
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారట. ఈ మేరకు మలయాళ మీడియాలో వార్తలొస్తున్నాయి. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత, కండరాల నొప్పితో బాధపడుతున్నారని.. దీంతో కుటుంబ సభ్యులు ఈయన్ని ఆస్పత్రిలో చేర్పించారట. ఐదు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.
(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)
ఈ క్రమంలోనే మోహన్ లాల్ హెల్త్ బులెటిన్ అని ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇలా అస్వస్థత అని వార్తలు రావడంతో అభిమానులు ఏమైందోనని కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో కీలక పాత్ర చేసిన మోహన్ లాల్.. ఇప్పటి జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే.
ప్రస్తుతం ఎల్ 2, బరోజ్ సినిమాలతో కాస్త బిజీ ఉన్న మోహన్ లాల్.. వీటి షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లగా, అక్కడే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో తిరిగి ఊరికొచ్చేసి, ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది ఆయన క్లారిటీ ఇస్తే తప్ప బయటకు రాదు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ ఆశలన్నీ నాని 'శనివారం' పైనే..)
Comments
Please login to add a commentAdd a comment