
‘వేర్ ఈజ్ ద పార్టీ.. బాసూ వేర్ ఈజ్ ద పార్టీ..’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని ‘వేర్ ఈజ్ ద పార్టీ..’ అంటూ సాగే ప్రత్యేక పాటలో ఆడిపాడారామె. ఆ తర్వాత ‘ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించారు.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రంలో ఊర్వశి ఓ కీలక పాత్ర చేయడంతో పాటు ‘దిబిడి దిబిడి’ పాటలో తనదైన డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘ఎన్టీఆర్ నీల్’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటించే భలే చాన్స్‌ని ఊర్వశీ రౌతేలా అందుకున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తర్వాతి షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment