TG Vishwa Prasad
-
పవన్ పార్టనర్ కు 1200 ఎకరాలు
-
పవన్ పార్ట్నర్కు 1,200 ఎకరాలు
వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పసందైన విందు భోజనానికి కొదవుండదన్నట్లు.. భూములు కేటాయించేవాడు బిజినెస్ పార్ట్నర్ అయితే ఎన్ని వందల ఎకరాలైనా సొంతమైపోతాయనేందుకు ఈ ‘ఒప్పందం’ అతికినట్లు సరిపోతుంది. సినిమా నిర్మాణానికి, వాహనాల తయారీకి ఎక్కడా పొంతన కుదరకున్నా, ఏ మాత్రం అనుభవం లేకున్నా.. ఆ పార్ట్నర్ అడగడం.. ఈ పార్ట్నర్ మద్దతు పలకడం.. పొలిటికల్ పార్ట్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. కనీసం ఈ–మొబిలిటీ వాహనాలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కూడా లేకుండానే ఏకంగా 1,200 ఎకరాలు కేటాయిస్తూ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం పట్ల అటు వ్యాపార ప్రముఖులు, ఇటు అధికారులు నివ్వెరపోతున్నారు. సాక్షి, అమరావతి: టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) ఈ పేరు చాలా మందికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) పలు సినిమాలు తీయడమే కాకుండా, ఆయనతో భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది ఈయనే. టీజీ విశ్వప్రసాద్‌కు ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వేల కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిపి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీ (లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్) తొలి దశలో 15 చిత్రాలు నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ అనే సినిమా కూడా తీశారు. అందులో అప్పటి జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిత్వ హననం చేసే విధంగా నటుడు పృథ్వీతో ఓ సీన్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా 2024 ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున అభ్యర్థిగా పోటీ చేయడానికి విశ్వప్రసాద్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా ఆ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో పోటీ చేయలేకపోయారు. అయితే ఎన్నికల ప్రచారానికి భారీగా నిధులు సమకూర్చినట్లు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫలితాల అనంతరం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో హైదారాబాద్‌లో విశ్వప్రసాద్ గ్రాండ్ పార్టీ ఇవ్వడంపై భారీగా చర్చ జరిగింది. పవన్‌కళ్యాణ్ పార్టనర్ అయినందునే ఆయనకు రూ.కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టేయడానికి ఫైళ్లు చకచకా కదిలాయని, ఆ వెంటనే ఒప్పందం కుదిరిందనే వాదన వినిపిస్తోంది. అనుభవం లేని కంపెనీతో ఒప్పందంపీపుల్ టెక్ టెక్నాలజీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ స్క్రీన్స్, పీఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, పీటీజీ వెంచర్స్, వీ జోన్ హాస్పిటల్స్ వంటి విభిన్న రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీజీ విశ్రప్రసాద్ ఇప్పుడు ఎటువంటి అనుభవం లేకుండానే ఈ–మొబిలిటీ పార్కుతోపాటు ఈ– స్కూటర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ–మొబిలిటీ వాహన తయారీ కోసం ఇంకా భాగస్వామ్య కంపెనీని కూడా ఎంచుకోలేదు. తైవాన్, కొరియా, చైనా దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొన్నారు. రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెట్టే ఆర్థికస్థితి పీపుల్ గ్రూపుకు లేనే లేదు. అయినా ఈ విషయాలు ఏమీ పరిగణనలోకి తీసుకోకుండా ఏపీ ఈడీబీ పీపుల్స్ గ్రూపుతో ఒప్పందం చేసుకుంది.కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 1,200 ఎకరాలను రూ.1,800 కోట్లతో ఈ–మొబిలిటీ పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు, యాంకర్ (ప్రధాన) కంపెనీగా పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ రూ.300 కోట్లతో ఈ –మొబిలిటీ యూనిట్‌ను ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.సచివాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్‌ను కలిసిన విశ్వప్రసాద్ రూ.6 వేల కోట్లు పైమాటేహైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధికి 2,621 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే ఆ భూమి పక్కనే 1,200 ఎకరాల్లో ఈ మొబిలిటీ పార్కు ఏర్పాటు చేస్తామంటూ పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం.. అనంతరం ఆ కాగితాలతో విశ్వప్రసాద్.. డిప్యూటీ సీఎంను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఎకరం రూ.కోటి వరకు ఉన్న ఈ భూమి ధర.. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధి చెందితే రూ.ఐదారు కోట్ల వరకు వెళుతుంది. ఈ లెక్కన 1,200 ఎకరాల భూమి విలువ రూ.ఐదారు వేల కోట్లకు పైగానే ఉంటుందని పరిశ్రమల శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అంశం తెలుగుదేశం పార్టీతో పాటు పరిశ్రమల శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.కారు చౌకగా కొట్టేసే యత్నంఓర్వకల్లు వద్ద సుమారు 9,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో తొలి దశలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిక్‌డిక్ట్ నిధులతో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం పారిశ్రామిక పార్కు కోసం 2,621 ఎకరాల భూమి బదలాయింపునకు ఆమోదం తెలిపింది. ఒక్కసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులు మొదలైతే అక్కడ భూముల రేట్లు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి 80 లక్షల నుంచి కోటి రూపాయల పైనే పలుకుతోంది. ఒకసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి అయితే ఈ రేట్లు నాలుగైదు రెట్లు పెరుగుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న డిప్యూటీ సీఎం వ్యాపార భాగస్వామి కారు చౌకగా ఈ భూములను కొట్టేసే విధంగా పథకం రూపొందించారు. పీపుల్ టెక్ పేరుతో ఈ మొబిలిటీ పార్కును ఏర్పాటు చేస్తున్నామంటూ ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షలకు అప్పగించే విధంగా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పుతున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడక్కడ ఏపీఐఐసీనే ఎకరం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలకు విక్రయిస్తుంటే అత్యంత కారుచౌకగా భూములను అప్పగించడానికి రంగం సిద్ధం కావడం వెనుక ఏం జరిగి ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్‌కళ్యాణ్ వ్యాపార భాగస్వామికి రూ.వేల కోట్ల విలువైన భూములను అత్యంత కారుచౌకగా ధారాదత్తం చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!
సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్‌గా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్‌దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
శ్రీవిష్ణు 'శ్వాగ్' టీజర్.. హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడే
‘రాజ రాజ చోర’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఎంతో వినోదాత్మకంగానే కాకుండా ఆసక్తిగా కూడా ఈ టీజర్ మెప్పిస్తుంది. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.తాజాగా విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై మంచి అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమా కాన్సెప్ట్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది. శ్వాగణిక వంశానికి చెందిన వాడిగా శ్రీవిష్ణు విభన్న గెటప్పులతో అలరించాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత ‘శ్వాగ్’తో శ్రీవిష్ణు హ్యాట్రిక్ హిట్ అందుకునేలా ఉన్నాడు. -
హరీశ్ శంకర్ గురించి నేను అలాంటి కామెంట్ చేయలేదు: నిర్మాత
రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈక్రమంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రిటిసిజం, ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి 13 నిమిషాల నిడివి తగ్గించారు. అయినా కూడా టికెట్లు మాత్రం తెగలేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అని నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ కామెంట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం గురించి వారిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చారు.స్క్రిప్ట్ బలంగా లేదు: టీజీవీ విశ్వప్రసాద్ మిస్టర్ బచ్చన్ సినిమాపై డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా రిజల్ట్ గురించి ఆయన ఇలా చెప్పారు.' సినిమా స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. ఈ విషయంలో మేము మిస్‌ఫైర్ అయ్యాం. కొంత ఎడిట్ చేసింటే బాగుండేది. మిస్టర్ బచ్చన్ సెకండాఫ్ కాస్త నిరాశపరిచింది. అయితే, కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు.'అని ఆయన చెప్పారు.టీజీ విశ్వప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. సినిమాను హరీశ్ శంకర్ నాశనం చేశాడని విశ్వప్రసాద్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విశ్వప్రసాద్ తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. హరీశ్ శంకర్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తాను అనని మాటలను మీడియా పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసిందని చెప్పారు. హరీశ్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చారు.డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా టీజీ విశ్వప్రసాద్ గురించి రియాక్ట్ అయ్యారు.. మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్.. అయితే, మీడియాలో మీరు అన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. మంచి విజయాన్ని తప్పకుండా అందుకుంటాం. అయితే, మిస్టర్ బచ్చన్ విడుదల సమయంలో మీడియాపై హరీశ్ శంకర్ చేసిన కామెంట్ల వల్లే సినిమాపై వేగంగా నెగిటివ్ టాక్ వ్యాప్తికి కారణమైందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
శర్వానంద్ 'మనమే' సినిమా విషయంలో మోసపోయాం: నిర్మాత
శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టిందని ప్రచారం అయితే జరిగింది. కానీ ఈ సినిమా విషయంలో భారీగా నష్టపోయామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. కొందరు చేసిన మోసంతో ఇప్పటికీ ఓటీటీలో కూడా సినిమాను విడుదల చేయలేకపోయామని ఆయన పేర్కొన్నారు.బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని శర్వానంద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల అయ్యి మూడు నెలలు అవుతున్నా ఓటీటీలోకి ఈ చిత్రం అందుబాటులోకి రాలేదు. అందుకు కారణాలను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఇలా తెలిపారు. మనమే సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో మోసపోయానని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. ఇండస్ట్రీలో ఒక సంస్థకు సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను అప్పగిస్తే.. ఆ సంస్థ మోసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పలు కారణాలు చెబుతూ మనమే చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను అమ్మలేదని ఆయన అన్నారు. దీంతో మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల తమకు భారీగా నష్టం వచ్చిందని విశ్వప్రసాద్ తెలిపారు.మనమే సినిమాకు సంబంధించి హక్కులను కొనుగోలు చేసిన వారు తమకు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదని నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించారు. దీంతో సుమారు 70 శాతం వరకు నష్టం వచ్చినట్లు ప్రకటించారు. వారు చేసిన మోసంపై తాము కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన అన్నారు. మనమే సినిమాను మాత్రమే ఆపేసి ఇతర సినిమాలను మాత్రం వారు ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. దీనిని బట్టి చూస్తే మనమే సినిమా ఓటీటీ విడుదల విషయంలో మరింత జాప్యం తప్పదని తెలుస్తోంది. -
అందుకే పదిహేనుకే వస్తున్నాం: టీజీ విశ్వప్రసాద్
‘‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభించినప్పుడే మే లేదా జూన్‌లోగా పూర్తి చేసి, ఆగస్ట్ 9న విడుదల చేయాలనుకున్నాం. అయితే సాంగ్స్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ తేదీన రిలీజ్ చేయలేదు. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ వాయిదా పడటంతో ఆగస్ట్ 15 సరైన తేదీ అని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జోడీగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘రవితేజగారితో మేం నిర్మించిన ‘ధమాకా’ మంచి హిట్టయింది.‘ధమాకా’కి ప్లస్‌లా ‘మిస్టర్ బచ్చన్’ ఉంటుంది. హరీష్ శంకర్, రవితేజలది క్రేజీ కాంబినేష్. ‘మిస్టర్ బచ్చన్’ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. ఇందులో వినోదం, మాస్, యాక్షన్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలుఉన్నాయి. హరీష్‌కి, మిక్కీ జె. మేయర్‌కి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అంత గ్రాండ్ ఔట్పుట్ తీసుకొచ్చారు. పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. ఆగస్ట్ 15కి తెలుగులో రెండు పెద్ద సినిమాలు ‘మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్’ వస్తున్నాయి.థియేటర్ల పరంగా ఈ రెండింటికీ ఎలాంటి సమస్య రాదు. పైగా లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తెలుగుతో పాటు హిందీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నాం. మా సంస్థ నుంచి దాదాపు 15 సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటిలో కన్నడంలో మూడు సినిమాలు, హిందీలో బాబీ డియోల్‌తో ఒక సినిమా, రెండు ఇంగ్లిష్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’ షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ ఏడాదిలోపు చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. -
నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ చూశారా?
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. ఇప్పుడు ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను మన ముందుకు తీసుకొస్తోంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా కేరళలో జరిగింది. కేరళ ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ అందాలే హైలెట్ కానున్నాయి. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ గారు, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల గారు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు. నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ చూస్తుంటే కేరళను అలా చుట్టి వచ్చినట్టుగా, మన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా, ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తోంది. నవ్వు, బాధ, ప్రేమ, స్నేహం ఇలా అన్ని ఎమోషన్స్‌ను ఎంతో సహజంగా చూపించినట్టుగా అనిపిస్తోంది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. -
కొత్త పాయింట్‌తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్‌బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇంట విషాదం
ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. విశ్వప్రసాద్ తల్లి గీతాంజలి (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గీతాంజలి గారు చికిత్స పొందుతున్నారు. కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం ఆమె తుది శ్వాస విడిచారు. గీతాంజలి గారికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు. -
పాన్ వరల్డ్ సినిమాలు నిర్మించడమే మా లక్ష్యం: టీజీ విశ్వప్రసాద్
‘‘సినిమా అనేది ఓ ప్రయాణం. ఈ ప్రయాణంలో విజయాలు, అపజయాలు ఉంటాయి. అయితే అపజయాలు వచ్చినప్పుడు అవి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రామాయణం ఆధారంగా రూపొందిన తాజా పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. భూషణ్ కుమార్, క్రిషణ్‌కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. కాగా తెలుగు సినిమా రిలీజ్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆదిపురుష్’ను తెలుగులో విడుదల చేయమని ప్రభాస్‌గారు చెప్పలేదు. అయితే ఈ అవకాశం గురించి ఆయనతో చర్చించిన తర్వాతే ‘ఆదిపురుష్’ని తెలుగులో విడుదల చేస్తున్నాం. తెలుగు హక్కులను జీఎస్టీతో కలిపి రూ. 185 కోట్ల రూపాయలకు తీసుకున్నాం. టీ– సిరీస్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది. టీ సిరీస్ ప్రొడక్షన్లో ప్రభాస్ హీరోగా రానున్న మరో సినిమా ‘స్పిరిట్’ని కూడా మేమే తెలుగులో విడుదల చేస్తాం. ఇక ‘ఆదిపురుష్’ సినిమా తెలుగు బుకింగ్స్ బుధవారం ఉదయం నుంచి ఓపెన్ అవుతాయి. ఓ సినిమా టికెట్ ధర పెంపుదల విషయం గురించి ప్రభుత్వాలతో చర్చించడం మాకిదే తొలిసారి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పాజిటివ్‌గానే స్పందించాయి. ఏపీ సీఎం జగన్‌గారు అప్రూవ్ చేశారు. ‘ఆదిపురుష్’ సినిమా టికెట్ ధరలను యాభై రూపాయలు పెంచుకునే అనుమతులు రెండు తెలుగురాష్ట్రాల్లో లభించాయి. అయితే ఇది సింగిల్ స్క్రీన్స్‌లో మాత్రమే. మా నిర్మాణ సంస్థలో త్వరితగతిన వంద సినిమాలను పూర్తి చేయాలన్నది మేం రీసెంట్గా సెట్ చేసుకున్న గోల్. మా బ్యానర్లో పాతిక చిత్రాలు రావడానికి ఐదేళ్లకు పైనే పట్టింది. కానీ మా 50వ సినిమా మైలురాయిని వచ్చే ఏడాదే చేరుకోబోతున్నాం. నాలుగైదు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి. పదిహేను సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. థియేటర్స్ బిజినెస్‌కు తోడు ఓటీటీ రైట్స్ బిజినెస్ కూడా ఉపయోగపడుతోంది. అందుకే మేం ఎక్కువ సినిమాలు చేయగలుగుతున్నాం. మా బ్యానర్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘కార్తికేయ 2’ తర్వాత మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాలను నిర్మించాలనేది మా లక్ష్యం. రాబోయే రెండు మూడేళ్లలో మేం హాలీవుడ్లో కూడా సినిమాలు నిర్మిస్తాం’’ అని అన్నారు.