మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీ రిలీజ్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 'మిస్టర్ బచ్చన్' సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ తర్వాత మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే జోడీగా కనిపించారు. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
కథేంటంటే..
మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.
వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment