
‘అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారారు. ‘సిద్ధార్థ్ రాయ్’అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1 గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ , నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు.
విడుదలైన రెండు పోస్టర్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒక పోస్టర్‌లో దీపక్ సరోజ్ నోట్లో రెండు సిగరెట్లు, చేతిలో ఎర్ర గులాబీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇందులో పొడవాటి జుట్టు, గడ్డంతో దీపక్ దుస్తులపై రక్తం మరకలు ఉన్నాయి. మరొక పోస్టర్‌లో హీరోయిన్ తన్వి నేగితో అతను లిప్ లాక్ చేస్తున్నాడు. మొత్తానికి పోస్టర్లు చూస్తుంటే ‘సిద్ధార్థ్ రాయ్’ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తమ అభ్యర్థనను అంగీకరించి, కాన్సెఫ్ట్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేసినందుకు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్‌గారికి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment