సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్‌గా చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)
సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.
80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.
(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)
నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్‌దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.
పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.
(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?)
Comments
Please login to add a commentAdd a comment