రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈక్రమంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రిటిసిజం, ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి 13 నిమిషాల నిడివి తగ్గించారు. అయినా కూడా టికెట్లు మాత్రం తెగలేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అని నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ కామెంట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం గురించి వారిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చారు.
స్క్రిప్ట్ బలంగా లేదు: టీజీవీ విశ్వప్రసాద్
మిస్టర్ బచ్చన్ సినిమాపై డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా రిజల్ట్ గురించి ఆయన ఇలా చెప్పారు.' సినిమా స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. ఈ విషయంలో మేము మిస్‌ఫైర్ అయ్యాం. కొంత ఎడిట్ చేసింటే బాగుండేది. మిస్టర్ బచ్చన్ సెకండాఫ్ కాస్త నిరాశపరిచింది. అయితే, కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు.'అని ఆయన చెప్పారు.
టీజీ విశ్వప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. సినిమాను హరీశ్ శంకర్ నాశనం చేశాడని విశ్వప్రసాద్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విశ్వప్రసాద్ తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. హరీశ్ శంకర్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తాను అనని మాటలను మీడియా పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసిందని చెప్పారు. హరీశ్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చారు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా టీజీ విశ్వప్రసాద్ గురించి రియాక్ట్ అయ్యారు.. మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్.. అయితే, మీడియాలో మీరు అన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. మంచి విజయాన్ని తప్పకుండా అందుకుంటాం. అయితే, మిస్టర్ బచ్చన్ విడుదల సమయంలో మీడియాపై హరీశ్ శంకర్ చేసిన కామెంట్ల వల్లే సినిమాపై వేగంగా నెగిటివ్ టాక్ వ్యాప్తికి కారణమైందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment