దీపావళికి హడావుడి లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా 'అమరన్'. తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. మేజర్ ముకందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు. విడుదలకు ముందు తెలుగులో పెద్దగా హైప్ లేదు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.
ప్రస్తుతం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కి చేరువలో 'అమరన్' ఉంది. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. ఎందుకంటే హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరీ ఈ రేంజ్ సక్సెస్ అయితే ఊహించలేదు. దీంతో ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ప్లాన్ మార్చుకుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)
లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' ఓటీటీలోకి రావాల్సింది. అంటే డిసెంబరు తొలివారంలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ కావడంతో మరో 1-2 వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుంటోందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డిసెంబరు మూడో వారంలోనే ఓటీటీలోకి 'అమరన్' వచ్చే అవకాశముంది.
అడివి శేష్ 'మేజర్' తరహా కథతోనే 'అమరన్' సినిమా తీసినప్పటికీ.. ముకుందన్ భార్య వైపు నుంచి స్టోరీ చెప్పడం, అలానే సాయిపల్లవి యాక్టింగ్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య 'కంగువ' చిత్రానికి రిలీజ్ ముంగిట తలనొప్పిగా మారింది. థియేటర్లు అనుకున్నంతగా దొరకడం కష్టమే అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)
Comments
Please login to add a commentAdd a comment