తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ | Mr Bachchan Movie Pre-Release Event At Kurnool Highlights And Deets Inside | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ

Published Tue, Aug 13 2024 1:05 AM | Last Updated on Tue, Aug 13 2024 11:18 AM

Mr Bachchan Pre-Release Event at Kurnool

రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని మా డీవోపీ అయాంక చాలా కలర్‌ఫుల్‌గా, లడ్డూలా చూపించారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’లో నేను, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించడానికి కారణం ఆయనే. 

మా డ్యాన్స్‌ మాస్టర్‌ భాను రెండు పాటలను ఇరగదీశాడు. భాస్కరభట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. ఈ మధ్య నాకు కాసర్ల, సాహితీ కూడా రాస్తున్నారు. కొత్త యాక్షన్‌ కో–ఆర్డినేటర్‌ పృథ్వీ చాలా కామ్‌గా ఉంటాడు. నాలుగు ఫైట్స్‌లో ఒక్క ఫైట్‌ తప్ప మిగతా మూడూ తనే చేశాడు. ఫైట్స్‌ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఇంకా ఇతర టీమ్‌ సభ్యులు కూడా బాగా హార్డ్‌వర్క్‌ చేశారు. మిక్కీ జే మేయర్‌ నుంచి అసలు ఇలాంటి మ్యూజిక్‌ వస్తుందని ఊహించలేదు.

 ఫస్ట్‌ టైమ్‌ ట్యూన్స్‌ వినిపించినప్పుడు ‘ఇది మిక్కీనా’ అనిపించింది. అంత మంచి పాటలు ఇచ్చాడు. వివేక్‌గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. విశ్వప్రసాద్‌గారూ... మీ ఫ్యాక్టరీ ఇలానే రన్‌ అవ్వాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. హరీష్‌ చాలా హార్డ్‌ వర్కర్‌. ఈ సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయి, మా కాంబినేషన్‌లో నెక్ట్స్‌ సినిమా హ్యాట్రిక్‌కి నాంది కావాలి. తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి) ఇరగదీయబోతున్నాం’’ అన్నారు. 

‘‘ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూసే సినిమా ఇది’’ అని హరీష్‌ శంకర్‌ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ రాజ్యసభ  సభ్యులు టి.జి. వెంకటేశ్‌ అతిథులుగాపాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement