Hari Babu
-
స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి
'జబర్దస్త్' ప్రముఖ కమెడియన్.. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడని తాజాగా న్యూస్ బయటకొచ్చింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఓ హస్యనటుడు ఇలాంటి పనులు చేస్తున్నాడా అని మాట్లాడుకున్నారు. ఇంకొందరైతే తిట్టుకున్నారు. ఇప్పుడు వీటన్నంటికీ చెక్ పెట్టేందుకు డైరెక్ట్ గా సదరు కమెడియన్ స్పందించాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: విశాల్‌పై కేసును కొట్టివేసిన కోర్టు) 'జబర్దస్త్'లో కమెడియన్ గా చేసిన హరిబాబు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కీలకపాత్రధారి. గత కొన్నేళ్ల నుంచి పరారీలో ఉన్న ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా హరిబాబుపై మరో కేసు నమోదైంది. దీంతో మీడియాలో న్యూస్ వచ్చింది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరగడంతో ఓ వ్యక్తికి బదులు మరోవ్యక్తి ఫొటోలతో వార్తలు రాసేశారు. ప్రస్తుతం ఇదే షోలో హరికృష్ణ అనే కమెడియన్ చేస్తున్నాడు. అతడి బదులు ఇతడి గురించి అందరూ రాశారు. దీంతో కమెడియన్ గంపా హరికృష్ణ ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. 'స్మగ్లింగ్ కేసులో ఉంది నేను కాదు. నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్ టీమ్ లో హరిబాబు పనిచేశాడు. తర్వాత అతడు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికిపోయాడు. అప్పటికే నేను ఫేమ్ లో ఉండటంతో గూగుల్ లో ఆ పేరు కొడితే నా ఫొటోలు వచ్చాయి. నా ఫొటో పెట్టి వార్తలు రాసేశారు. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు' అని 'జబర్దస్త్' హరికృష్ణ అన్నాడు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బయటపెట్టాడు. (ఇదీ చదవండి: టాంగో ఇక లేదు.. సాయి తేజ్ ఎమోషనల్ పోస్ట్) -
టీడీపీ స్పెషల్ ఫ్లైట్‌లో బీజేపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ-టీడీపీ రహస్య కాపురం గుట్టు రట్టైంది. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్‌గా కొనసాగిస్తున్న ప్రేమాయాణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా బయట పెట్టారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీరును ఎండగట్టారు. బాబు.. ప్రజలు గమనిస్తున్నారు ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు. మరో ట్వీట్లో లోకేష్ బాబుకి ఇండిపెండెన్స్ డేకు రిపబ్లిక్ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీత గీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో A గ్రేడ్ ఇవ్వక తప్పదని అభిప్రాయపడ్డాడు. -
ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దోషులెవరో తేలిపోయింది
-
నిజమైన దోషులెవరో తేలిపోయింది
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దోషులెవరో తేలిపోయిందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై శనివారం ఆమె స్పందించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఆ కాంగ్రెస్ మద్దతుతోనే అవిశ్వాసం పెట్టి పార్లమెంట్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నిటీడీపీ నాయకులు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పార్లమెంట్లో రాహుల్ ఏపీ ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. ఏపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్సేనన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజనలో సీఎం చంద్రబాబుకు భాగం ఉందని ఆరోపించారు. ఏపీకి ఏమడిగినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. నిన్న పార్లమెంట్లో బీజేపీపై టీడీపీ అబద్ధాలు చెప్పిందన్నారు. దుగరాజుపట్నం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, కడప స్టీల్ ప్లాంట్ జాప్యం చంద్రబాబు వల్ల కాదా అని ఆమె ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ కచ్చితంగా ఇస్తామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడలేందని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొన్నారు. రాజ్‌నాథ్ వ్యాఖ్యలు వ్యక్తిగతం: హరిబాబు పార్లమెంట్లో చంద్రబాబుపై రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని విశాఖ పట్నం ఎంపీ హరిబాబు అన్నారు. ఏపీకి కేంద్రం ఏం చేయలేదనేది ప్రచారమేనని, తప్పకుండా రైల్వే జోన్ వస్తుందన్నారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు స్థలం చూపించమని ప్రభుత్వాన్ని కోరామన్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు అధికారికంగా లేఖలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దొంగల పార్టీ... టీడీపీ దొంగల దౌర్జన్య కారుల పార్టీగా మారిందని బీజేపీ అధికార ప్రతినిథి సుదీశ్ రాంబోట్ల మండిపడ్డారు. గతంలో ప్యాకేజీ ఒప్పుకున్న చంద్రబాబు ఎన్నికల కోసం యూటర్న్ తీసుకున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, మళ్లీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఆయన తప్పులు తమ మీద నెట్టి కాంగ్రెస్‌తో కలిసి గెలుస్తామనే భ్రమలో ఉన్నారని తెలిపారు. -
కమెడియన్ హరిబాబు అరెస్టు
సాక్షి, తిరుపతి : బుల్లితెర కమెడియన్, ఎర్రచందనం స్మగ్లర్ హరిబాబును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. గత కొద్ది రోజులుగా అతని కోసం టాస్క్ పోర్స్ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసే క్యారెక్టర్ ఆర్టిస్. తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉండిన హరిబాబు ఎర్రచందన స్మగ్లింగ్‌తో కోట్లకు పడగలెత్తాడు. అతను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడని సమాచారం. ఇటీవలే ఓ కమెడియన్ సినిమాకు సైతం హరిబాబే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ సీఐ మధుబాబు నేతృత్వంలో మంగళవారం హరిబాబును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కమెడియన్ కోసం పోలీసుల వేట
సాక్షి, తిరుపతి : ఎర్రచందనం స్మగ్లర్, బుల్లితెర కమెడియన్ హరిబాబు కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. టీవీ సీరియల్లు, స్టేజీ షోలు చేసుకొనే హరిబాబు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హరిబాబును పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారలు తెలిపారు. డబ్బుపై ఆశతో పోలీసుల కన్నుగప్పి ఎర్రచందనం అక్రమ రవాణా చేసి కోట్లాది రూపాయలను సంపాదించాడు. అనంతరం ఆ డబ్బుతోనే సినిమాలకు ఫైనాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఇటీవలే ప్రముఖ కామెడీ షోలో పనిచేసిన కమెడియన్ సినిమాకు సైతం హరిబాబే పెట్టుబడి పెట్టాడు. సంబంధిత కథనం ఇక్కడ చదవండి : తెరవెనుక ఎర్ర స్మగ్లర్! -
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్ ఆర్టిస్ట్!
సాక్షి, తిరుపతి : ఓనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన సినిమాకు పెట్టుబడి పెట్టాడు. సినిమా ఆర్టిస్ట్ రూపంలో ఉన్న ఆ ఎర్రచందనం స్మగ్లర్ కోసం తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు. తిరుపతికి చెందిన సాదా సీదా వ్యక్తి ఒకరు టీవీ సీరియల్స్, జబర్దస్త్ కార్యక్రమంలో ఆర్టిస్ట్‌గా నటించేవాడు. నిదానంగా ఎర్రచందనంస్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. శేషాచలంలోని చెట్లను నరికి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించడం ప్రారంభించాడు. తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్ల ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఎర్రచందనం దుంగలను తరలిస్తూ రూ.కోట్లకు పడగలెత్తాడు. టాస్క్‌ఫోర్స్ అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. దాంతో అతనిపై సుమారు 20 కేసులు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాకు ఫైనాన్స్ చేశాడని టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఇతనితో పాటు మరి కొందరు విద్యార్థులు, చిన్న చిన్న డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడితో పాటు అనుచరుల కోసం గాలిస్తున్నట్లు టాస్క్‌పోర్స్ అధికారులు తెలిపారు. 2017 నవంబర్‌లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ నిందితుల పేర్లు వెల్లడించడానికి వీలులేదని ఓ టాస్క్‌ఫోర్స్ అధికారి తెలిపారు. కేసులో మరో ఇద్దరు ఆర్టిస్టులు కూడా ఉన్నారని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
మహిళపై దాడి.. టీడీపీ బహిష్కృత నేత అరెస్ట్
సాక్షి, గుంటూరు : గతంలో దళిత మహిళ నాయకురాలిపై దాడి చేసిన మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బహిష్కృత నాయకుడు పోలవరపు హరిబాబును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ నిర్వహించిన ‘దళిత తేజం’ అనే కార్యక్రమంలో పోలవరపు హరిబాబు, వనరాణి అనే దళిత మహిళ నాయకురాలిని కులం పేరుతో దూషించి, దాడి చేశారు. తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. దాడికి గురైన ఆ మహిళ నాయకురాలు కూడా టీడీపీ పార్టీకి చెందిన నేతే కావడం గమనార్హం. దళిత తేజం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఒక దళిత మహిళను కులం పేరుతో దూషించి, దాడి చేసిన హరిబాబును కేవలం పార్టీ నుంచి సస్సెండ్ చేసి చేతులు దులుపుకుంది టీడీపీ. దీంతో వారు మహిళలకు ఇచ్చే గౌరవం ఎంటో తెలిసిపోతుంది. దాడి చేసిన నాయకుడు అధికార పార్టీకి చెందిన సామాజికవర్గం కావడంతో అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో కూడా ఒకసారి సస్పెండ్ చేసి మళ్లీ తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఈ కేసు ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. ఆ దళిత మహిళకు న్యాయం జరుగుతుందో లేదో. -
తాజా విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు నిరాశే!
-
ప్చ్: తెలుగు రాష్ట్రాలకు నిరాశే!
సాక్షి, న్యూఢిల్లీ: తాజా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు నిరాశ ఎదురైంది. తాజా విస్తరణలో మొత్తం 9 మంది కొత్తవారికి అవకాశం కల్పించినా.. అందులో తెలుగువారు ఒక్కరూ లేరు. కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కుతుందన్న ఆశతో శనివారం కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబుకూ చేదు అనుభవమే ఎదురైంది. ఏపీ నుంచి హరిబాబు లేదా మరొకరికి ఈసారి చాన్స్ దొరకవచ్చునని, తెలంగాణ నుంచి వెదిరె శ్రీరామ్ లేదా మురళీధర్‌రావు రేసులో ఉన్నారని ఊహాగానాలు వినిపించినా.. అవేమీ ఫలించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉందని మొదటినుంచి ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్లిపోవడం, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయడంతో రెండు కేంద్రమంత్రివర్గ స్థానాలను తెలుగు రాష్ట్రాలు కోల్పోయినట్టు అయింది. మరీ, విచిత్రమేమిటంటే.. తాజా మంత్రివర్గ విస్తరణతో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిథ్యమే కరువైంది. ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేని పరిస్థితులలో ప్రస్తుతం సహాయ మంత్రి హోదాలో కొనసాగుతున్న నిర్మలా సీతారామన్‌కు కేబినెట్ హోదాతో ప్రమోషన్ కల్పించినట్టు చెప్తున్నారు. అయితే, తమిళనాడులో జన్మించిన నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారా? అన్న విషయంలో స్పష్టత లేదు. వచ్చే ఏడాది హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పెద్దపీట వేశారు. అయితే, మరోసారి కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశముందని, అప్పుడు మిత్రపక్షాలు జేడీయూ, అన్నాడీఎంకేతోపాటు ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని చెప్తున్నారు. చదవండి: ఆ నలుగురికి ప్రమోషన్.. రక్షణశాఖ ఎవరికి? చదవండి: కొత్త మంత్రులు.. ఆ నలుగురు స్పెషల్ చదవండి: మోదీ కేబినెట్‌కు కొత్తరక్తం -
అమిత్‌షా పర్యటన వాయిదా
సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కాగా, శుక్రవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు మీడియాకు ఒక ప్రకటనలో విడుదల చేస్తూ.. ‘ఆగస్టు 28, 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరగవలసిన అమిత్ షా పర్యటన వాయిదా పడింది’ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ, ఢిల్లీ,హరియాణా, పంజాబ్‌ల్లో చెలరేగిన అల్లర్లు తదితర కారణాల వల్ల అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. -
భార్యను వదిలి..మరొకరితో పెళ్లి
- ప్రేమ పేరుతో వంచించిన కానిస్టేబుల్ హైదరాబాద్ ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని కొడుకు పుట్టాక.. మరొకరిని మనువాడిన కానిస్టేబుల్ ఉదంతమిది. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధి మూసాపేట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలివీ... 2011 సంవత్సరంలో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆనంద్‌గౌడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. ఆ సమయంలో అతడికి అనిత అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు 2013 మే 14వ తేదీన మూసాపేట్ రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు శ్రీహరి బాబు పుట్టాడు. అనంతరం వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయిన ఆనంద్‌గౌడ్ అక్కడ మరో యువతిని పెళ్లి చేసుకుని, అనితను పట్టించుకోవటం మానేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
తిరిగి వస్తుందనుకుంటే...
విగతజీవిగా కనిపించిన కుమార్తె గత నవంబర్‌లో ప్రేమజంట ఆత్మహత్య అప్పుడే ప్రియుడే మృతి మూడు నెలల తర్వాత {పియురాలి మృతదేహం గుర్తింపు హయత్‌నగర్: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే భయం ఓ ప్రేమజంటను ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ప్రేమ విషయం తెలిస్తే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయని భావించిన ప్రేమికులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన ఊపిరితో సంఘటనా స్థలం నుంచి వచ్చిన ప్రియుడు మార్గమధ్యలో మృతి చెందగా.. 3 నెలల తర్వాత ప్రియురాలి మృతదేహం బయటపడింది. ఇన్నాళ్లూ తమ కూతురు బతికే ఉందని భావించిన తల్లిదండ్రులకు విషాదం మిగిల్చిన ఈ ఘటన బుధవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అంబర్‌పేట నగరపంచాయతీ పరిధిలోని తట్టిఅన్నారంలో నివశించే బురుగు నారాయణ గౌడ్ స్థానికంగా మిర్చి బండి నిర్వహిస్తుంటాడు. ఆయన కూతురు మానస (18) టైలరింగ్ నేర్చుకునేది. అదే గ్రామంలో నివసించే నల్ల నర్సింహ కుమారుడు హరిబాబు (25) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మానస తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఆమెను వరంగల్ జిల్లా గీసుకొండలోని తన పెద్దమ్మ వద్దకు పంపించారు. ప్రియురాలిని మరిచిపోలేక హరిబాబు గత ఏడాది నవంబర్ 20న మానసను బైక్‌పై తీసుకొచ్చాడు. మరునాడు తెల్లవారుజామున తాము ‘ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాం.. చనిపోతున్నాం’ అని హరిబాబు ఫోన్ నుంచి ఇరువురి కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్ పంపారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వారిని వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నవంబర్ 21నపెద్ద అంబర్‌పేట సమీపంలోని పాపాయిగూడ చౌరస్తా వద్ద హరిబాబు అపస్మారక స్థితిలో కనిపించాడు. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తేల్చారు. మానస ఆచూకీ దొరకకపోవడంతో.. ఆమె బతికే ఉండవచ్చని తల్లిదండ్రులు భావించారు. ఎంత వెతికినా జాడ లేకపోవడంతో అదే నెల 25న గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అక్కడ మిస్సింగ్ కేసు న మోదు చేసుకున్నారు. మానస కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కొంతకాలంగా తట్టి అన్నారంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గ్రామస్తులు బుధవారం చుట్టు పక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. గ్రామంలోని గద్దగుండి చెలుక వద్ద నిర్జన ప్రదేశంలో బండరాయిపై ఓ మృతదేహం బయటపడింది. మృతదేహానికి ఉన్న చెవి కమ్మలు, పట్టా గొలుసులు, దుస్తుల ఆధారంగా మానసగా గుర్తించారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ‘మేం ప్రేమించుకుంటున్నాం. ఇది వరకే పెళ్లయింది. పెద్దలకు తెలిస్తే గొడవలు అవుతాయన్న ఉద్దేశంతో చనిపోతున్నాం. ఎవరి బలవంతమూ లేదు’ అని ఆ నోట్లో రాసి ఉంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
పార్క్ చేసిన బైక్ చోరీ.. .
చైనా బజార్ ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం అదశ్యమైన సంఘటన బుధవారం సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన హోంగార్డు హరిబాబు బుధవారం షాపింగ్ నిమిత్తం తన హిరో హోండా ద్విచక్ర వాహ నం (ఏపీ 29బీసీ1952)పై పిసల్‌బండ చౌరస్తాకు వచ్చాడు. కాగా పిసల్‌బండ చౌరస్తాలోని చైనా బజార్ షాపు ముందు తన వాహనాన్ని పార్కు లోనికి వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చి చూసేసరికి పార్కు చేసిన తన ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో హరిబాబు స్థానిక ప్రాంతాల్లో వాకబు చేయగా ఫలితం లేకుండా పోయింది. దీనిపై బాధితుడు హరిబాబు సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీని బలోపేతం చేయాలి
అనంతపురం కల్చరల్ : స్వచ్ఛమైన పాలన అందిస్తున్న నరేంద్రమోడీ పథకాలను కార్యకర్తలు సమర్థవంతంగా జనంలోనికి తీసుకుపోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని సాయి రెసిడెన్షియల్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాళ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. సభ్యత్వ నమోదులో బీజేపీ అన్ని పార్టీలకన్నా ముందుందని కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలబడడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ స్పూర్తితోనే పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. కరువు ప్రాంతంగా పేరొందిన జిల్లా సస్యశ్యామలం కావాలంటే అన్ని ప్రాజెక్టులు త్వరగా పూర్తికావాలని, అందుకు పరస్పర సహకారం అవసరమన్నారు. అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడానికి కేంద్రం అన్ని చర్యలు తీసకుంటుందని, ముఖ్యంగా పరిశ్రమల విషయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. విద్యుత్ నిలువ గల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. హరిబాబు కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు అండగా నిలవడానికి అన్ని చర్యలు తీసకుంటామన్నారు. -
బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి
కడప రూరల్ : దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. ఆదివారం కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరిబాబు మాట్లాడారు. విభజన జరిగినప్పుడు రాష్ర్ట పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.నరేంద్రమోడీ దేశ ప్రధాని కాగానే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం మారిపోయిందన్నారు. బీజేపీ పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు నిరంతరాయంగా విద్యుత్‌ను ఇస్తున్నామన్నారు. పలు ప్రాంతాల్లో సోలార్విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గడిచిన ప్రభుత్వ హయాంలో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగేవన్నారు. ప్రస్తుతం ఆ ధరలను పదిసార్లు తగ్గించుకుంటూ వచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించాలన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీని వాస్ మాట్లాడుతూ అదుపు తప్పిన భారత వ్యవస్థను దేశ ప్రధాని నరేంద్రమోదీ గాడిలో పెడుతున్నారన్నారు. విభజన హామీలు సాధించడంలో టీడీపీ విఫలం - కందుల శివానందరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కందుల శివానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తీరు చాలా బాధాకరమన్నారు. విభజన వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. విభజన హామీలను సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వైఎస్సార్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాయలసీమ అభివృద్ధి భారతీయ జనతాపార్టీతోనే సాధ్యమనే భావనతోనే తాము ఆ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. కందుల రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించి బీజేపీలో చేరుతున్నామన్నారు. బీజేపీలో చేరికలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో కందుల సోదరులు శివానందరెడ్డి, రాజమోహన్‌రెడ్డి, శివానందరెడ్డి తనయుడు చంద్ర ఓబుల్‌రెడ్డి (నాని) తదితరులతోపాటు మాజీమంత్రి సరస్వతమ్మ, మైదుకూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మిపార్వతి, రైల్వేకోడూరుకు చెందిన పారిశ్రామికవేత్త గల్లా శ్రీనివాస్, కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, లేవాకు మధుసూదనరెడ్డి, సమరనాథరెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వెంకయ్యనాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు నాగలిని బహూకరించారు. కార్యక్రమంలోపార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సానపురెడ్డి సురేష్‌రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి, వి ష్ణువర్దన్రెడ్డి, శ్యాం కిశో ర్, అల్లపురెడ్డి హరినాథరెడ్డి, ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, రమేష్‌నాయుడు పాల్గొన్నారు. వెంకయ్యకు ఘన స్వాగతం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కడపలో ఘన స్వాగతం ల భించింది. ఉదయం 11 గంటలకు ఆయన కడ ప విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా, 12 గంటలకు వచ్చారు. కడప నగర మేయర్ కె.సురేష్‌బాబుతోపాటు బీజేపీ నాయకులు శశిభూషణ్‌రెడ్డి, అల్లపురెడ్డి హరినాథరెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి, కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, చేపూరి శారద, రామ్మోహన్‌రెడ్డి, రమేష్‌నాయుడు, ఆర్డీఓ లవన్న, తహశీల్దార్ రవిశంకరరెడ్డి తదితరులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కందుల శివానందరెడ్డి తనయుడు చంద్ర ఓబుల్‌రెడ్డి (నాని), బీజేవైఎం నాయకులు రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కడప నగరం నుంచి ఎయిర్‌పోర్టు వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలియో చుక్కలు వేసిన వెంకయ్య కడప సెవెన్‌రోడ్స్ : కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం కడప నగరంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి ఇక్కడి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో చుక్కల మందును వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్, కలెక్టర్ కేవీ రమణ, ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ నరసింహులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నారాయణ నాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గెలిపించిన పార్టీ పై కూడా విశ్వాసం లేదు
పొదిలి: పదవీ కాంక్షతో, గెలిపించిన పార్టీపై కనీస విశ్వాసం కూడా లేకుండా...ఇంగిత జ్ఞానం లోపించిన ఈదర హరిబాబు చైర్మన్ కుర్చీలో కూర్చున్నారని, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో గెలిపించిన పార్టీపై కూడా విశ్వాసం లేదు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ ఆర్డర్‌ను కోర్టు తిరస్కరించింది...అదే చైర్మన్ కుర్చీలో కూర్చోవటానికి ఉత్తర్వుగా భావించి, కూర్చోవడం చిన్నపిల్లల చేష్టగా బాలాజీ అభివ ర్ణించారు. చైర్మన్‌గా హరిబాబు అనర్హుడని తేలిన తరువాత, అధికారుల సూచన మేరకు తాను చైర్మన్ పదవి చేపట్టానని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని, లేదా తననైనా సంప్రదించి పరిస్థితి గురించి అడగాల్సిందన్నారు. ఇవేమీ లేకుండా, నేరుగా కుర్చీలో కూర్చుంటే దాని అర్థం ఏమిటో అవగతం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సీఈవో, పంచాయతీ కమిషనర్‌కు లెటర్ పెట్టారు. టీడీపీవారు ఆ ఉత్తర్వులపై డివిజన్ బెంచికి అప్పీల్ చేశారు, ఈవిషయంలో తదుపరి ఆదేశాల కోసం సమాచారం ఇస్తున్నామని లెటర్ పెట్టారు. లీగల్ ఒపీనియన్ అనంతరం దానికి బహుశా సమాధానం వస్తుంది. రెండు మూడు రోజులు వేచి చూసే ఓపిక కూడా లేకపోతే ఎలా’ అని ప్రశ్నించారు. హరిబాబును చైర్మన్‌గిరికి అర్హుడని కోర్టు తేల్చిన మరుక్షణమే కుర్చీ వీడి, అతనికి దండ వేసి మరీ కుర్చీలో కూర్చునపెట్టే నైజం తనకుందని బాలాజీ చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే పదవి తప్ప, అది ఇంక దేనికీ పనికిరాద న్నారు. వైస్ చైర్మన్‌గా ఉండటం తనకు ఇష్టం లేదని, అయితే పార్టీ వ్యూహం మేరకు హరిబాబుకు సపోర్టు చేశామని చెప్పారు. చైర్మన్‌గా అధికారులు ఇచ్చిన ఆర్డర్ ఉంది, కుర్చీ ఉంది.. కారు ఉంది..జెడ్పీ సీఈవోనే బాలాజీనే జెడ్పీ చైర్మన్ అని తేల్చి చెప్పారు కదా అని అన్నారు. సమావేశంలో ఎంపీపీ కె.నరసింహారావు, కోఆప్షన్ సభ్యుడు షేక్.మస్తాన్‌వలి, పార్టీ మండల నాయకుడు వాకా వెంకటరెడ్డి, సర్పంచ్‌లు పి.శ్రీనివాసరావు, పి.ఓంకార్, వార్డు సభ్యులు షేక్.ఖాశీం, నాయకులు పి.బాలయ్య, గుంటూరు పిచ్చిరెడ్డి, టి.నరసారెడ్డి, వెలుగోలు కాశీ తద తరులు పాల్గొన్నారు. -
టార్గెట్‌కు సైకిల్
స్వతంత్రంగా ఎదిగేందుకు బీజేపీ వ్యూహం మూడేళ్లలో జిల్లాలో పాగా వేసేందుకు యత్నం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీ కార్యకర్తల సమావేశం సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో తెలుగుదేశం పార్టీని టార్గెట్‌గా చేసుకుని బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు లేకుండా ఎదిగేందుకు సిద్ధమవుతున్నారు. కర్నూలు నగరంలో శనివారం నిర్వహించిన బీజేపీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశమే అందుకు తార్కాణం. జిల్లాలో టీడీపీని కాదని స్వతంత్ర శక్తిగా ఎదగాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దానికి ఇదే సరైన సమయమని కూడా అంచనా వేస్తోంది. పార్టీ అధిష్టానం సూచన మేరకే రాష్ట్ర నాయకత్వం జిల్లాల్లో కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తోంది. నగరంలో శనివారం నిర్వహించిన జిల్లా సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, కేంద్ర మాజీ మంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశం నిర్వహణలోనూ, సక్సెస్ చేయడంలోనూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు, పాణ్యం, డోన్, బనగానపల్లి, కోడుమూరు నియోజకవర్గాల నుంచి తన అనుచరులను బస్సులు, లారీలు, ఇతర వాహనాల్లో తీసుకొచ్చారు. జిల్లా చరిత్రలో ఇప్పటిదాకా బీజేపీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగిన దాఖలాల్లేవు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకోవటంతో పార్టీ రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆయా జిల్లాల్లో ముఖ్యమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో జిల్లాలో బీజేపీకి ఊతం దొరికిందని చెప్పొచ్చు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించటంతో నిరసనగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పాణ్యం నుంచి పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. టీడీపీలో చేరకుండా ఉండేందుకు ఓ మాజీ మంత్రి అడ్డుపడ్డారని ప్రచారం కూడా జరిగింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయినాకాటసాని60 వేల పైచిలుకు ఓట్లు సంపాదించుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటంతో కాటసాని నేరుగా ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధిష్టానం సూచన మేరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా కర్నూలు, డోన్, పాణ్యం, బనగానపల్లి, కోడుమూరు నియోజకవర్గాల్లో ఉన్న కాటసాని వర్గీయులంతా ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు. టీడీపీకి దీటుగా.. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రెండు ఎంపీ, 11 మంది ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీ మూడు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. జిల్లాలో టీడీపీకి దీటుగా ఎదిగేందుకు కమలదళం చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న టీడీపీతో రాబోయే రోజుల్లో తమ్ముళ్లతో అవసరం లేకుండా చేసుకోవాలని కమలదళం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కాటసానిని టీడీపీలోకి రాకుండా అడ్డుకున్న వారిపైనా ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నారు. అందుకే టీడీపీకి చెందిన కార్యకర్తలు, బీజేపీ అభిమానులు, కార్యకర్తలను చేరదీస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. రానున్న కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేషన్‌ను చేజిక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. శనివారం జరిగిన సమావేశంలో కాటసాని సూచనప్రాయంగా కర్నూలు కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పటం గమనార్హం. కాటసాని మదిలో ఉన్నది నిజమే అయితే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో టీడీపీతో జతకట్టేది లేదని కాటసాని వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. మూడేళ్లలో పార్టీని పటిష్టం చేసి జిల్లాలో టీడీపీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగాలన్నదే లక్ష్యమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఆ మేరకు కాటసాని నివాసంలో బీజేపీ ముఖ్య నాయకులంతా ప్రత్యేకంగా సమావేశం కావటం గమనార్హం. -
నిలువునా ముంచారు..
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘పొత్తన్నారు.. మన వల్ల మేలు పొందారు. సహకరిస్తామన్నారు. కలిసివస్తామని నమ్మించారు. చివరికి నిలువునా ముంచేశారు. వెన్నుపోటు పొడిచారు.’ తెలుగుదేశం సహకారంపై ఇదీ బీజేపీ ముఖ్య కార్యకర్తల, క్షేత్రస్థాయి నాయకుల ఆక్రోశం. ఎన్నికల వేళ టీడీపీ స్థానిక నాయకుల నయవంచనపై కమలనాథుల గుండెల్లో వెల్లువెత్తిన ఆవేశం. ఎన్నికల సందడి సద్దుమణిగిన తరుణంలో, అంతా ఫలితాల కోసం ఉత్కంఠతో నిరీక్షిస్తున్న సమయంలో.. బీజేపీ స్థానిక నాయకులు పొత్తు చిత్తయిన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ పెద్దలతో నిర్వహించిన సమావేశాల్లో దీనిని ప్రస్తావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ లోక్‌సభ స్థానానికి అభ్యర్థి హరిబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో టీడీపీ వంచనను ప్రముఖంగా ప్రస్తావించారు. తమ్ముళ్ల సహాయ నిరాకరణంపై, ప్రచార సమయంలో వారి జులుంపై మండిపడ్డారు. రుషికొండలోని ఐటీ పార్క్‌లో బీజేపీ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆతిథ్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కేడర్‌లోని ముఖ్యులు.. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో కీలక భూమిక నిర్వర్తించిన నగర నాయకులు పాల్గొన్నారు. మీడియాను అనుమతించని ఈ సమావేశానికి సంబంధించి అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. నగరంలోని వివిధ వార్డుల్లో బీజేపీ నాయకులు ప్రచార సమయంలో టీడీపీ నేతల, కార్యకర్తల ధోరణిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. వారిని నమ్ముకునే కన్నా బయటి వారిపై విశ్వాసం పెంచుకోవడం లాభించిందని చెప్పారు. తమతో తిరుగుతూనే వెన్నుపోటుకు సిద్ధపడేవారని, వారితో తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డామని ఆరోపించారు. ఏ రోజు ప్రచారానికి పిలిచినా భారీగా ఆర్డర్లు ఇచ్చేవారని, దాంతో వారిని భరించడం కష్టంగా ఉండేదని విమర్శించారు. ముఖ్యంగా 32వ వార్డు, 14వ వార్డు, ఎన్ఏడీ కొత్తరోడ్, కొబ్బరితోట వంటి ప్రాంతాల్లో బీజేపీ జెండాలు పట్టుకోవడానికి కూడా టీడీపీ నేతలు ఇష్టపడేవారు కాదని దుయ్యబట్టారు. భీమిలి, పశ్చిమ, గాజువాక నియోజక వర్గాల్లో టీడీపీ సహకరించిన దాఖలాలు లేవన్నారు. టీడీపీ నేతల కన్నా కాంగ్రెస్ నాయకులు వెయ్యి రెట్లు నయమని కొందరు బహిరంగంగానే కుండబద్దలు కొట్టారు. గాజువాకతో బాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు తమతో లోపాయికారీ ఒప్పందాలకు వచ్చారని, కాంగ్రెస్ ఎంపీకి బదులు కమలానికి ఓటేయాలంటూ తమ ఎదురుగానే చెప్పారని తెలియజేశారు. ఈ పరిణామాలతో అవాక్కయిన బీజేపీ నేతలు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయవద్దని...తర్వాత ఇబ్బందులొస్తాయని వాళ్ల నోరు నొక్కేసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు పివి నారాయణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు. హరిబాబు ఏమన్నారంటే... ‘మనం స్వల్ప మెజార్టీతోనైనా గెలుస్తాం. కానీ మనం ఓడిపోతామని ఇంటెలిజెన్స్ మాత్రం నివేదిక ఇచ్చింది. మోడీ గాలి వీస్తున్న తరుణంలో టీడీపీతో పొత్తు బాగా కలిసి వచ్చింది. టీడీపీ నేతలు సహకరించకపోయినా పొత్తు వల్ల వారితో కలసి పనిచేయక తప్పలేదు. అందుకే కేడర్‌ను భారీగా పెంచుకోవాల్సి ఉంది. మనకు కేడర్ లేకనే పొత్తుకెళ్లాం.’ -
బీజేపీ ‘లోక్‌సభ’ జాబితా సిద్ధం
జాబితాలో పురందేశ్వరి, హరిబాబు.. పలు స్థానాలకు ఇద్దరు ముగ్గురి పేర్లు సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో ఏదైనా జరగొచ్చని, ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ జాతీయ నేతల సూచనల మేరకు లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ దాదాపు పూర్తి చేసింది. సీమాంధ్రలో 25 లోక్‌సభ స్థానాలకు 23 చోట్ల, 175 అసెంబ్లీ స్థానాలకు 138 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. లోక్‌సభ స్థానాల్లో విజయనగరం, చిత్తూరు మినహా అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు విశాఖపట్నం లోక్‌సభకు పోటీ చేయనున్నారు. పురందేశ్వరి పేరును విశాఖ, విజయవాడనుంచి పరిశీలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ ఖరారు చేసిన జాబితా.. అరకు- జీకే బాబు; శ్రీకాకుళం - వి.బాలకృష్ణ; అనకాపల్లి - కె.జనార్ధనరావు, జె.రెడ్డి బాలాజీ; కాకినాడ - టి.వి.సర్వారాయుడు, యూవీ రమణ, వి.సత్యనారాయణ; అమలాపురం (ఎస్సీ)- ఎం.ఎ వేమ, ఎం.రాణాప్రతాప్; రాజమండ్రి - ఆకుల సత్యనారాయణ; నరసాపురం - గంగరాజు, పి.పుల్లారావు, కె.రఘురామకృష్ణంరాజు; ఏలూరు- కోటగిరి శ్రీధర్; మచిలీపట్నం - బాడిగ రామకృష్ణ; విజయవాడ - పురందేశ్వరి, ఎర్నేని సీతాదేవి; గుంటూరు - ప్రభాకరరావు, శివనారాయణ; నరసరావుపేట - ఎం.శ్రీనివాస్, ఎన్.విష్ణు; బాపట్ల (ఎస్సీ)- దార సాంబయ్య; ఒంగోలు- ఎం.వెంకటేశ్వర్లు, గోపీనాథరెడ్డి; నంద్యాల - ఆదినారాయణ; కర్నూలు - కె.నీలకంఠ, బి.వెంకటరామయ్య; అనంతపురం- కె.బి.సిద్దప్ప, ఎం.టి.చౌదరి, ఎ.రామకృష్ణారెడ్డి; హిందూపురం- విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్.టి.చౌదరి; కడప- ఎస్.రామచంద్రారెడ్డి, ఎ.ప్రభావతి; నెల్లూరు- ఎస్.సురేష్‌రెడ్డి; తిరుపతి (ఎస్సీ)- ముని సుబ్రమణ్యం, సి.రాసయ్య, జి.ఆర్ గోపీనాథ్, గౌతమ్; రాజంపేట- శాంతారెడ్డి, హరినాథరెడ్డి పేర్లు జాబితాలో ఉన్నాయి. మచిలీపట్నం నుంచి ఖరారైన బాడిగ రామకృష్ణ ఇంకా పార్టీలో చేరకపోవడం విశేషం. -
ఆస్పత్రి ఉద్యోగి సస్పెన్షన్
ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : క్షతగాత్రుడి వద్ద బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించిన జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి అత్యవసర విభాగంలోని కాంపౌండర్ మద్దాల హరిబాబును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 22న భీమడోలు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన వెలమాటి నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో అతని వద్ద ఉండాల్సిన రూ.30 వేల నగదు, మెడలోని బంగారు గొలుసు, చేతి ఉంగరం చోరీకి గురయ్యాయి. -
శ్రీవారి దర్శన టికెట్ల దందా కేసులో నలుగురి అరెస్టు
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనాల దందా కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో తిరుపతికి చెందిన ఆరంబాకం కర్ణ(44), శంకు దామోదరం (35), ఒంగోలుకు చెందిన మాధవరావు (28), తిరుపతికి చెందిన పేట హరిబాబు(33) ఉన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారని ఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, దర్శన దళారులుగా అవతారం ఎత్తిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు మరికొందరిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
టీ- బిల్లుకు సవరణలు కోరుతాం: హరిబాబు
పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చిన సమయంలో సవరణలు, ఓటింగ్‌కు పట్టుబట్టాలని తమ పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్టు బీజేపీ సీమాంధ్ర నేత హరిబాబు చెప్పారు. ఒక వేళ ఇప్పుడు సీమాంధ్రులకు న్యాయం జరగకుంటే తాము అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటూనే, విభజన వల్ల సీమాంధ్రకు కలిగే నష్టం విషయంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తమ నాయకులతో మాట్లాడామన్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి బిల్లులో మార్పులు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు ఉందన్నారు. టీడీపీతో పొత్తుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారనే వార్తలు వస్తున్నాయని అడగ్గా.. ‘‘బీజేపీ ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర శాఖ అభిప్రాయాన్ని తీసుకుంటుంది. అంతిమంగా జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర పార్టీ అమలు చేస్తుంది. విభేదాలకు తావులేదు’’ అని బదులిచ్చారు. సీమాంధ్ర ప్రజల పీకమీద కత్తి పెట్టి విభజన చేస్తున్నారని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా ‘ మేము అలా అనుకోవడంలేదు. సీఎం కిరణ్ అనుకుంటున్నారు’’ అని బదులిచ్చారు.