‘సిద్ధార్థ్ రాయ్’ సినిమాతో హీరోగా మారిన బాలనటుడు దీపక్ సరోజ్ హీరోగా ద్వితీయ చిత్రం ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో దీక్షిక, అనైరా హీరోయిన్లు. తన్నీరు హరిబాబు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ సుజిత్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వేణు ఊడుగుల క్లాప్ కొట్టారు. సందీప్ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్స్ ప్రదీప్ మద్దాల, యదు వంశీ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు.
(చదవండి: : స్ప్రే ఎటాక్.. థియేటర్లలో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి)
హరీష్ గదగాని మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది’’ అని తెలి΄ారు. ‘‘అనూప్ రూబెన్స్‌గారు నా సినిమాకి సంగీతం అందించడం నా అదృష్టం’’ అన్నారు దీపక్ సరోజ్. ‘‘20 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. సినిమా మీద ΄్యాషన్‌తో నిర్మాతగా పరిచయమవుతున్నాను’’ అన్నారు తన్నీరు హరిబాబు.
Comments
Please login to add a commentAdd a comment