రవితేజ లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' థియేటర్లలోకి వచ్చేసింది. చాలా నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్లు వేశారు కానీ టాక్ అయితే పాజిటివ్‌గా రాలేదు. రవితేజ ఎనర్జీ, కొత్తమ్మాయి భాగ్యశ్రీ గ్లామర్ పరంగా ఏ లోటు లేనప్పటికీ మిగతా విషయాలు పరమ రొటీన్‌గా ఉన్నాయని చూసిన వాళ్లు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఎవరనేది కూడా తేలిపోయింది.
(ఇదీ చదవండి: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ)
2018లో హిందీలో వచ్చిన సినిమా 'రైడ్'. ఓ సాధారణ ఇన్‍కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. పలుకుబడి ఉన్న పెద్ద మనిషి ఇంటిపై రైడ్ చేసి ఎలా చెమటలు పట్టించాడనేదే స్టోరీ. దీనికి కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ , రవితేజ మార్క్ వినోదం జోడించి తీసిన తెలుగు సినిమా 'మిస్టర్ బచ్చన్'. హీరోయిన్‌గా చేసిన భాగ్యశ్రీ గ్లామర్, డ్యాన్సుల వల్ల కాస్త హైప్ పెరిగింది. కానీ ఈ అంచనాల్ని మూవీ అందుకోలేకపోయిందని అంటున్నారు.
ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన మూవీస్ అన్నీ థియేటర్లలో రిలీజైన 28 రోజుల తర్వాత వచ్చేస్తున్నాయి. బచ్చన్ కూడా నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబరు రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.
(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment