దేవరలో మరో బాలీవుడ్ భామ.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే! | Urvashi Rautela Criptic Post With Tollywood Hero Jr NTR Goes Viral | Sakshi
Sakshi News home page

Jr NTR: 'మీతో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నా'.. దేవరతో బాలీవుడ్ భామ

Published Mon, Apr 15 2024 12:51 PM | Last Updated on Mon, Apr 15 2024 2:56 PM

Urvashi Rautela Criptic Post With Tollywood Hero Jr NTR Goes Viral - Sakshi

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.  ఈ సినిమాలో సైఫ్ ‍అలీఖాన్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. 

అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. గ్లోబల్‌ స్టార్‌ తారక్‌ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్‌ను కొనియాడింది. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు ఊర్వశి రౌతేలా దేవర చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో కనిపించనుందా? అంటూ కామెంట్స్‌ చేశారు. గతంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్‌ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన ఊర్వశి.. దేవరలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉది.  కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌ బాలీవుడ్ మూవీ వార్‌-2 షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement