సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్ | Satya Dev Reveals His Scenes Edited RRR Movie | Sakshi
Sakshi News home page

Satya Dev: 'ఆర్ఆర్ఆర్'లో సత్యదేవ్ నటించాడా?

Published Tue, Nov 12 2024 9:57 AM | Last Updated on Tue, Nov 12 2024 11:25 AM

Satya Dev Reveals His Scenes Edited RRR Movie

సత్యదేవ్.. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలోనూ విలనిజం చేసి ఆకట్టుకున్నాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీలోనూ ఇతడు నటించాడు. కానీ ఆ సీన్లన్నీ లేపేశారు. ఆ విషయాన్ని మొహమాటపడుతూనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

'ఆర్ఆర్ఆర్' కోసం సత్యదేవ్.. దాదాపు 10 రోజుల పాట పనిచేశాడు. కానీ చివరకొచ్చేసరికి ఇతడికి సంబంధించి దాదాపు 16 నిమిషాలు సీన్లని ఎడిటింగ్‌లో తీసేశారు. ఆ టీమ్‌పై ఉన్న గౌరవంతోనే ఇప్పటివరకు బయటకు చెప్పలేదని.. కాకపోతే ఆ పదిరోజుల వర్క్ చేయడం మాత్రం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)

ఎడిటింగ్ చేస్తే చేశారు కానీ కనీసం 'ఆర్ఆర్ఆర్' టైటిల్ కార్డ్స్‌లోనైనా సత్యదేవ్ పేరు వేసి ఉండాల్సింది. కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా సత్యదేవ్ పేరు కనిపించదు. ఇతడు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు గానీ ఈ విషయంలో మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు.

సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన కన్నడ ధనంజయ.. ఇందులో కీలక పాత్ర పోషించాడు. చాన్నాళ్లుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్‌కి ఈ సినిమాతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement