Deepak Saroj
-
మరో అందమైన ప్రేమ కథతో రాబోతున్న దీపక్ సరోజ్!
‘సిద్ధార్థ్ రాయ్’ సినిమాతో హీరోగా మారిన బాలనటుడు దీపక్ సరోజ్ హీరోగా ద్వితీయ చిత్రం ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో దీక్షిక, అనైరా హీరోయిన్లు. తన్నీరు హరిబాబు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ సుజిత్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వేణు ఊడుగుల క్లాప్ కొట్టారు. సందీప్ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్స్ ప్రదీప్ మద్దాల, యదు వంశీ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. (చదవండి: : స్ప్రే ఎటాక్.. థియేటర్లలో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి)హరీష్ గదగాని మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది’’ అని తెలి΄ారు. ‘‘అనూప్ రూబెన్స్‌గారు నా సినిమాకి సంగీతం అందించడం నా అదృష్టం’’ అన్నారు దీపక్ సరోజ్. ‘‘20 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. సినిమా మీద ΄్యాషన్‌తో నిర్మాతగా పరిచయమవుతున్నాను’’ అన్నారు తన్నీరు హరిబాబు. -
లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్.. సాంగ్ విన్నారా?
బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. ఈ చిత్రాన్ని వి. యశస్వి దర్శకత్వంలో జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మిస్తున్నారు. రధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్..’ (జీవితం ఇంతందంగా ఉంది) అంటూ సాగేపాటని నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి,పాట బాగుందని యూనిట్‌ని అభినందించారు. వి. యశస్వి సాహిత్యం అందించిన ఈపాటని కార్తీక్, శ్రీనిషా జయశీలన్పాడారు. తన్వి నేగి, నందిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ ప్రో డ్యూసర్: బి. శ్యామ్ కుమార్. -
అది నా అదృష్టం
‘‘ఆర్య’ చిత్రంతో బాల నటుడిగా నా కెరీర్ మొదలైంది. ప్రభాస్, మహేశ్‌బాబు, సుకుమార్, త్రివిక్రమ్‌గార్లతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ‘సిద్ధార్థ్ రాయ్’ వంటి చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది’’ అని హీరో దీపక్ సరోజ్ అన్నారు. దర్శకులు హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వద్ద పని చేసిన వి. యేశస్వి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, కార్తీక్ వర్మ దండు, నిర్మాత వంశీ, రైటర్ లక్ష్మీ భూపాల విడుదల చేశారు. వి. యేశస్వి మాట్లాడుతూ– ‘‘సిద్ధార్థ్ రాయ్’ వంటి మంచి కథని చెప్పడానికి నేనూ నిర్మాణంలో భాగమయ్యాను. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు. -
కొత్త తరం ప్రేమకథ
‘అతడు, ఆర్య, ΄పౌర్ణమి, భద్ర’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. వి. యశస్వి దర్శకత్వంలో జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ పో స్టర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఆవిష్కరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కొత్త తరం ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇది. ఈ వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తన్వి నేగి, నాదిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ప్రొ డ్యూసర్: బి. శ్యామ్‌కుమార్. -
Siddharth Roy: హీరోగా మారిన ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్.. ‘ఫస్ట్‌లుక్’లోనే లిప్‌లాక్
‘అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారారు. ‘సిద్ధార్థ్ రాయ్’అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1 గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ , నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. విడుదలైన రెండు పోస్టర్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్లో దీపక్ సరోజ్ నోట్లో రెండు సిగరెట్లు, చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో దీపక్ దుస్తులపై రక్తం మరకలు ఉన్నాయి. మరొక పోస్టర్లో హీరోయిన్ తన్వి నేగితో అతను లిప్ లాక్ చేస్తున్నాడు. మొత్తానికి పోస్టర్లు చూస్తుంటే ‘సిద్ధార్థ్ రాయ్’ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తమ అభ్యర్థనను అంగీకరించి, కాన్సెఫ్ట్, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసినందుకు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్‌గారికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. -
దీపక్‌లో మంచి నటుడున్నాడు
‘‘చిన్న సినిమాలకు ఇదొక ట్రెండ్ సెట్టర్ కావాలని ఆశిస్తున్నాను. ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. దీపక్‌లో మంచి నటుడున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని సీనియర్ నటి జయప్రద అన్నారు. దీపక్ సరోజ్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో వెంకట చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘వందనం’. జె.పి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో ఎంపి టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. కొత్తగా ఉంది. దీపక్ బాగా నటించాడు. తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. దీపక్ మాట్లాడుతూ-‘‘ ‘లెజెండ్’, ‘మిణుగురులు’ చిత్రాలు నాకు మంచి పేరు తె చ్చిపెట్టాయి. నాకు హీరో అనిపించుకోవడం కన్నా, మంచి నటుడు అనిపించుకోవడం ఇష్టం. ఈ పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నా’’ అని అన్నారు. ఈ వేడుకలో నటుడు సుమన్, నిర్మాతలు ఎం.ఎల్. కుమార్ చౌదరి, దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.