మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్‌.. ఎక్కడ చూడాలంటే? | Mass Maharaja Raviteja Movie Mister Bachan Streaming On This Ott | Sakshi
Sakshi News home page

Raviteja: అర్ధరాత్రి నుంచే ఓటీటీలో మిస్టర్‌ బచ్చన్‌.. ఎక్కడ చూడాలంటే?

Sep 11 2024 5:57 PM | Updated on Sep 11 2024 6:47 PM

Mass Maharaja Raviteja Movie Mister Bachan Streaming On This Ott

మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్‌ బచ్చన్‌'. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా  ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ  రోజు ‍అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్‌.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.

అసలు  కథేంటంటే..

మిస్టర్‌ బచ్చన్‌ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన  ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌. ఓ వ్యాపారవేత్తపై రైడ్‌ చేసి బ్లాక్‌ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్‌ చేయిస్తాడు. దీంతో బచ్చన్‌ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.

వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్‌ ఎలా రైడ్‌ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్‌ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement