‘ఇట్స్ ఓకే.. మూవ్ ఆన్ అవ్వాలిరా.. తప్పదు’ అంటూ అనంతిక సనీల్‌కుమార్ చెప్పిన డైలాగ్‌తో ‘8 వసంతాలు’ మూవీ టీజర్ ఆరంభమైంది. ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘ఎవరి తుఫాన్‌లు వారికి ఉంటాయి లోపల... కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు... అంతే తేడా’’ అంటూ కన్నా పసునూరితో అనంతిక సనీల్‌కుమార్ చెప్పే డైలాగ్స్ కూడా టీజర్‌లో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, కెమేరా: విశ్వనాథ్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment