అది నా అదృష్టం | Deepak Saroj New Movie Siddharth Roy Teaser Launch | Sakshi
Sakshi News home page

అది నా అదృష్టం

Published Fri, Jun 2 2023 12:35 AM | Last Updated on Fri, Jun 2 2023 5:30 AM

Deepak Saroj New Movie Siddharth Roy Teaser Launch - Sakshi

దీపక్‌ సరోజ్, తన్వి నేగి

‘‘ఆర్య’ చిత్రంతో బాల నటుడిగా నా కెరీర్‌ మొదలైంది. ప్రభాస్, మహేశ్‌బాబు, సుకుమార్, త్రివిక్రమ్‌గార్లతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ వంటి చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అని హీరో దీపక్‌ సరోజ్‌ అన్నారు. దర్శకులు హరీష్‌ శంకర్, వంశీ పైడిపల్లి వద్ద పని చేసిన వి. యేశస్వి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సిద్ధార్థ్‌ రాయ్‌’.

దీపక్‌ సరోజ్, తన్వి నేగి జంటగా జయ అడపాక, ప్రదీప్‌ పూడి, సుధాకర్‌ బోయిన నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు శ్రీరామ్‌ ఆదిత్య, కార్తీక్‌ వర్మ దండు, నిర్మాత వంశీ, రైటర్‌ లక్ష్మీ భూపాల విడుదల చేశారు. వి. యేశస్వి మాట్లాడుతూ– ‘‘సిద్ధార్థ్‌ రాయ్‌’ వంటి మంచి కథని చెప్పడానికి నేనూ నిర్మాణంలో భాగమయ్యాను. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement