నటుడు హరిబాబు అరెస్ట్
-
కమెడియన్ హరిబాబు అరెస్టు
సాక్షి, తిరుపతి : బుల్లితెర కమెడియన్, ఎర్రచందనం స్మగ్లర్ హరిబాబును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. గత కొద్ది రోజులుగా అతని కోసం టాస్క్ పోర్స్ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసే క్యారెక్టర్ ఆర్టిస్. తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉండిన హరిబాబు ఎర్రచందన స్మగ్లింగ్‌తో కోట్లకు పడగలెత్తాడు. అతను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడని సమాచారం. ఇటీవలే ఓ కమెడియన్ సినిమాకు సైతం హరిబాబే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ సీఐ మధుబాబు నేతృత్వంలో మంగళవారం హరిబాబును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కమెడియన్ కోసం పోలీసుల వేట
సాక్షి, తిరుపతి : ఎర్రచందనం స్మగ్లర్, బుల్లితెర కమెడియన్ హరిబాబు కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. టీవీ సీరియల్లు, స్టేజీ షోలు చేసుకొనే హరిబాబు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హరిబాబును పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారలు తెలిపారు. డబ్బుపై ఆశతో పోలీసుల కన్నుగప్పి ఎర్రచందనం అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలను సంపాదించాడు. అనంతరం ఆ డబ్బుతోనే సినిమాలకు ఫైనాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఇటీవలే ప్రముఖ కామెడీ షోలో పనిచేసిన కమెడియన్ సినిమాకు సైతం హరిబాబే పెట్టుబడి పెట్టాడు. సంబంధిత కథనం ఇక్కడ చదవండి : తెరవెనుక ఎర్ర స్మగ్లర్! -
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్ ఆర్టిస్ట్!
సాక్షి, తిరుపతి : ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన సినిమాకు పెట్టుబడి పెట్టాడు. సినిమా ఆర్టిస్ట్ రూపంలో ఉన్న ఆ ఎర్రచందనం స్మగ్లర్ కోసం తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు. తిరుపతికి చెందిన సాదా సీదా వ్యక్తి ఒకరు టీవీ సీరియల్స్, జబర్దస్త్ కార్యక్రమంలో ఆర్టిస్ట్‌గా నటించేవాడు. నిదానంగా ఎర్రచందనంస్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. శేషాచలంలోని చెట్లను నరికి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించడం ప్రారంభించాడు. తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్ల ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఎర్రచందనం దుంగలను తరలిస్తూ రూ.కోట్లకు పడగలెత్తాడు. టాస్క్‌ఫోర్స్ అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. దాంతో అతనిపై సుమారు 20 కేసులు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాకు ఫైనాన్స్ చేశాడని టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఇతనితో పాటు మరి కొందరు విద్యార్థులు, చిన్న చిన్న డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడితో పాటు అనుచరుల కోసం గాలిస్తున్నట్లు టాస్క్‌పోర్స్ అధికారులు తెలిపారు. 2017 నవంబర్‌లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ నిందితుల పేర్లు వెల్లడించడానికి వీలులేదని ఓ టాస్క్‌ఫోర్స్ అధికారి తెలిపారు. కేసులో మరో ఇద్దరు ఆర్టిస్టులు కూడా ఉన్నారని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
చదివింది బీటెక్.. చేసేది ఎర్రచందనం స్మగ్లింగ్
రాయచోటి టౌన్ : యువత వివిధ కారణాల రీత్యా పెడదోవ పడుతోంది. సంపాదన కోసం పెడదారి పట్టడానికి కూడా వెనకాడటం లేదనడానికి ఎర్రచందనం కూలీలే (యువకులే) నిదర్శనం. బుధవారం ఎర్రచందనం అక్ర మ రవాణాలో పట్టుబడిన వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన తమిళ మణి (22) యువకుడు బీటెక్ చదివాడు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడంతో జీవనోపాధి కోసం ఒక యజమాని వద్ద ఒక చిరుద్యోగంలో చేరాడు. ఆయన వద్ద వచ్చే సంపాదనతో ఇల్లు గడవడమే కష్టమైంది. ఇంతలో చెల్లి పెళ్లి కుదిరింది. ఏమి చేయాలో దిక్కుతోచక తాను పని చేస్తున్న యజమాని వద్దకు వెళ్లి తన సోదరి వివాహం కుదిరిందని.. కొంత డబ్బులు ఇస్తే ఉద్యోగం చేసే సమయంలో నెలనెలా కొంత మొత్తం కడతానని చెప్పారు. ఆ యువకుడి అవసరాన్ని తన ఆయుధంగా మార్చుకున్న యజమాని తాను ఇచ్చే డబ్బులు నెల నెలా తీర్చాల్సిన అవసరం లేకుండా మంచి అవకాశం ఇస్తానని, ఒక సారి తాను చెప్పిన పని చేస్తే లక్షాధికారి అవుతావని నమ్మించాడు. ఆ యువకుడు ఇదేదో చాలా బాగుందనుకొని అందుకు సరేనన్నాడు. ఏమి చేయాలని అడిగాడు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడి వైఎస్సార్ జిల్లాలోని అడవులలో ఎర్రచందనం తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పాడు. ఆ మాటలు నమ్మి వెంటనే రంగంలోకి దూకాడు. వచ్చిన మొదటి రోజే పోలీసులకు దొరికిపోయాడు. ఇది తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన తమళి మణి నిజ జీవిత చరిత్ర. -
ఎయిర్ హోస్టెస్..ఆపై మోడల్..ఇప్పుడు స్మగ్లర్
ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం. పాశ్చాత సంస్కృతిని తలపించే విధంగా పబ్బులు, డిస్కోల్లో తైతక్కలు. అబ్బో.. ఇక చెప్పుకుంటూ వెళ్తే అంతటితో ఆగదు. పైగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయిస్తూ స్మగ్లర్లకు రూ. కోట్లలో నగదు పంపిణీ. ఇంత చేస్తున్నదీ ఓ యువతి. ఆమె పేరే సంగీత చటర్జీ. వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.. చిత్తూరు పోలీసులు రెండు రోజుల క్రితం నిర్వహించిన ఆపరేషన్ రెడ్‌లో అరెస్టయ్యింది. ఈనెల 18న యువతిని చిత్తూరుకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు (అర్బన్): సంగీత చటర్జీ పేరు ఆపరేషన్ రెడ్‌లో కొత్తగా తెర పైకి వచ్చి న పేరు. ఇప్పటికే ఈమె భర్త లక్ష్మణ్‌పై జిల్లాలో పదుల సంఖ్యలో కేసులున్నా యి. ఎర్రచందనం దుంగల్ని చెన్నై, ముంబాయ్‌తో పాటు విదేశాలకు సైతం తరలించేవాడు. 2014 జూన్‌లో ఇతన్ని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు 2015 జూలై వరకు పీడీ యాక్టు కింద జైల్లో ఉంచారు. బెయిల్‌పై వచ్చిన లక్ష్మణ్ తన ప్రధాన అనుచరుడు విక్రమ్‌మెహందీతో కలిసి మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు పోలీసులకు పట్టుబడ్డారు. తీగ లాగిన పోలీసులకు సంగీత విషయం వెలుగు చూసింది. లక్ష్మణ్ అయిదేళ్ల క్రి తం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నా డు. విలాసవంతమైన జీవనం సంగీత ప్రపంచం. కోల్‌కతాలో ఎయిర్హోస్ట్గా పనిచేసేప్పుడు పలువురు అంతర్జాతీ య స్మగ్లర్లతో ఈమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల తరువాత మోడల్‌గా రాణించి పలు యాడ్స్‌లో సైతం నటించింది. అయితే లక్ష్మణ్ జైల్లో ఉన్న సమయంలో ఉత్తర భారతానికి చెందిన పలువురు స్మగ్లర్లకు భారీగా నగదు ముట్టచెప్పి ఎర్రచందనం దుంగల్ని విదేశాలకు తరలినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారిస్తే సంగీత చటర్జీ పేరు బయటకొచ్చింది. బర్మా నుంచి సంగీత హవాలా రూపంలో చెన్నైకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మోజెస్ ద్వారా రూ.10 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఈమెను పట్టుకోవడానికి చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్, పశ్చిమ సీఐ ఎం.ఆదినారాయణ తమ సిబ్బందితో కలిసి కోల్‌కతాకు చేరుకున్నారు. శనివారం సంగీత చటర్జీను కోల్‌కతాలోని న్యూగరియాలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే స్థానికంగా ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆమెను అక్కడి కోర్టులో అరెస్టు చూపించారు. ఒకరోజు తరువాత సంగీత బెయిల్‌పై విడుదలైంది. ఈమెపై జిల్లాలో నాలుగు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. యాదమరి, గుడిపాల, కల్లూరు, నిండ్ర స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాలో బెయిల్ వచ్చినప్పటికీ ఈనెల 18న చిత్తూరుకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక సంగీత అరెస్టు సమయంలో సీజ్ చేసిన ఆరు బ్యాంకు ఖాతాలు, ఓ లాకర్ తాళాలు చిత్తూరు పోలీసుల వద్ద ఉన్నాయి. వీటిని తీసి చూస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసు అధి కారులు చెబుతున్నారు. -
అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్ టింకూ అరెస్ట్
-
నేను దొంగను కాదు... వ్యాపారిని
మదనపల్లె రూరల్/పూతలపట్టు: ‘‘సారీ.. ఐయామ్ నాట్ ఏ తీఫ్.. ఐయామ్ ఏ బిజినెస్ పర్సన్..(నేను దొంగను కాదు... వ్యాపారిని)’’ అంటూ విలేకరుల ముందు చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ చెన్యీ ఫియాన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య ప్రోద్భలంతో అప్పుచేసి వడ్డీకి తెచ్చిన డబ్బుతో వ్యాపారం చేయడానికి ఢిల్లీకి వచ్చానన్నారు. తనను పోలీసులు అరెస్టు చేశారని, తన భార్య చుయాన్‌ఛుంగ్ ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని విలపించాడు. కాగా, ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడైన చెన్యీఫియాన్ను పోలీసులు బుధవారం మదనపల్లె కోర్టులో హాజరు పరిచారు. 14రోజుల రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. మరో నిందితుడు సెల్వరాజ్‌ను చిత్తూరు కోర్టులో హాజరు పరిచగా... అతడికీ 14 రోజుల పాటు రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. -
ముఖేష్ బదానీతో సంబంధాలపై విచారణ
కడప: బద్వేలులో ఇటీవల అరెస్ట్ అయిన స్మగ్లర్ నర్సింహారెడ్డి ఇచ్చిన సమాచారం ప్రకారం అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానీని అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య చెప్పారు. అతనికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో విచారించవలసి ఉందన్నారు. బదానీని ఈరోజు కోర్టులో హజరుపరుస్తామని చెప్పారు. కస్టడీ పటిషన్ వేయనున్నట్లు రామకృష్ణ తెలిపారు. ముఖేష్ బదానీని జిల్లా ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన ముఖేష్ బదానీ అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం స్మగ్లర్‌గా పేరొందాడు. బద్వేల్, రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లలో ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి బదానీపై పలు కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కొందరు టీడీపీ నేతలతో నేరుగా సంబంధాలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతనితో సన్నిహిత సంబంధాలను కొనసాగించిన వారిలో కొందరిని అట్లూరు, బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ బదానీని రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, సీఐలు రాజేంద్రప్రసాద్, వెంకటప్ప, మరికొంతమంది సిబ్బంది అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకొచ్చారు. అతనికి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరుస్తారు. -
బడా స్మగ్లర్ వెంకట రమణ అరెస్ట్
కడప: ఎర్రచందనం స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతోపాటు మరో ఐదుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ మీడియాకు వివరాలు వెల్లడించారు. పోలీసులు ఒంటిమిట్ట వద్ద ఓ వాహనాన్ని ఆపి, అందులో ఉన్న 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్మగ్లర్ బొడ్డె వెంకట రమణతో పాటు మరో అయిదుగురు కూలీలను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు 4.57 టన్నుల బరువున్న 160 ఏ గ్రేడ్ దుంగలను స్వాధీనపరచుకున్నారు. విలువ రూ. 9 కోట్లు ఉంటుందని అంచనా. కాగా రమణకు టీడీపీ నేతలతో సంబంధాలున్నాయి. ఇతనిపై 14 కేసులున్నాయి. అక్రమ రవాణాలో అడ్డు వచ్చిన పోలీసు, అటవీ అధికారులను చంపడానికైనా వెనుకాడవద్దని డ్రై వర్, మేస్త్రీ, కూలీలకు వెంకట రమణ, ఇతర స్మగ్లర్లు సూచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్
చిత్తూరు : ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన నలుగురు స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదయింది. చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఓఎస్డీ రత్న మంగళవారం మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. అజాజ్షరీఫ్, నాగేంద్రనాయక్, అబ్దుల్ ఖాదర్‌భాషా, ఇలియాజ్ ఖాన్‌లను పీడీ యాక్టు కింద వైఎస్సార్ జిల్లా సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 35 మందిపై పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. వీరిలో 11 మంది బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ వీరిపై అనుమానిత కేసులు తెరిచి నిఘా ఉంచామని చెప్పారు. జిల్లాలో దాదాపు 200 మంది వరకు ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడం ద్వారా ఎర్రచందనం రవాణాను కాస్త తగ్గించామన్నారు. ఈ సమావేశంలో సీఐలు చంద్రశేఖర్, సురేంద్రరెడ్డి, ఆదినారాయణ, నర్శింహులు, ఎస్ఐ వెంకటచిన్న తదితరులు పాల్గొన్నారు. నలుగురు ఎర్రస్మగ్లర్లపై ఉన్న కేసుల వివరాలు : అజాజ్ షరీఫ్ : ఇతనికి అజ్జూ భాయ్, అన్వర్ షరీఫ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతను బెంగళూరులోని కటిగనహళ్లికి చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్. వ్యవసాయం చేస్తూ విలాసవంతమైన జీవితం గడపడానికి ఐదేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 20 టన్నుల ఎర్రచందనం అక్రమంగా రవాణా చేశాడు. ఇతనిపై ఇప్పటి వరకు 20 వరకు కేసులు ఉన్నాయి. బుక్కా నాగేంద్ర నాయక్ : చిత్తూరు జిల్లా పీలేరులోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఇతడిని రాంజీ నాయక్ అని కూడా పిలుస్తారు. వృత్తి రీత్యా డ్రైవర్ అయినప్పటికీ ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించాడు. ఐదేళ్లుగా 20 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఇతనిపై జిల్లాలో 23 కేసులు ఉన్నాయి. అబ్దుల్ ఖాదర్‌భాషా : చప్పాని, చప్పు అనే పేర్లతో కూడా పిలవబడే ఇతడు చిత్తూరు నగరంలోని వినాయకపురంలో కాపురం ఉంటున్నాడు. బీకామ్ వరకు చదువుకుని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేశాడు. మూడేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 33 కేసులు ఉన్నాయి. ఇలియాజ్ ఖాన్ : బెంగళూరులోని అడగారకలహళ్లికి చెందిన ఇతడు రెండేళ్లుగా స్మగ్లింగ్ వృత్తిలో ఉన్నాడు. గత ఏడాది జిల్లాకు చెందిన పోలీసులు బెంగళూరులో దాడులు చేయగా, వారిపై దాడులకు సైతం తెగబడ్డాడు. ఇతనిపై 10 కేసులు ఉన్నాయి. -
లారీని ఢీకొట్టిన మరో లారి,డ్రైవర్‌కు గాయాలు