సాక్షి, తిరుపతి : ఎర్రచందనం స్మగ్లర్, బుల్లితెర కమెడియన్ హరిబాబు కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. టీవీ సీరియల్లు, స్టేజీ షోలు చేసుకొనే హరిబాబు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయి.
మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హరిబాబును పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారలు తెలిపారు. డబ్బుపై ఆశతో పోలీసుల కన్నుగప్పి ఎర్రచందనం అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలను సంపాదించాడు. అనంతరం ఆ డబ్బుతోనే సినిమాలకు ఫైనాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఇటీవలే ప్రముఖ కామెడీ షోలో పనిచేసిన కమెడియన్ సినిమాకు సైతం హరిబాబే పెట్టుబడి పెట్టాడు.
సంబంధిత కథనం ఇక్కడ చదవండి : తెరవెనుక ఎర్ర స్మగ్లర్!
Comments
Please login to add a commentAdd a comment