రీసెంట్‌గా రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన దానికి.. మూవీ వచ్చిన తర్వాత అసలు పొంతనే లేదు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. సినిమాలో కంటెంట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ భార్య ఈమెనే అని ఓ నటి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.
(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)
చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్' సినిమాతో బోలెడంత పేరు తెచ్చుకున్నారు. కాకపోతే దాన్ని కొనసాగించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పిదమే తాజాగా రిలీజైన 'మిస్టర్ బచ్చన్'. సరే దీని గురించి వదిలేస్తే గతంలో ఇదే రవితేజతో 'మిరపకాయ్' అనే మూవీ చేశారు. ఇందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పక్కన ఓ అమ్మాయి నటించింది. అయితే ఈమెనే హరీశ్ శంకర్ భార్యని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.
తాజాగా ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్‌ని అడగ్గా.. తన భార్య పేరు, ఆ అమ్మాయి పేరు స్నిగ్ద అని అందుకే చాలామంది పొరబడుతున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసుకుంటోందని అన్నాడు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉండగా హరీశ్ శంకర్.. రామ్‌తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. బచ్చన్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)
Comments
Please login to add a commentAdd a comment